spot_img
Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Telugu 8: యష్మీ వెంటపడుతున్న గౌతమ్..ఇబ్బంది పడుతున్న యష్మీ..వచ్చే వారం వీళ్లిద్దరి మధ్య...

Bigg Boss Telugu 8: యష్మీ వెంటపడుతున్న గౌతమ్..ఇబ్బంది పడుతున్న యష్మీ..వచ్చే వారం వీళ్లిద్దరి మధ్య పెద్ద గొడవలు రానుంది!

Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో టైటిల్ కొట్టేందుకు అన్ని విధాలుగా అర్హతలు ఉన్న ఇద్దరు ముగ్గురు కంటెస్టెంట్స్ లో ఒకరు గౌతమ్. సీజన్ 7 లో ఈయన ఆడిన ఆట తీరుకి కోట్లాది మంది అభిమానులు ఏర్పడ్డారు. బయటకు వెళ్లిన తర్వాత ఈయన పలు ఎంటర్టైన్మెంట్ షోస్ లో కనిపించాడు, అదే విధంగా ‘సోలో బాయ్’ అనే చిత్రంలో హీరోగా కూడా చేసాడు. అలా కెరీర్ ని సాగదీస్తున్న గౌతమ్ బిగ్ బాస్ సీజన్ 8 లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అడుగుపెట్టే అవకాశం వచ్చింది. సీజన్ 7 ప్రభావం కారణంగా గౌతమ్ మీద అంచనాలు ఆడియన్స్ లో భారీ గా ఉండేవి. ఆ అంచనాలకు తగ్గట్టుగా ఈయన గత వారం ఆడకపోవడం తో ఆయన అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. కానీ ఈ వారం మాత్రం ఆయన ఎంతో దమ్ముగా టాస్కులు ఆడి మెగా చీఫ్ అయ్యాడు.

ఇదంతా బాగానే ఉంది, కానీ ఆయన ఒక్క యష్మీ విషయం లో భవిష్యత్తులో బలహీన పడే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈమధ్య కాలంలో ఈయన యష్మీ వెంట పడుతున్నాడు. ఆమెతో పులిహోర కలపడమే కాకుండా, క్యూట్ గా బుజ్జగించడాలు, ఆట పట్టించడాలు వంటివి చేస్తున్నాడు. యష్మీ అతని ముందు ఇష్టం గా ఉన్నట్టుగానే నవ్వుతూ తీసుకుంటుంది కానీ, పృథ్వీ, విష్ణు ప్రియ ముందు నాకు అతను అలా చేయడం నచ్చట్లేదు, ఎవరైనా ఇష్టమైన వాళ్ళు అలా చేస్తే చాలా క్యూట్ గా ఉంటుంది, కానీ గౌతమ్ చేస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పుకొచ్చింది. అన్ని విషయాల్లో బోల్డ్ గా ఉండే యష్మీ, గౌతమ్ కి అలా చేయడం నాకు నచ్చడం లేదు అని చెప్పేస్తే, అతను మళ్ళీ అలా పులిహోర కలిపే కార్యక్రమాలు చేయకుండా సైలెంట్ గా ఉంటాడు కదా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు. హౌస్ లో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే, గౌతమ్ యష్మీ వెంట తిరుగుతుంటే, యష్మీ మాత్రం నిఖిల్ వెంట తిరుగుతుంది.

మొదటి నుండి నిఖిల్ అంటే చాలా ఇష్టం అంటూ చెప్పుకొచ్చిన ఈమె ప్రవర్తన ఇటీవల కాలం లో చూస్తుంటే, అతని పై ఫీలింగ్స్ ఉన్నట్టుగా సోషల్ మీడియా లో మాట్లాడుకుంటున్నారు. ఈ ట్రైయాంగులర్ లవ్ స్టోరీ చూస్తుంటే బిగ్ బాస్ సీజన్ 4 గుర్తుకు వస్తుంది. ఆ సీజన్ లో కూడా ఇంతే, అభిజిత్, మోనాల్, అఖిల్ మధ్య లవ్ ట్రాక్ నడిచింది. అదే ట్రాక్ ఈ సీజన్ లో కూడా కొనసాగుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే యష్మీ తో మామూలుగా ఉండదు అనే విషయం అందరికీ తెలిసిందే, ఆమె మరీ ఇబ్బంది పడితే గౌతమ్ ని నామినేట్ చేసి నాకు ఇష్టం లేదు అని చెప్పినా చెప్తుంది. ఆ పరిస్థితి వరకు తెచ్చుకోకుండా యష్మీ కి దూరంగా ఉంటూ, గేమ్ మీద ఫోకస్ చేసి టైటిల్ కొట్టాల్సిందిగా ఆయన అభిమానులు సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Telangana ACB: తెలంగాణ ఏసీబీ: పాముల వేట ముగిసింది.. అనకొండల హంట్ మొదలవుతోంది..

Telangana ACB: పుట్టల నుంచి పాములు బయటికి వస్తున్నాయి. ఆ పాముల వేట కూడా కొద్ది రోజులుగా ఆటంకం అనేది లేకుండా సాగుతోంది. అయితే ఇప్పుడు పాముల గుట్టు తెలిసిపోయింది. పాములు...

Ravi Prakash: టీవీ9ను కొట్టేసిన రవి ప్రకాష్..

Ravi Prakash: మెరుగైన సమాజం అనే ట్యాగ్ లైన్ తో సరిగా దశాబ్దాల క్రితం రవి ప్రకాష్ శ్రీ ని రాజుతో కలిసి టీవీ9 అనే మహా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు....

Narendra Modi Strategy: ఢిల్లీ కాక్రోచ్‌లపై మోదీ హిట్‌ వ్యూహం.. దెబ్బకు దిగొచ్చిన ఆందోళనకారులు!

Narendra Modi Strategy: నీట్‌ పేపర్‌ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో మొదలైన ఉద్యమం క్రమంగా దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించింది. ఢిల్లీలో సీజేపీ నాయకత్వంలో సాగుతున్న ఈ ఆందోళనకు ఇతర రాష్ట్రాల్లో రాజకీయ...

SS Rajamouli: వారణాసి బడ్జెట్ పెరగడం మీద స్పందించిన రాజమౌళి…

SS Rajamouli: మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. మొదట 1000 కోట్ల బడ్జెట్ తో తీసేద్దాం అనుకోని ఈ సినిమాని...

Three Sisters Marry One Man: ఒక యువకుడితో ముగ్గురు పెళ్లి చేసుకుందే కాక.. దారుణం.. ఇది ఊహించని...

Three Sisters Marry One Man: దేశవ్యాప్తంగా కొద్దిరోజులుగా నీట్ గురించి రచ్చ రచ్చ జరుగుతుంటే.. ముగ్గురు అక్కా చెల్లెళ్లు మాత్రం మీడియం మొత్తం తన వైపు తిప్పుకున్నారు. తమ గురించి మాట్లాడుకునే...
Oktelugu Epaper
Exit mobile version