https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : విష్ణుప్రియ నీకు చెల్లి లాంటిది అంటూ పృథ్వీతో అంటున్న గంగవ్వ..కోపం తో రెచ్చిపోయిన విష్ణుప్రియ!

పృథ్వీ రియాక్షన్ ఎలా ఉన్నిందో సమాచారం రాలేదు కానీ, విష్ణుప్రియ కి తెలిస్తే మాత్రం హౌస్ దద్దరిల్లిపోతాది. గంగవ్వ మీద వచ్చే వారం నామినేషన్ వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే విష్ణుప్రియ పృథ్వీ ని ఎంతలా ప్రేమిస్తుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పృథ్వీ నాకు ఆసక్తి లేదు, నన్ను వదిలేయ్ అని మొత్తుకున్నా కూడా విష్ణు ప్రియ అతని వెంటే తిరుగుతుంది.

Written By:
  • Vicky
  • , Updated On : November 6, 2024 / 06:02 PM IST

    Bigg Boss Telugu 8 (3)

    Follow us on

    Bigg Boss Telugu 8 : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన గంగవ్వ కి, విష్ణు ప్రియ కి హౌస్ లో కోల్డ్ వార్ మొదటి నుండి జరుగుతూనే ఉంది. విష్ణుప్రియ వేసే వేషాలు గంగవ్వ కి నచ్చదు, ఎదో ఒకటి ఆమెను అంటూనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో విష్ణుప్రియ కూడా చిరాకు పడి గంగవ్వ మీద అరుస్తుంది. అలా అరిచినందుకు టేస్టీ తేజా మనసు చివుక్కుమనడంతో ఒక వారం విష్ణు ప్రియ నామినేట్ కూడా చేస్తాడు. ఇదంతా పక్కన పెడితే నేడు విష్ణు ప్రియ కి చిర్రెత్తిపోయే మాట గంగవ్వ అన్నట్టు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. నేటి ఎపిసోడ్ లో దీనిని టెలికాస్ట్ కచ్చితంగా చేస్తారనుకుంటా. పూర్తి వివరాల్లోకి వెళ్తే గంగవ్వ పృథ్వీ తో మాట్లాడుతూ ‘విష్ణుప్రియ నిన్ను ఒక అక్క లాగా చాలా ప్రేమగా చూసుకుంటుంది కదా,చూసేందుకు చాలా బాగుంటుంది’ అని అంటుందట.

    దీనికి పృథ్వీ రియాక్షన్ ఎలా ఉన్నిందో సమాచారం రాలేదు కానీ, విష్ణుప్రియ కి తెలిస్తే మాత్రం హౌస్ దద్దరిల్లిపోతాది. గంగవ్వ మీద వచ్చే వారం నామినేషన్ వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే విష్ణుప్రియ పృథ్వీ ని ఎంతలా ప్రేమిస్తుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పృథ్వీ నాకు ఆసక్తి లేదు, నన్ను వదిలేయ్ అని మొత్తుకున్నా కూడా విష్ణు ప్రియ అతని వెంటే తిరుగుతుంది. ఇటీవలే ఒక ఎపిసోడ్ లో పృథ్వీ విష్ణు తో మాట్లాడుతూ ‘నన్ను ఎందుకు నువ్వు నామినేట్ చెయ్యవు’ అని అడుగుతాడు. అప్పుడు విష్ణు ప్రియ దానికి సమాధానం ఇస్తూ ‘నాకంటే నువ్వంటేనే నాకు ఎక్కువ ఇష్టం..నేను ఎవరినైనా మనస్ఫూర్తిగా ఇష్టపడితే అలాగే ఉంటుంది’ అని చెప్తుంది. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు, విష్ణుప్రియ అతన్ని ఎంతలా ప్రేమిస్తుంది అనేది. ఈ విషయం గంగవ్వ కి కూడా తెలిసే ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

    ఎందుకంటే నిజంగా ప్రేమించే వాళ్ళను అవమానించకూడదు. విష్ణుప్రియ ఇలా లవ్ ట్రాక్ నడపడం అనేది ఆడియన్స్ కి అసలు నచ్చడం లేదు, ఆమె గేమ్ ఆడేందుకు వచ్చిందా?, లేకపోతే పృథ్వీ కోసం వచ్చిందా అని తిట్టిన ఆడియన్స్ కూడా ఈ విషయం లో గంగవ్వ ని సమర్దించరు. ఎందుకంటే విష్ణు ప్రియ ఆట తీరు ఆడియన్స్ కి నచ్చకపోవచ్చు కానీ, హౌస్ లో ఎలాంటి మాస్క్ లేకుండా కొనసాగుతున్న ఒకరిద్దరిలో ఈమె కూడా ఒకరు. ఆమె ప్రేమ కంటెంట్ కోసం చేస్తున్నది కాదు, నిజమైనది. 70 ఏళ్ళ వయస్సు కి దగ్గరగా వస్తున్న గంగవ్వ కి ఎక్కడ ఏమి మాట్లాడాలో తెలియకపోతే ఎలా?, ఇన్ని రోజులు గంగవ్వ అన్న మాటలను కామెడీ గా తీసుకున్న విష్ణు ప్రియ, ఈ విషయంలో మాత్రం ఆమె చాలా కోపం తెచ్చుకునే అవకాశాలు ఉంది. గంగవ్వతో పెద్ద గొడవ కూడా పెట్టుకోవచ్చు, చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.