https://oktelugu.com/

Bigg Boss Telugu 8: యష్మీని వాడుకున్నావ్ అంటూ నిఖిల్ పై రెచ్చిపోయిన గౌతమ్..నోరు జారితే పగిలిపోతాది అని వార్నింగ్ ఇచ్చిన నిఖిల్!

అన్యాయంగా వ్యవహరించడం వల్లే గౌతమ్ గ్రాఫ్ వేరే లెవెల్ కి వెళ్ళింది, కచ్చితంగా టైటిల్ కొట్టేస్తాడు అని నిఖిల్ ని అభిమానించే వాళ్ళు కూడా చెప్పుకొచ్చారు. అయితే కాసేపటి క్రితమే విడుదలైన రెండవ ప్రోమో లో గౌతమ్, నిఖిల్ కి మధ్య పెద్ద గొడవ జరిగినట్టు చూపించారు.

Written By:
  • Vicky
  • , Updated On : December 2, 2024 / 05:39 PM IST

    Bigg Boss Telugu 8(259)

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు అనేది కచ్చితంగా విశ్లేషకులు కూడా చెప్పలేకపోతున్నారు కానీ, గౌతమ్, నిఖిల్ వీరిలో ఎవరో ఒకరు టైటిల్ కొట్టబోతున్నారు అనే విషయం మాత్రం అందరికి అర్థమైంది. అందరితో సాధారణమైనంత వరకు చాలా మంచిగా ఉండే నిఖిల్ కి, ఎందుకో గౌతమ్ అంటే మొదటి నుండి పడదు అని చూసే ప్రతీ ఒక్కరికి అనిపిస్తుంది. ఎందుకంటే గౌతమ్ దగ్గర ఒక్కటే నిఖిల్ తన మాస్క్ ని విప్పుతాడు. ముఖ్యంగా వాటర్ టాస్క్ లో గౌతమ్ మీద కోపంతో విచక్షణ కోల్పోయి, అతని మీద ఉన్న కోపాన్ని మొత్తం యష్మీ, ప్రేరణలపై చూపించిన ఘటన చూసే ఆడియన్స్ కి నిఖిల్ అసలు స్వరూపం ఇది అని అర్థమైంది. గౌతమ్ అతన్ని ఏమి తిట్టకపోయినా కూడా, తిట్టినట్టు చూపించే ప్రయత్నం చాలానే చేసాడు. నాగార్జున కూడా నిఖిల్ వైపు డిఫెన్స్ లాయర్ లాగా ప్రవర్తించి తప్పు మొత్తం గౌతమ్ చేసాడని చెప్పుకొచ్చాడు.

    ఇలా అన్యాయంగా వ్యవహరించడం వల్లే గౌతమ్ గ్రాఫ్ వేరే లెవెల్ కి వెళ్ళింది, కచ్చితంగా టైటిల్ కొట్టేస్తాడు అని నిఖిల్ ని అభిమానించే వాళ్ళు కూడా చెప్పుకొచ్చారు. అయితే కాసేపటి క్రితమే విడుదలైన రెండవ ప్రోమో లో గౌతమ్, నిఖిల్ కి మధ్య పెద్ద గొడవ జరిగినట్టు చూపించారు. నామినేషన్స్ సమయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరుగుతుంది. అప్పుడు గౌతమ్ ఇన్ని రోజులు నీలో ఉన్న ఈ యాంగిల్ ని ఎందుకు చూపించలేదు అని నిఖిల్ ని అడగగా, ఇప్పుడు చివరికి వచ్చేసింది కదా, అందుకే చూపిస్తున్నా అంటాడు. అప్పుడు ఏది నిజం?, మొన్నటి వరకు ఉన్నటువంటి నిఖిల్ నిజమా?, ఈరోజు బయటకొచ్చిన నిఖిల్ నిజమా అని అడుగుతాడు గౌతమ్. అలా ఇద్దరి మధ్య గొడవ పెరిగి వేరే లెవెల్ కి వెళ్ళిపోతుంది.

    గౌతమ్ నిఖిల్ మాటలకు కాస్త ట్రిగ్గర్ అయ్యి ‘నువ్వు యష్మీ ని వాడుకున్నావ్’ అని అనేస్తాడు. అప్పుడు నిఖిల్ ఏమి మాట్లాడుతున్నావ్ అని కోపం గా గౌతమ్ వైపుకు వస్తాడు. ఇంకోసారి నోరు జారితే మాత్రం పరిస్థితి వేరేలా ఉంటుంది అని అంటాడు నిఖిల్. ఆ తర్వాత ఏమి జరిగింది అనేది నేటి ఎపిసోడ్ చూస్తే కానీ చెప్పలేం. కచ్చితంగా గౌతమ్ ‘యష్మీ ని వాడుకున్నావ్’ అని మాట్లాడడం తప్పే. కానీ ఆయన ఏ ఉద్దేశ్యంతో మాట్లాడాడో అనేది కూడా చూడాలి. హాట్ స్టార్ లో ప్రసారమయ్యే లైవ్ టెలికాస్ట్ లో కాసేపట్లో మొదలు కాబోతుంది నామినేషన్స్. ఎవరైనా ఓపిక ఉంటే చూడొచ్చు. వేరే స్థాయికి వెళ్లిన ఈ గొడవ కచ్చితంగా వీళ్ళిద్దరిలో ఎవరిదో ఒకరిది గ్రాఫ్ ఘోరంగా పడిపోయే అవకాశం ఉంది. అది ఎవరికీ అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం. గత సీజన్ లో కూడా అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ మధ్య చివరి వారంలో ఇలాంటి గొడవే జరిగింది. ఈ గొడవ అమర్ దీప్ కి మైనస్ కాగా, పల్లవి ప్రశాంత్ కి ప్లస్ అయ్యింది.