Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ రకరకాల ఎమోషన్స్ తో ముందుకు సాగుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇన్ని రోజులు ఒక లెక్క, రేపటి నుండి మరో లెక్క, ఎందుకంటే రేపు బిగ్ బాస్ హౌస్ లోకి 8 మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అందుకే ఆదివారం జరగాల్సిన ఎలిమినేషన్, శనివారమే చేస్తున్నారు. ఇప్పటికే మిడ్ వీక్ లో ఆదిత్య ఓం ఎలిమినేట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు నైనిక ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. ఇది ఇలా ఉండగా ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో కాసేపటి క్రితమే విడుదలైంది. ఈ ప్రోమో లో నాగార్జున హౌస్ మేట్స్ కి ఒక వార్నింగ్ కాల్ ఇచ్చాడు.
ఆయన మాట్లాడుతూ ‘ఇవాళే మీకు వైల్డ్ కార్డ్స్ కంటెస్టెంట్స్ లేకుండా చివరి రోజు, ఇక రేపటి నుండి మీకు జాతరే’ అని అంటాడు. ఇక ఆ తర్వాత నైనిక ని స్టోర్ రూమ్ కి పంపించి టాస్కు కి సంబంధించిన ప్రాపర్టీ ని తెప్పిస్తాడు నాగార్జున. ప్రతీ ఒక్కరు రెండు అద్దాలు ఎంచుకోవాలి, ఆ అడ్డాలలో ఎవరి ముఖాలను చూపిస్తారో నాకు చూపించండి అని అడుగుతాడు నాగార్జున. అప్పుడు ముందుగా విష్ణు ప్రియ నిఖిల్ కి అద్దం చూపిస్తూ ‘చీఫ్ గా దిగిపోయిన తర్వాత నాకంటే చిన్న పిల్లోడిలాగా ప్రవర్తిస్తున్నాడు’ అని అంటుంది. చీఫ్ గా దిగిపోయిన తర్వాతనా?, లేదా సోనియా ఎలిమినేట్ అయ్యకనా? అని అడుగుతాడు నాగార్జున. ఇక రెండవ అద్దం లో మణికంఠని చూపిస్తూ ‘కేవలం అతని గురించి మాత్రమే గోల..అతనికే కష్టాలు ఉన్నాయి, ఇంకెవరికి లేవు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు సార్’ అంటుంది. ఇక ఆ తర్వాత నిఖిల్ వంతు వస్తుంది. మొదటి అద్దం లో విష్ణు ప్రియ ని చూపిస్తే ‘ఈమధ్య ఈమె చాలా అసూయ తో రగిలిపోతుంది..పృథ్వీ ని చూపులతోనే చంపేసేలాగా చూస్తుంది’ అని అంటాడు. ఇక రెండవ అద్దం లో నిఖిల్ కూడా మణికంఠ నే చూపిస్తాడు.
ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ ‘తన ఆట..అందరూ తన కోసమే ఆలోచించాలి అనే విధంగా అతని ప్రవర్తన ఉంది సార్’ అని చెప్తాడు. ఆ తర్వాత మణికంఠ విషయంలో ప్రేరణ కూడా అదే కారణం చెప్తుంది. ఇలా హౌస్ మేట్స్ అందరూ మణికంఠ ఓవర్ డ్రామా ని ప్రేక్షకులకు తెలిపే ప్రయత్నం చేసారు. ఇది ఇలా ఉండగా నిన్న యష్మీ కి ఆమె తండ్రి పంపిన మెసేజి ని బిగ్ బాస్ ఒక్క సెకండ్ LED లో చూపించి తీసేసిన సంగతి తెలిసిందే. దీనికి యష్మీ చాలా బాధపడుతుంది. నేడు నాగార్జున ఆమెకు బంపర్ ఛాన్స్ ఇస్తూ ‘మీ నాన్న పంపిన మెసేజిలో మూడు బలమైన పదాలు చెప్తాను. కానీ దానికి నువ్వు నీ జీవితంలోని సీక్రెట్ మాకు చెప్పాలి’ అని అంటాడు నాగార్జున, తర్వాత ఏమి జరిగింది అనేది రాత్రి ప్రసారం అవ్వబోయే ఎపిసోడ్ లో చూడాలి.