https://oktelugu.com/

Horoscope Today: ఈరోజు ఈ రాశుల వారికి అనుకోని అదృష్టం..

కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇదే మంచి సమయం. అయితే భాగస్వాముల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యక్తులను ఎవరిని నమ్మకూడదు. అదనపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు.

Written By:
  • Srinivas
  • , Updated On : November 6, 2024 / 07:31 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today: గ్రహాల మార్పు కారణంగా కొన్ని రాశుల ఫలితాల్లో అనూహ్య ఫలితాలు ఉంటాయి. బుధవారం ద్వాదశ రాశులపై మూలా నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు సుకర్మ యోగం ఏర్పడనుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకోని ఆదాయం లభిస్తుంది. మరికొన్ని రాశులవారు వారు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు ఆయా రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి:
    ఉద్యోగులు కార్యాలయాల్లో బిజీగా ఉంటారు. బంధువుల నుంచి ధన సహాయం అందుతుంది. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వస్తే ఆలోచించాలి. ఏ పని మొదలు పెట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు.

    వృషభ రాశి:
    ఈ రాశి వ్యాపారులు ఈరోజు కొత్త పెట్టుబడులు పెడతారు. భవిష్యత్తు కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులు కార్యాలయాల్లో ప్రశంసలు పొందుతారు‌. పిల్లల కెరీర్ పై దృష్టి పెడతారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి జీతం పెరిగే అవకాశం ఉంది.

    మిథున రాశి:
    ఈ రాశి వారి జీవిత భాగస్వామి ఆ విషయంలో విజయం సాధిస్తుంది. దీంతో కుటుంబం ఉల్లాసంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

    కర్కాటక రాశి:
    కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇదే మంచి సమయం. అయితే భాగస్వాముల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యక్తులను ఎవరిని నమ్మకూడదు. అదనపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు.

    సింహారాశి:
    గతంలో ఎవరికైనా డబ్బు ఇస్తే ఈ రోజు దానిని పొందుతారు. దీంతో ఉల్లాసంగా ఉంటారు. అనవసరపు వివాదాలకు దూరంగా ఉండటమే మంచిది. విహారయాత్రలకు వెళ్తారు.

    కన్య రాశి:
    కార్యాలయాల్లో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులకు చెందిన కొన్ని పనులు పెండింగ్లో పెడ్తారు.స దీంతో ఇంట్లో నిరాశ వాతావరణ ఉంటుంది. జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉండొచ్చు.

    తుల రాశి:
    ఈ రాశి వారు ఈరోజు ఏ పని చేపట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మద్దతుతో వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడతారు. అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శారీరకంగా ఇబ్బందులు పడే అవకాశం.

    వృశ్చిక రాశి:
    ఆర్థిక లావాదేవీలకు ఇది అనుకూల సమయం కాదు. శారీరక సమస్యలు పెరిగే అవకాశం. కొత్త వారితో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పనులు పూర్తి చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది.

    ధనస్సు రాశి:
    ఈరోజు ఎటువంటి కొత్త పనులు ప్రారంభించొద్దు. జీవిత భాగస్వామి కి వ్యాపారం చేయాలనుకునే వారికి ఇదే మంచి సమయం. విద్యార్థులు అడ్డంకులను అధిగమించి లక్ష్యాలను పూర్తిచేస్తారు.

    మకర రాశి:
    ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. కొందరి మద్దతుతో ధన సాయం అందుతుంది. స్నేహితుల అండదండలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయంలో కేర్ తీసుకుంటారు.

    కుంభరాశి:
    కొన్ని పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధువుల సాయంతో వ్యాపారంలో కొత్త పెట్టుబడి పెడతారు. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు.

    మీనరాశి:
    ఈరాశి వారి ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కొత్త వస్తువులు ఇతరుల సలహా తీసుకోవాలి. పిల్లల నుంచి శుభవార్తలు ఉంటారు.