https://oktelugu.com/

Bigg Boss Telugu 8: ఈ సీజన్ లో నిఖిల్ ని ఓడించిన ఏకైక కంటెస్టెంట్ గా అవినాష్..ఈ రేంజ్ టాలెంట్ ఎవ్వరూ ఊహించి ఉండరు!

గౌతమ్ గ్రాఫ్ నెంబర్ 1 కి చేరుకుంది కానీ, రాబోయే వారాల్లో నిఖిల్ చేతిలో టాస్కులు పడితే మళ్ళీ గేమ్ లోకి బ్యాక్ అవుతాడని అందరూ అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియా లో నెటిజెన్స్ నిఖిల్ ని హౌస్ మేట్స్ లో ఎవరో ఒక్కరైనా ఒక్క టాస్కులో ఓడించిన తోపులే అని అనుకునేవారు.

Written By: Vicky, Updated On : November 16, 2024 8:28 am
Bigg Boss Telugu 8(218)

Bigg Boss Telugu 8(218)

Follow us on

Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో టాస్కులు అంటే మన అందరికీ గుర్తుకు వచ్చేది నిఖిల్ మాత్రమే. కేవలం ఈ ఒక్క సీజన్ లోనే కాదు, గత 7 సీజన్స్ లో పోల్చి చూసిన నిఖిల్ ని మించి టాస్కులు ఆడిన కంటెస్టెంట్ మరొకరు లేదు. 99 శాతం స్ట్రైక్ రేట్ తో ఆయన ఆడిన ప్రతీ టాస్క్ గెలిచాడు. నిఖిల్ ని ఇష్టపడని వాళ్ళు కూడా, ఆయన్ని వేరే విషయాల్లో నచ్చకపోవచ్చు కానీ, టాస్కుల విషయంలో మాత్రం నిఖిల్ ని కింగ్ అని ఒప్పుకుంటారు. ఆ రేంజ్ స్టాండర్డ్స్ ని సెట్ చేసి పెట్టాడు నిఖిల్. గత వారం రోజులుగా నిఖిల్ కి మొత్తం నెగటివ్ ఎపిసోడ్స్ పడుతున్నాయి. దాని వల్ల ఆయన గ్రాఫ్ కాస్త క్రిందకు దిగి, గౌతమ్ గ్రాఫ్ నెంబర్ 1 కి చేరుకుంది కానీ, రాబోయే వారాల్లో నిఖిల్ చేతిలో టాస్కులు పడితే మళ్ళీ గేమ్ లోకి బ్యాక్ అవుతాడని అందరూ అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియా లో నెటిజెన్స్ నిఖిల్ ని హౌస్ మేట్స్ లో ఎవరో ఒక్కరైనా ఒక్క టాస్కులో ఓడించిన తోపులే అని అనుకునేవారు.

ఇప్పుడు నా అవకాశం అవినాష్ దక్కించుకున్నాడు. నిన్న రాత్రి జరిగిన మెగా చీఫ్ టాస్క్ లో అవినాష్ నిఖిల్ ని ఓడించి మెగా చీఫ్ అవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అవినాష్ స్పీడ్ కి ఎవరైనా దండం పెట్టాల్సిందే. టాస్క్ ఏమిటంటే ఒక తాడు చివరి అంచున ‘చీఫ్’ అనే పదానికి ఉన్న అక్షరాలను ఒక మూటలో చుట్టబడి ఉంటాయి. మధ్యలో తాడుకి అనేక ముడులు ఉంటాయి. వాటి అన్నిటిని విప్పుకొని, ఆ మూటలో ఉన్నటువంటి అక్షరాలతో ‘చీఫ్’ అనే పదాన్ని సరైన క్రమ పద్దతిలో అమర్చిన కంటెస్టెంట్ మెగా చీఫ్ అవుతాడు. ఈ టాస్కులో అవినాష్ జెట్ స్పీడ్ లో దూసుకుపోయాడు. అందరి కంటే ముందు చీఫ్ పదాన్ని అమర్చి మెగా చీఫ్ అయ్యాడు.

ఇక అవినాష్ తర్వాత అత్యంత వేగంగా ఈ టాస్కుని పూర్తి చేసిన కంటెస్టెంట్ రోహిణి. ఈమెలో కూడా ఇంత టాలెంట్ ఉంది అనే విషయం ఈరోజే అర్థం ఆడియన్స్ కి అర్థమైంది. వీళ్ళ చేత బిగ్ బాస్ ఎంతసేపు ఎంటర్టైన్మెంట్ మాత్రమే చేయించేందుకు చూస్తున్నాడు కానీ, గేమ్స్ చాలా తక్కువగా ఆడిస్తున్నాడు. కానీ వీళ్లకు టాస్కులు ఆడే అవకాశం వచ్చినప్పుడల్లా రఫ్ఫాడించేస్తున్నారు. ఒక పక్క అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ని పంచుతూ హౌస్ మేట్స్ అందరికి అభిమాన కంటెస్టెంట్ గా నిల్చిన అవినాష్, ఇలా టాస్కులు కూడా తన సత్తా చూపిస్తూ రెండవసారి మెగా చీఫ్ అయిన ఏకైక కంటెస్టెంట్ గా ఈ సీజన్ లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. అయితే ఈ సీజన్ లో నాలుగు సార్లు చీఫ్ అయిన కంటెస్టెంట్ గా నిఖిల్ నిలిచాడు. అవినాష్ ఆ రికార్డుని బద్దలు కొడుతాడో లేదో చూడాలి.