https://oktelugu.com/

Mutual funds : అపార్టుమెంట్ లో ప్లాట్ కొంటున్నారా? దానికంటే ఇది బెటర్.. అదేంటో తెలుసుకోండి..

కొందరు అవసరం కోసం కాకుండా పెట్టుబడుల కోసం ప్లాట్ ను కొనుగోలు చేస్తుంటారు. ఇప్పుడు తక్కువ ధరకు ఇల్లు కొని ఆ తరువాత ఎక్కువ ధరకు విక్రయించాలని అనుకుంటారు. కానీ ఇలా చేయడం చాలా పొరపాటు.. దీనికంటే బెటర్ ఇన్వెస్ట్ మెంట్ మరొకటి ఉంది.. అదేంటంటే?

Written By:
  • Srinivas
  • , Updated On : September 21, 2024 5:31 pm
    Mutual funds

    Mutual funds

    Follow us on

    Mutual funds : ఇల్లు కట్టుకోవడం ప్రతి ఒక్కరి కల. ఇంటి నిర్మాణం కోసం కొందరు జీవితాలను పణంగా పెడుతారు. జీవితాంతం సంపాదించిన డబ్బుతో ఇల్లు కట్టుకుంటారు. అయితే డబ్బు సంపాదించడం పూర్తయ్యే సరికి జీవితం గడిచిపోతుంది. దీంతో కొన్ని బ్యాంకులు ఇంటి రుణాన్ని అందిస్తున్నాయి. దీంతో ముందే ఇల్లు కొట్టుకొని ఈఎంఐ ద్వారా పేమెంట్ చేస్తున్నారు. అయితే బ్యాంకు లోన్ తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది. కానీ ఆ తరువాత ఎంత కట్టినా అది పూర్తి కాదు. అయితే కొందరు అవసరం కోసం కాకుండా పెట్టుబడుల కోసం ప్లాట్ ను కొనుగోలు చేస్తుంటారు. ఇప్పుడు తక్కువ ధరకు ఇల్లు కొని ఆ తరువాత ఎక్కువ ధరకు విక్రయించాలని అనుకుంటారు. కానీ ఇలా చేయడం చాలా పొరపాటు.. దీనికంటే బెటర్ ఇన్వెస్ట్ మెంట్ మరొకటి ఉంది.. అదేంటంటే?

    కొంత మందికి ఉద్యోగం చేయడం ఇష్టం. మరికొందరికి వ్యాపారం చేయడం ఫ్యాషన్. ఒక్కసారి పెట్టుబడి పెట్టడం వల్ల ఒకేసారి అధిక మొత్తంలో లాభాలు పొందవచ్చని అనుకుంటారు. నేటి కాలంలో ఎక్కువ శాతం రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నారు. ఎందుకంటే చాలా స్పీడ్ గా రిటర్స్న్ రావడానికి రియల్ ఎస్టేట్ రంగమే ప్రధానం అని చాలా మంది అభిప్రాయం. ఈ రంగంలో ఇప్పటికే ఇన్వెస్ట్ మెంట్ చేసిన వారు భారీగా లాభాలు పొందారు. దీంతో చాలా మంది ఇందులో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తుంటారు.

    ఈ క్రమంలో కొందరు అపార్ట్ మెంట్లలోని ప్లాట్లను కొనుగోలు చేస్తుంటారు. అపార్ట్ మెంట్ కొనడం వల్ల ఇందులో వచ్చే రెంట్స్ ద్వారా అధిక లాభాలు ఉంటాయని భావిస్తారు. అంతేకాకుండా రీ సేల్ చేసినా బెనిఫిట్స్ ఉంటాయని భావిస్తారు. కానీ కన్ స్ట్రక్షన్ కు సంబంధించి ఎటువంటి ఆస్తులు కొనుగోలు చేసినా.. రోజులు తరిగిన కొద్దీ వాటి విలువ తగ్గుతుంది. ఉదాహరణకు అపార్ట్ మెంట్ లోని ఒక ఫ్లాట్ ను కొనుగోలు చేసిన తరువాత కొన్ని సంవత్సరాల తరువాత దాని విలువ తగ్గుతుంది. అందులోనూ బ్యాంకు రుణం ద్వారా దీనిని కొనుగోలు చేయడం ద్వారా మరీ నష్టపోతారు.

    ఉదాహరణకు ఒక అపార్ట్ మెంట్ ను బ్యాంకు రుణం ద్వారా కోటి రూపాయలకు కొనుగోలు చేశారనుకోండి. 20 లక్షల రూపాయలు డౌన్ పేమేంట్ చేసి.. రూ.80 లక్షలకు ఈఎంఐ నిర్ణయించుకున్నారనుకోండి. 20 సంవత్సరాల వరకు ఈఎంఐని నెలకు రూ.70 వేలకు పైగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆఇదే ఇన్వెస్ట్ మెంట్ ను మ్యూచువల్ ఫండ్స్ లో నెలకు రూ.70 వేలు చేయడం వల్ల 20 సంవత్సాలకు రూ.10 కోట్ల వరకు రిటర్స్న్ ఉంటాయి. అందువల్ల అపార్ట్ మెంట్ కంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ మెంట్ చేయడం బెటర్ అని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

    భవిష్యత్ లో ఎక్కువ లాభాలు రావాలంటే ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్ బెటరని చాలా మంది సూచిస్తున్నారు. అయితే పెట్టుబడులు పెట్టే ముందు కంపెనీల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అంతేకాకుండా ఒకే కంపెనీలో కాకుండా వివిధ కంపెనీల్లో పెట్టుబడులు చేయడం వల్ల అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది.