Chiranjeevi: 1978లో చిరంజీవి నటుడిగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు. ఆయన మొదటి చిత్రం ప్రాణం ఖరీదు. నిజానికి పునాది రాళ్లు ఆయన కెమెరా ముందు మొదటిసారి కనిపించిన చిత్రం. ఆ మూవీ డిలే కావడంతో ప్రాణం ఖరీదు విడుదలైంది. చిరంజీవి పరిశ్రమలో అడుగుపెట్టి దాదాపు ఐదు దశాబ్దాలు అవుతుంది. వివిధ తరాల హీరోయిన్స్ తో ఆయన జతకట్టారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ లకు హీరోయిన్స్ గా నటించిన జయసుధ, శ్రీదేవితో సైతం ఆయన రొమాన్స్ చేశాడు.
కాగా చిరంజీవి స్క్రీన్ షేర్ చేసుకున్న హీరోయిన్స్ లో కొందరు స్టార్ హీరోల భార్యలు ఉండటం విశేషం. సుమలత చిరంజీవితో ఖైదీ వంటి ఇండస్ట్రీ హిట్ చేసింది. అలాగే శుభలేఖ, అగ్నిగుండం చిత్రాల్లో కూడా వీరు కలిసి నటించారు. సుమలతకు చిరంజీవితో మంచి అనుబంధం ఉండేది. ఇప్పటికీ వారు స్నేహం కొనసాగిస్తున్నారు. కన్నడ హీరో అంబరీష్ ని సుమలత పెళ్లి చేసుకుంది. అంబరీష్ కన్నుమూయగా.. చిరంజీవి స్వయంగా వెళ్లి సంతాపం ప్రకటించారు.
రాధిక-చిరంజీవి పదుల సంఖ్యలో చిత్రాలు చేశారు. వీరిది సూపర్ హిట్ కాంబినేషన్. చిరంజీవి అభిమానించే హీరోయిన్స్ లో ఆమె ఒకరు. కాగా రాధిక కోలీవుడ్ హీరో శరత్ కుమార్ ని వివాహం చేసుకుంది. గ్యాంగ్ లీడర్ మూవీలో చిరంజీవికి అన్నయ్యగా శరత్ కుమార్ నటించారు. హీరో నాగార్జున భార్య అమల ఒకప్పుడు స్టార్ హీరోయిన్. పలు భాషల్లో చిత్రాలు చేసింది. చిరంజీవికి జంటగా అమల రాజా విక్రమార్క మూవీ చేసింది.
మహేష్ బాబు-నమ్రత 2005లో ప్రేమ వివాహం చేసుకున్నారు. తెలుగులో నమ్రత అంజి, వంశీ చిత్రాలు చేసింది. అంజి మూవీలో చిరంజీవి-నమ్రత జంటగా నటించారు. వంశీ కంటే చాలా కాలం క్రితమే అంజి షూటింగ్ మొదలైనప్పటికీ డిలే కావడంతో ఆలస్యంగా విడుదలైంది.
అలాగే హీరో సూర్య భార్య జ్యోతికతో సైతం చిరంజీవి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. వీరి కాంబోలో వచ్చిన ఠాగూర్ బ్లాక్ బస్టర్ హిట్. వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ మూవీ.. రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టింది.