Bigg Boss Telugu 8 : ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ ఓటింగ్ రోజుకి ఒకలాగా మారుతూ వచ్చింది. ఆరంభం సోషల్ మీడియా ఓటింగ్ ప్రకారం విష్ణు ప్రియ చివరి స్థానంలో ఉండడాన్ని చూసి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ వారం ఆమెనే ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోతుందేమో అని అనుకున్నారు. కానీ ఫ్యామిలీ వీక్ పూర్తి అయ్యేలోపు ఆమె చివరి స్థానం నుండి రెండవ స్థానానికి ఎగబాకింది. ఈ స్థాయి గ్రాఫ్ పెరుగుదల ఏ వారంలోనూ బాటమ్ లో ఉన్న కంటెస్టెంట్ కి జరగలేదు. ఒక్క విష్ణుప్రియ కి మాత్రమే జరిగింది. అయితే ఓటింగ్ మొదలైన ప్రారంభంలో రెండవ స్థానంలో కొనసాగుతూ వచ్చిన యష్మీ ఒక్కసారిగా డేంజర్ జోన్ లోకి వచ్చేసింది. ఈ వారం ఆమెకి సంబంధించిన ఫుటేజీ మిగిలిన కంటెస్టెంట్స్ తో పోలిస్తే చాలా తక్కువ అనే చెప్పాలి. అందుకే ఆమె డేంజర్ జోన్ లోకి రావడానికి కారణం అయ్యుండొచ్చు.
మరో ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే గౌతమ్ ఒక్కడే ప్రస్తుతానికి అందరికంటే భారీ ఓటింగ్ తో, అత్యధికంగా 22 శాతం ఓటింగ్ తో నెంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నాడు. మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ 16 శాతం ఓటింగ్ తో కొనసాగుతుండగా, యష్మీ ఒక్కటే 15 శాతం ఓటింగ్ లో కొనసాగుతుంది. దీనిని బట్టీ సోషల్ మీడియా పోల్స్ ద్వారా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది, ఏ విశ్లేషకుడు కూడా అంచనా వేయలేకపోతున్నాడు. ఇలాంటి కష్టమైన పరిస్థితి ఇప్పటి వరకు ఎప్పుడు రాలేదు అనే చెప్పాలి. ఈ పరిస్థితి రావడానికి కారణం నామినేషన్స్ ఉన్న వాళ్లంతా మంచి కంటెస్టెంట్స్ అవ్వడమే. ఎలిమినేట్ అయ్యే వాళ్ళు కేవలం వందల ఓట్ల తేడాతోనే ఎలిమినేట్ అవ్వబోతున్నారు.
ఇదంతా పక్కన పెడితే యష్మీ తో పాటు, అవినాష్ కి కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఓటింగ్ ముగిసే సమయానికి అవినాష్ చివరి స్థానంలో ఉన్నాడట. అయితే రేపు ఎలిమినేషన్ రౌండ్ లోకి వచ్చే యష్మీ, అవినాష్ లకు నబీల్ ఎవరో ఒకరికి ఏవిక్షన్ ఫ్రీ పాస్ ఉపయోగించే అవకాశం ఉంటుందట. ఒకవేళ అతను ఏవిక్షన్ పాస్ ని అవినాష్ కి ఉపయోగిస్తే, రేపు అసలు ఎలిమినేషన్ అనేదే ఉండదు. ఎందుకంటే అవినాష్ ఓటింగ్ లో చివరి స్థానంలో ఉన్నాడు, యష్మీ ఎలిమినేషన్ నుండి సేవ్ అయ్యింది, కాబట్టి ఇద్దరు సేఫ్ గా ఉంటారు, ఈ వారం నో ఎలిమినేషన్ అనే టాక్ కూడా నడుస్తుంది. ఏది ఏమైనా ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ చాలా ఉత్కంఠ నడుమ జరగనుంది.