https://oktelugu.com/

Bigg Boss Telugu 8: ‘మెగా చీఫ్’ కంటెండర్ గా గంగవ్వ..కొట్టుకునే స్థాయికి చేరుకున్న నిఖిల్, గౌతమ్ మధ్య గొడవ!

బిగ్ బాస్ సీజన్ 4 లో కూడా ఇలాంటి టాస్కునే ఒకటి పెడుతారు. ఈ టాస్క్ లో అభిజిత్ కిడ్నాప్ ప్లాన్ అప్పట్లో ఎంత సెన్సేషన్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ టాస్క్ కారణంగానే అభిజిత్ టైటిల్ రేస్ లోకి వచ్చాడు. ఇప్పుడు అదే టాస్క్ ని మళ్ళీ పెట్టారు.

Written By:
  • Vicky
  • , Updated On : October 16, 2024 / 08:49 AM IST

    Bigg Boss Telugu 8(119)

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో ‘మెగా చీఫ్’ పోటీలు వేరే లెవెల్ లో ఉండబోతున్నాయి. ఇన్ని రోజులు జరిగిన టాస్కులు ఒక లెక్క, ఈ ఎపిసోడ్ నుండి జరగబోయే టాస్కులు మరో లెక్క. నిన్న హౌస్ లో ప్రారంభమైన ‘మెగా చీఫ్’ టాస్క్ కారణంగా కంటెస్టెంట్స్ మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. అయితే రాయల్ క్లాన్ నుండి ‘గంగవ్వ’ నేరుగా మెగా చీఫ్ కంటెండర్ గా ఎంచుకున్నారు క్లాన్ సభ్యులు. వీకెండ్ టాస్కులో బాగా ఆడి అత్యధిక టాస్కులు గెలిచినందుకు నాగార్జున రాయల్ క్లాన్ సబ్యులకు ఒక షీల్డ్ ని బహుమతిగా ఇస్తాడు. ఈ షీల్డ్ ని ఉపయోగించుకొని ఎవరో ఒకరు వాళ్ళ క్లాన్ నుండి చీఫ్ కంటెండర్ అవ్వొచ్చు. రాయల్ క్లాన్ వాళ్ళు ఆ షీల్డ్ ని గంగవ్వకి ఇవ్వగా, ఆమె ఏ టాస్క్ ఆడకుండా నేరుగా చీఫ్ కంటెండర్ అయ్యింది. మిగిలిన కంటెస్టెంట్స్ కి చీఫ్ కంటెండర్లు అయ్యేందుకు బిగ్ బాస్ ‘స్మార్ట్ ఫోన్స్ vs ఛార్జర్స్’ టాస్కు ని పెడుతాడు. రాయల్ క్లాన్ సభ్యులు ‘ఫోన్స్’, ఓజీ క్లాన్ సభ్యులు ‘ఛార్జర్స్’. రాయల్ క్లాన్ సభ్యులు కేవలం హౌస్ లోపల మాత్రమే ఉండాలి, ఓజీ క్లాన్ సభ్యులు కేవలం గార్డెన్ ప్రాంతంలోనే ఉండాలి.

    బిగ్ బాస్ సీజన్ 4 లో కూడా ఇలాంటి టాస్కునే ఒకటి పెడుతారు. ఈ టాస్క్ లో అభిజిత్ కిడ్నాప్ ప్లాన్ అప్పట్లో ఎంత సెన్సేషన్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ టాస్క్ కారణంగానే అభిజిత్ టైటిల్ రేస్ లోకి వచ్చాడు. ఇప్పుడు అదే టాస్క్ ని మళ్ళీ పెట్టారు. అయితే ఈ టాస్క్ లో ఇరు క్లాన్ సభ్యుల మధ్య తారా స్థాయిలో గొడవలు జరిగాయి. నబీల్, నిఖిల్ కి గౌతమ్ అంటే మొదటి రోజు నుండి నచ్చడం లేదు అనే విషయం చూసే ఆడియన్స్ కి అర్థమైంది. వీళ్లిద్దరి మధ్య ఈ టాస్క్ విషయంలో గొడవ తారాస్థాయికి చేరినట్టు తెలుస్తుంది. నేడు, లేదా రేపటి ఎపిసోడ్ లో ఈ గొడవ టెలికాస్ట్ అవ్వొచ్చు.

    బయట మంచి స్నేహితులుగా కొనసాగిన నిఖిల్, గౌతమ్ బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ తర్వాత భద్ర శత్రువులుగా మారిపోవచ్చు. ఆ స్థాయిలో వీళ్లిద్దరి మధ్య గొడవ నడిచింది. ఒకానొక దశలో ఫిజికల్ గా కొట్టేసుకుంటారేమో అని కూడా అనిపిస్తుందట. ఇక అవినాష్, పృథ్వీ మధ్య గొడవలు మొదటి రోజు నుండి ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ టాస్క్ లో కూడా వీళ్లిద్దరి మధ్య భయంకరమైన గొడవ జరిగినట్టు తెలుస్తుంది. ఈ ఎపిసోడ్స్ తర్వాత కంటెస్టెంట్స్ గ్రాఫ్స్ ఒక్కసారిగా మారిపోవచ్చు. ప్రస్తుతం గౌతమ్ డేంజర్ జోన్ లో ఉన్నాడు. ఆయనకి ఈ ఎపిసోడ్ బాగా పాజిటివ్ అవ్వొచ్చు. నిఖిల్ ప్రస్తుతం ఓటింగ్ లో రెండవ స్థానంలో ఉన్నాడు, ఈ ఎపిసోడ్ తర్వాత ఆయన గ్రాఫ్ మరింత తగ్గొచ్చు, ఎదో ఒక బలమైన మార్పు ఈ ఎపిసోడ్ తర్వాత ఉండబోతుంది.