HomeతెలంగాణCM Revanth Reddy: కేసీఆర్‌ ఓ ఎక్స్‌పైరీ మెడిసిన్‌.. ఏడాదిలో ఆయన రాజకీయం ముగిసింది.. సీఎం...

CM Revanth Reddy: కేసీఆర్‌ ఓ ఎక్స్‌పైరీ మెడిసిన్‌.. ఏడాదిలో ఆయన రాజకీయం ముగిసింది.. సీఎం రేవంత్‌ హాట్‌ కామెంట్స్‌

CM Revanth Reddy ‘తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓ ఎక్స్‌పైరీ మెడిసిన్‌.. ఆయన రాజకీయానికి ఏడాదిలో ముగింపు పలికా. ఇందుకు కేటీఆర్‌ను ఉపయోగించాం.. ఇప్పుడు కేటీఆర్‌ రాజకీయానికి కూడా ముగింపు పలుకుతాం. ఇందుకు ఆయన బావ హరీశ్‌రావును ఉపయోగిస్తాం. బావను ఎలా హాయండిల్‌ చేయాలో మాకు తెలుసు’ అని సీఎం రేవంత్‌రెడ్డి హాట్‌ కామెంట్స్‌ చేశారు. మంగళవారం సీఎం మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

ధనిక రాష్ట్రం అప్పుల ఊబిలో..
రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ మిగులు బడ్జెట్‌ ఉన్న రాష్ట్రం.. కేసీఆర్‌ పదేళ్ల పాలనలో తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని తెలిపారు. తాను సీఎం అయ్యాక పంట రుణాలు మాఫీ చేశానని, ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు ఇస్తున్నా అని పేర్కొన్నారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు ఇచ్చామని, మూసీ కోసం భూములు ఇచే‍్చవారు వంద శాతం సంతృప్తి చెందేలా ప్యాకేజీ ఇస్తామని పేర్కొన్నారు. ప్రజలను కష్టపెట్టి భూములు తీసుకోమని స్పష్టం చేశారు. ప్రాజెక్టును ఎన్జీవోలు వ్యతిరేకించడంలో అర్థముంది కానీ, పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎందుకు వ్యతిరేకిస్తుందో అర్థం కావడం లదన్నారు. కేటీఆర్‌ తాను ప్రపంచస్థాయి మేధావిని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మూసీని బాగు చేసే అంశంపై కేటీఆర్ తన ఆలోచనలు చెప్పొచ్చని సూచించారు. ప్రాజెక్టుపై కేటీఆర్‌ నుంచి సలహాలు ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. తాను ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ను అని, గేమ్‌ ప్లాన్‌పై తనకు స్పష్టత ఉందని తెలిపారు. 55 కిలోమీటర్ల మూసీ పునరుజ్జీవంతో అద్భుత నగరం ఆవిష్కృతం అవుతుందని తెలిపారు.

ఫామ్‌హౌస్‌ పార్టీపై కట్టుకథలు..
ఇక రెండు రోజుల క్రితం జన్వాడా ఫామ్‌ హౌస్‌లో జరిగిన పార్టీపైనా సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ‘దీపావళి పారీ‍్ట అంటే చిచ్చుబుడ్లు కాలుస్తారని, జన్వాడా ఫామ్‌హౌస్‌లో మాత్రం సారాబుడ్లు బయటకు వచ్చాయి. అనధికారక విదేశీ మద్యంతో కేటీఆర్‌ దీపావళి జరుపుకుంటారా? ఫామ్‌హౌస్‌ పార్టీపై బీఆర్‌ఎస్‌ నేతలు కట్టుకథలు అల్లుతున్నారు’ అని సీఎం ఆరోపించారు. ప్రభుత్వం చేసే మంచి పనులకు మీడియా సహకరించాలని కోరారు. మూసీ పరీవాహకంలో సమయం వచ్చినప్పుడు పాదయాత్ర చేస్తానని తెలిపారు. మూసీ పునరుజ్జీవం విషయంలో వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేశారు. నవంబర్‌ 1న మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తానని తెలిపారు. బాపూఘాట్‌ నుంచి పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

మూసీకి గోదావరి నీరు..
ఇక మూసీ నదికి మల్లన్న సాగర్‌ నుంచి గోదావరి జలాల తరలిస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈమేరకు నవంబర్‌లో టెండర్లు పిలుస్తామని చెప్పారు. మూసీ అభివృద్ధి అధ్యయనానికి నగర ప్రజాప్రతినిధులను సియోల్‌కు పంపుతామన్నారు. మూసీ అభివృద్ధిపై ఇంతకాలం జరిగిన చర్చతో ప్రజలకు అవగాహన వచ్చిందని తెలిపారు. మూసీని బాగుచేసేవాడు ఒకడు వచాచడని ప్రజలకు తెలిసిందన్నారు.

రియల్‌ ఎస్టేట్‌ పడిపోలేదు..
ఇక హైదరాబాద్‌లో హైడ్రా ఏర్పాటుకు ఎంతో ఆలోచన చేశానని సీఎం తెలిపారు. బీఆర్‌ఎస్‌ నాయకులు హైడ్రా గురించి దేశమంతా తెలిసేలా చేశారని పేర్కొన్నారు. హైడ్రా కారనంగా రియల్‌ ఎస్టేట్‌ పడిపోయిందనడం సరికాదన్నారు. దేశవ్యాప్తంగా రియల్‌ ఎస్టేట్‌ రంగంలో స్తబ్ధత నెలకొందని తెలిపారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు తాను వెయ్యిసార్లు ఆలోచిస్తానని తెలిపారు.

కక్ష సాధింపు ఉండదు..
ఇక ఫోన్‌ ట్యాపింగ్‌, కాళేశ్వరం, విద్యుత్‌ కొనుగోళ్లలో అవినీతిపై విచారణ జరుగుతోందని సీఎం తెలిపారు. విచారణ సమయంలో కక్ష సాధింపు ఉండదన్నారు. దర్యాప్తు సంస్థల నివేదిక ఆధారంగానే చర్యలు ఉంటాయని తెలిపారు. రాజకీయంగా తనకు నష్టం జరిగినా ప్రజలకు చేయాలనుకున్నది చేసి తీరుతానని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కావాలన్న తన కల నెరవేరిందని పేర్కొన్నారు. ఇక తనకుపెద్దగా కలలు లేవని తెలిపారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version