https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ తెలుగు 8 కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్… జబర్దస్త్ నుండి ఎంట్రీ ఇస్తున్న ఆ ఇద్దరు కమెడియన్స్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రంగం సిద్ధమైంది. లాంచింగ్ ఎపిసోడ్ కి రోజుల సమయం మాత్రమే ఉంది. కంటెస్టెంట్స్ ఎంపిక దాదాపు ఖరారు అయినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది. జబర్దస్త్ కమెడియన్స్ లో ఇద్దరు బిగ్ బాస్ హౌస్లో అడుగు పెడుతున్నారట.

Written By:
  • S Reddy
  • , Updated On : August 20, 2024 / 09:02 PM IST

    Bigg Boss Telugu 8

    Follow us on

    Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ రియాలిటీ షో క్రేజే వేరు. బుల్లితెరపై అత్యధిక ఆదరణ దక్కించుకుంటున్న బిగ్ బాస్ లేటెస్ట్ సీజన్ త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇప్పటికే ఏడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. తాజాగా సీజన్ 8కి రంగం సిద్ధమైంది. ప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ అనే గేమ్ షో ప్రసారం అవుతుంది. ఈ షో ముగిసిన అనంతరం బిగ్ బాస్ 8 స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది. కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షోలో ఫినాలే ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తయింది.

    ఇక గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ తో షో కి ఎండ్ కార్డు పడనుంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 8వ తేదీన సీజన్ 8 లాంచింగ్ ఎపిసోడ్ గ్రాండ్ గా నిర్వహించనున్నారని సమాచారం. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తయినట్లు తెలుస్తోంది. వారి ఫైనల్ ఇంటర్వ్యూలు కూడా ముగిశాయట. ఈ క్రమంలో కొందరు కంటెస్టెంట్ల పేర్లు బయటకు వస్తున్నాయి. వీరు ఖచ్చితంగా సీజన్ 8 కి ఎంపికయ్యారంటూ కథనాలు వెలువడుతున్నాయి.

    ఈ క్రమంలో జబర్దస్త్ షో నుంచి ఇద్దరు క్రేజీ కమెడియన్లు బిగ్ బాస్ 8 కి సెలెక్ట్ అయ్యారట. సోషల్ మీడియాలో ఆ ఇద్దరి పేర్లు తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం వినిపిస్తున్న బజ్ ప్రకారం సీరియల్ నటుడు ఇంద్రనీల్, తేజస్విని గౌడ, బంచిక్ బబ్లు, నటి సన, రీతూ చౌదరి, అంజలి పవన్, యూట్యూబర్ అనిల్ గీల, యాంకర్ వింధ్య, గాయత్రి గుప్తా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం పక్కా అని ప్రచారం జరుగుతుంది.

    అలాగే జబర్దస్త్ నుంచి లేడీ కమెడియన్ పవిత్ర, నరేష్ సెలక్ట్ అయినట్లు తాజా సమాచారం. ఇప్పటికే నరేష్, పవిత్రను బిగ్ బాస్ టీం సంప్రదించారట. ఈ ఆఫర్ కి వాళ్ళు ఓకే చెప్పారట. అంతేకాదు వీరిద్దరి ఫైనల్ ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ అయిందని సమాచారం. నరేష్, పవిత్ర బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టడం దాదాపు ఖాయమని అంటున్నారు. పవిత్ర, పొట్టి నరేష్ జబర్దస్త్ కి ఎంపికయ్యారనే వార్తల్లో నిజమెంతో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

    ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 8 కి సంబంధించిన రెండు ప్రోమోలు రిలీజ్ అయ్యాయి. ఈసారి ఎంటర్టైన్మెంట్ అన్ లిమిటెడ్ అంటూ నాగార్జున చెబుతున్నాడు. ఊహించని ట్విస్టులు, ఒక్కసారి కమిట్ అయితే లిమిట్ లేదు అంటూ నాగార్జున భారీ బిల్డప్ ఇస్తున్నాడు. సీజన్ 8 పై ఉన్న అంచనాలు పెంచేస్తున్నాడు. ఇక బీబీ లవర్స్ అయితే సీజన్ 8 విషయంలో ఎగ్జైట్ అవుతున్నారు.

    కాగా గతంలో జబర్దస్త్ నుండి ముక్కు అవినాష్, ఫైమా, చలాకీ చంటి బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టారు. సీజన్ 4లో పాల్గొన్న అవినాష్ గ్రాండ్ సక్సెస్. పది వారాలకు పైగా హౌస్లో ఉన్నాడు. సీజన్ 6లో పాల్గొన్న ఫైమా అంచనాలకు మించి ఆడింది. చలాకీ చంటి మాత్రం నిరాశపరిచాడు. ఫైమా 13 వారాలు హౌస్లో ఉండటం విశేషం.