https://oktelugu.com/

Bigg Boss Telugu 8: టాప్ లేడీ కంటెస్టెంట్ ని సీక్రెట్ రూమ్ లోకి పంపిన బిగ్ బాస్..ట్విస్ట్ అదిరిపోయిందిగా!

గత వారం వరకు ఈమెకి సోషల్ మీడియా లో విపరీతమైన నెగటివిటీ ఉండేది. కానీ ఈ వారం ఆమె తీరుకు ఆమె మీద ప్రేక్షకుల్లో ఉన్న నెగటివ్ అభిప్రాయం మొత్తం పాజిటివ్ గా మారిపోయింది. అయితే ఈ వారం ఆమెని సీక్రెట్ రూమ్ లోకి పంపినట్టు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. గత సీజన్ లో 'సీక్రెట్ రూమ్' పెద్ద హిట్ అయ్యింది. గౌతమ్ ని సీక్రెట్ రూమ్ లోకి పంపి, రెండు రోజుల తర్వాత 'అశ్వథామ 2.0' గా అడుగుపెట్టాడు.

Written By:
  • Vicky
  • , Updated On : September 21, 2024 / 05:09 PM IST

    bigg boss telugu 8

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ సీజన్ ట్విస్టుల మీద ట్విస్టులతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో పాటుగా, బయట ప్రేక్షకులకు కూడా మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే దానిపై సస్పెన్స్ వీడినట్టే. సోషల్ మీడియా లో జరిగిన పోలింగ్ ప్రకారం, నామినేషన్స్ లోకి వచ్చిన 8 మందిలో అభయ్ కి అతి తక్కువ ఓట్లు నమోదు అయ్యాయి. అంతే కాకుండా ఈ వారం ఆయన బిగ్ బాస్ మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు నాగార్జున చాలా ఫైర్ అయ్యాడు. కాసేపటి క్రితమే విడుదల చేసిన ప్రోమో లో అభయ్ కి రెడ్ కార్డు ఇచ్చి బయటకి పంపేశాడు. అయితే ఇది ఎంత వరకు నిజమో నేటి ఎపిసోడ్ చూసేవరకు తెలియదు. ఇదే ఈ వారం ఆడియన్స్ కి ఇచ్చిన అతి పెద్ద ట్విస్ట్. ఈ ట్విస్ట్ తో పాటు మరో ట్విస్ట్ కూడా ఉందట. ఈ వారం మొత్తం ఆడపులి లాగా టాస్కులలో విరుచుకుపడి, మగవాళ్లకు సైతం వణుకు టాస్కులలో వణుకు పుట్టేలా చేసింది.

    గత వారం వరకు ఈమెకి సోషల్ మీడియా లో విపరీతమైన నెగటివిటీ ఉండేది. కానీ ఈ వారం ఆమె తీరుకు ఆమె మీద ప్రేక్షకుల్లో ఉన్న నెగటివ్ అభిప్రాయం మొత్తం పాజిటివ్ గా మారిపోయింది. అయితే ఈ వారం ఆమెని సీక్రెట్ రూమ్ లోకి పంపినట్టు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. గత సీజన్ లో ‘సీక్రెట్ రూమ్’ పెద్ద హిట్ అయ్యింది. గౌతమ్ ని సీక్రెట్ రూమ్ లోకి పంపి, రెండు రోజుల తర్వాత ‘అశ్వథామ 2.0’ గా అడుగుపెట్టాడు. ఈ డైలాగ్ గత సీజన్ లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. యష్మీ ని కూడా అలా సీక్రెట్ రూమ్ లోకి పంపితే అదే అదే విదంగా సూపర్ హిట్ అవుతుందని బిగ్ బాస్ టీం భావించిందట. యష్మీ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఆమె ఎలిమినేట్ అనగానే హౌస్ లో ఆమె గురించి అనేకమైన చర్చలు జరిగే అవకాశం ఉంది.

    ఇన్ని రోజులు ఆమె వెంట తిరిగిన స్నేహితుల అసలు రంగు బయటపడొచ్చు. అవి మనసులో పెట్టుకొని యష్మీ రీ ఎంట్రీ ఇస్తే హౌస్ వేరే లెవెల్ హీటెక్కుతాది. ఆడియన్స్ కి అప్పుడు అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్, టీఆర్ఫీ రేటింగ్స్ కూడా అదిరిపోతాయి. అందుకే యష్మీ ని సీక్రెట్ రూమ్ లోకి పంపారు బిగ్ బాస్. మరి ఆమె ఎన్ని రోజులు సీక్రెట్ రూమ్ లో ఉండబోతుందో చూడాలి. గత సీజన్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి కంటెస్టెంట్స్ అడుగుపెట్టిన సమయంలో గౌతమ్ రీ ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఈసారి వైల్డ్ కార్డు ఎంట్రీలు అక్టోబర్ 4 వ తేదీన ఉండబోతున్నాయి. అన్ని రోజులు యష్మీ ని సీక్రెట్ రూమ్ లో ఉంచే అవకాశం లేదు కాబట్టి రెండు రోజుల్లోనే ఆమె రీ ఎంట్రీ ఇవ్వొచ్చు.