Ind Vs Aus 2nd Test: అది 2020.. ఆస్ట్రేలియాలో భారత్ పర్యటిస్తోంది. తొలి టెస్ట్ ఆడుతోంది. అడి లైడ్ వేదికగా తలపడింది. వాస్తవానికి ఆ ఇన్నింగ్స్ ను ఏ భారత అభిమాని తలుచుకోడు. కనీసం గుర్తు తెచ్చుకోవడానికి ఇష్టపడడు. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత స్వల్ప స్కోరు ఇక్కడ నమోదు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 244 రన్స్ చేసింది. బౌలర్లు కూడా తమ వంతు సహాయం చేయడంతో భారత్ కు 53 రన్స్ లీడ్ లభించింది.
కానీ ఆ తర్వాత హేజిల్ వుడ్, కమిన్స్ సత్తా చాటడంతో 36 పరుగులకే కుప్పకూలింది. సెకండ్ ఇన్నింగ్స్ లో టీమిండియా ఆటగాళ్లు ఒక్కరంటే ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. నాటి పరాభావాన్ని తలుచుకొని బాధపడని భారతీయ అభిమాని లేడంటే అతిశయోక్తి కాక మానదు. మళ్లీ నాలుగేళ్ల తర్వాత ఇదే వేదికగా భారత్ ఆడుతోంది. అయితే ఈసారి సగటు భారతీయ అభిమాని నాటి పరాభవానికి గట్టి బదులు తీర్చుకోవాలని కోరుకుంటున్నాడు. పెర్త్ టెస్ట్ కంటే ఎక్కువగా ఆట సామర్థ్యాన్ని ప్రదర్శించాలని ఆశిస్తున్నాడు. అడి లైడ్ వేదికగా ఫ్లడ్ లైట్ల వెలుతురులో శుక్రవారం భారత కాలమాన ప్రకారం ఉదయం 9:30 నుంచి రెండవ టెస్ట్ మొదలవుతుంది. అయితే ఈ మైదానం భారత్ కు అనుకూలమైన వేదిక కాదు. 2020లో ఈ మైదానంపై రెండో టెస్టులో భారత్ కేవలం 36 పరుగులకే కుప్ప కూలింది. టెస్ట్ ఫార్మాట్ లో టీమిండియా కు ఇదే అత్యంత చెత్త స్కోరు. నాటి మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా పై ఓడిపోయింది. ఇప్పుడు ఆ ఓటమికి బదులు తీర్చుకునే అవకాశం లభించింది. ఇక పెర్త్ టెస్టులో ఆస్ట్రేలియా 295 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ ఓటమికి గట్టి సమాధానం ఇవ్వాలని ఆ జట్టు భావిస్తోంది. గాండ్రించిన బెబ్బులి లాగా రెచ్చిపోవాలని ఎదురుచూస్తోంది. మెరుగైన రికార్డ్ అడి లైడ్ వేదికపై కలిగి ఉన్న ఆస్ట్రేలియా జట్టు.. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి పోయిన పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది.
బ్యాటింగ్ లైనప్ ఓకే
గిల్, రోహిత్ రెండో టెస్టులోకి అందుబాటులో వచ్చారు. రాహుల్ ఓపెనర్ గా సంఘంలోకి దిగుతున్నాడు. పెర్త్ టెస్టులో యశస్వి జైస్వాల్, రాహుల్ అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించడంతో రోహిత్ తన స్థానాన్ని త్యాగం చేశాడు. స్థానంలో అతడు బ్యాటింగ్ కు వస్తాడని తెలుస్తోంది. మరోవైపు రోహిత్ ఇటీవల న్యూజిలాండ్ సిరీస్లో ఆకట్టుకోలేదు. ఆస్ట్రేలియాపై అతడికి గొప్ప ట్రాక్ రికార్డు లేదు. కెప్టెన్ గా అతడికి ఇదే చివరి ఆశ్చర్య పర్యటన కాబట్టి బ్యాట్ కు పదును పెట్టాల్సిన అవసరం ఉంది. గిల్ ఇటీవల జరిగిన వార్మప్ మ్యాచ్ ఏకంగా ఆఫ్ సెంచరీ చేశాడు..గిల్, రోహిత్ రాకతో దేవదత్, జూరెల్ రిజర్వ్ బెంచ్ కే పరిమితమయ్యారు. రాత్రిపూట ఈ వేదికపై గులాబీ బంతితో అదనపు పేస్ లభిస్తుంది కాబట్టి.. దానిని భారత ఆటగాళ్లు ఎలా ఎదుర్కొంటారనేది ఇక్కడ ఆసక్తికరం.
తుది జట్లు ఇవే
భారత్
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, గిల్, రోహిత్ (కెప్టెన్), పంత్, విరాట్ కోహ్లీ, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, సిరాజ్, బుమ్రా, రాణా.
ఆస్ట్రేలియా
బోలాండ్, కమిన్స్(కెప్టెన్), బోలాండ్, లయన్, స్టార్క్, మార్ష్, హెడ్, స్మిత్, ఉస్మాన్ ఖవాజా, స్వీనే, లబుషేన్.