Bigg Boss Telugu 8: ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో టాస్కులు మంచి ఫైర్ వాతావరణం మధ్య జరుగుతున్నాయి. నామినేషన్స్ ఎపిసోడ్ గత వారం తో పోలిస్తే కాస్త ఫైర్ తగ్గింది కానీ, టాస్కులు మాత్రం టాప్ లేచిపోయే రేంజ్ లో ఉన్నట్లు గా నేడు విడుదలైన రెండు ప్రోమోస్ ని చూస్తేనే అర్థం అవుతుంది. నిన్నటి వరకు రాయల్, ఓజీ క్లాన్స్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు బిగ్ బాస్ వాటిని పూర్తిగా రద్దు చేసి నాలుగు టీమ్స్ గా విడగొట్టాడు. వాటికి రెడ్, గ్రీన్, బ్లూ, ఎల్లో పేర్లను పెట్టాడు. లూడో గేమ్ మీ అందరికీ అవగాహన ఉండే ఉంటుంది. ఈ టాస్క్ అలా ఉంటుంది అన్నమాట. అయితే ఇన్ని రోజులు స్నేహితులుగా ఉన్నటువంటి నిఖిల్, ప్రేరణ, పృథ్వీ, యష్మీ వేరే టీమ్స్ గా విడిపోయారు. వీళ్ళ మధ్య కొట్లాటలు వేరే రేంజ్ లో ఉన్నాయి. ఈ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ ఒక లెవెల్ లో ‘పానీ పట్ యుద్ధం’ టాస్క్ ఇస్తాడు.
ఈ టాస్క్ లో నాలుగు టీమ్స్ కి నాలుగు వాటర్ ట్యాంక్స్ ఇస్తాడు బిగ్ బాస్. ఆ వాటర్ ట్యాంక్స్ ని కంటెస్టెంట్స్ కాపాడుకోవాలి. కాసేపటి క్రితం చూపించిన ప్రోమో లో పృథ్వీ బ్లూ టీం ట్యాంక్ ని గెలకగా, నిఖిల్ వచ్చి అడ్డుకుంటాడు. ఇక తర్వాత నిఖిల్ రెడ్ టీం వద్దకు వెళ్లి ప్రేరణ, యష్మీ ని ఈడ్చి అవతలకి వేస్తాడు. వాళ్ళు నీళ్లు కాపాడుకునే ప్రయత్నం చేయగా వాళ్ళ ట్యాంక్ ని నిఖిల్ గట్టిగా కొడుతాడు. రెడ్ టీం లో యష్మీ, ప్రేరణ తో పాటు గౌతమ్ కూడా ఉంటాడు. తన టీం మెంబెర్స్ పై నిఖిల్ దాడి చేయడంతో గౌతమ్ ఆయనతో గొడవకు దిగుతాడు. మనుషులను ముట్టుకోకూడదు అని క్లియర్ గా రూల్ ఉన్నప్పటికీ, ఎందుకు ముట్టుకుంటున్నావ్, సెన్స్ ఉందా అని నిఖిల్ ని అంటాడు. అప్పుడు నిఖిల్ నీకు సెన్స్ ఉందా అని గౌతమ్ పై తిరగబడుతాడు. ఆ తర్వాత గౌతమ్ వివరణ ఇస్తుండగా, నిఖిల్ ఓవర్ యాక్షన్ ఆపు అంటాడు.
ఎవరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు రా అని గౌతమ్ రెచ్చిపోతాడు. ఇద్దరి మధ్య గొడవ తారా స్థాయికి చేరుకుంటుంది. మధ్యలో పృథ్వీ, అవినాష్ ఆపకపోతే వీళ్లిద్దరు కొట్టుకునేలా ఉన్నారు. మరోపక్క యష్మీ కూడా నిఖిల్ ప్రవర్తన పట్ల చాలా అసహనం ని వ్యక్తం చేస్తుంది. అలా నిన్న మొన్నటి వరకు పాలు,నీళ్లు లాగా కలిసిపోయిన స్నేహితులు నేడు విడిపోయి ఒకరిని ఒకరు తిట్టుకోవడం, కొట్టుకోవడం వరకు వచ్చేసారు. గేమ్ లో ఇలాంటి ఫైర్ కోసమే కదా ఇన్ని రోజులు ఎదురు చూసింది, ఇప్పుడొచ్చింది అసలైన మజా అని ప్రేక్షకులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ టాస్కులన్నీ గెలిచి ఎవరు మెగా చీఫ్ కంటెండర్స్ అవుతారు?, ఎవరు హౌస్ కి కొత్త మెగా చీఫ్ అవుతారు అనేది చూడాలి.