Maruti WagonR Waltz Edition : దేశంలో మారుతి కార్లు సేల్స్ లో ముందుంటాయి. మార్కెట్లోకి ఎన్ని కార్లు వాచ్చినా మారుతి కార్లకు ఉన్న క్రేజ్ తగ్గదు. ఈ కంపెనీ నుంచి వివిధ వేరియంట్లు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చి వినియోగదారులను ఆకర్షించాయి. అలాగే ఎప్పటికప్పుడు లేటేస్ట్ మోడల్స్ మార్కెట్లోకి వస్తుంటాయి. తాజాగా మారుతి కంపెనీ కొత్త ఎడిషన్ ను రిలీజ్ చేసింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న వ్యాగన్ ఆర్ కు సంబంధించి కొత్త కారును మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న వ్యాగర్ ఆర్ కంటే ఇందులో కొన్ని మార్పులు చేసి రిలీజ్ చేశారు. ఈ కొత్త కారు ఎలా ఉందో చూద్దాం..
మారుతి నుంచి రిలీజ్ అయిన వ్యాగన్ ఆర్ అత్యంత ఎక్కువ సేల్స్ ను నమోదు చేసుకుంది. 1999లో రిలీజ్ అయిన ఈ కారు ఇప్పటి వరకు 32 లక్షల యూనిట్ల విక్రయాలు జరుపుకుంది. ఇప్పటికీ వ్యాగన్ ఆర్ కోసం క్యూ కడుతున్నారంటే అతిశయోక్తి కాదు. అయితే కాలం మారుతున్న కొద్దీ కార్లు వాడేవారి అభిరుచులు మారుతున్నాయి. ఈ నేపథ్యంలో లేటేస్ట్ కస్టమర్స్ కోసం కంపెనీ కొత్తగా ‘వాల్ట్ లిమిటెడ్ ఎడిషన్’ ను రిలీజ్ చేసింది.
కొత్త కారులో ఫాగ్ ల్యాంప్స్, వీల్ ఆర్చ్ క్లాడింగ్, బంపర్ ప్రొటెక్టర్లు, సైడ్ స్కర్ట్స్, బాడీ సైడ్ మోల్డింగ్, ఫ్రంట్ క్రోమ్ గ్రిల్ వంటి మార్పులు ఉన్నాయి. అలాగే ఇంటీరియర్ డిజైన్ తో పాటు ప్లోర్ మ్యాట్స్ ఉన్నాయి. ఇందులో అదనంగా కారు టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్, సెక్యూరిటీ ఫీచర్లను అదనంగా చేర్చారు. ఈ కారులో డ్యూయెల్ ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ సిస్టమ్ ఉన్నాయి. పాత వ్యాగన్ ఆర్ కంటే ఇందులో అదనంగా సెక్యూరిటీ ఫీచర్లను అమర్చారు.
హ్యాచ్ బ్యాక్ వేరియంట్ లో ఉన్న మారుతి వ్యాగన్ ఆర్ సామాన్యులకు దగ్గరగా ఉంటుంది. కొత్త ఎడిషన్లో అదనంగా ఫీచర్లను అమర్చినప్పటికీ దీనిని రూ. 5.65 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. ఇక ఇందులో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు 1.2 పెట్రోల్ ఇంజిన్ అనే రెండు ఉన్నాయి. వీటితో పాటు సీఎన్ జీ ఆప్షన్ కూడా ఉంది. 5 స్పీడ్ మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ ట్రాన్నస్ మిషన్ తో పనిచేసే ఈ కారు పెట్రోల్ ఇంజిన్ పై 25.19 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. సీఎన్ జీ వేరియంట్ పై 33.48 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వనుంది.
2012 వరకు మారుతి సుజుకీ వ్యాగన్ ఆర్ 10 లక్షల అమ్మకాలు జరుపుకుంది. 2017లో 2 మిలియన్ల సేల్స్ ను నమోదు చేసుకుంది.అంటే కేవలం 5 సంవత్సరాల్లోనే దీని క్రేజ్ పెరిగింది. ఇక 2024 ఫస్ట్ ఆఫ్ ఇయర్ వరకు 61 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఇది వచ్చే ఏడాది నాటికి 65 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.