https://oktelugu.com/

Bigg Boss Telugu 7 Voting: బిగ్ బాస్ : టాప్ లో ఆ హీరో.. ఆమె ఎలిమినేషన్ మారిన లెక్కలు

మొదటివారం కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అవ్వగా రెండవ వారం షకీలా ఎలిమినేట్ అయింది. నామినేషన్ లో ఉన్న అందరితో పోల్చుకుంటే ఆ వారం వీళ్లకు తక్కువ ఓట్లు రావడంతో హౌస్ నుంచి వెళ్లాల్సి వచ్చింది.

Written By:
  • Vadde
  • , Updated On : September 20, 2023 / 12:36 PM IST

    Bigg Boss Telugu 7 Voting

    Follow us on

    Bigg Boss Telugu 7 Voting: నిన్నగాక మొన్న మొదలై…అప్పుడే బిగ్బాస్ సీజన్ సెవెన్ మూడవ వారానికి చేరుకుంది. అభ్యంతరం ఎంటర్టైనింగా సాగుతున్న ఈ షో సరికొత్త ట్విస్టులతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తూనే ఉంది. 14 మందితో మొదలైన ఆట ప్రస్తుతం హౌస్ లో 12 మందితో కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం సోమవారం నుండి మొదలైన ఓటింగ్లో పలు రకాల ట్విస్టులు కనిపిస్తున్నాయి.

    మొదటివారం కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అవ్వగా రెండవ వారం షకీలా ఎలిమినేట్ అయింది. నామినేషన్ లో ఉన్న అందరితో పోల్చుకుంటే ఆ వారం వీళ్లకు తక్కువ ఓట్లు రావడంతో హౌస్ నుంచి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు ఇక హౌస్లో మిగిలిన 12 మందిలో మొదటి ఇంటి సభ్యుడుగా సందీప్ రెండవ ఇంటి సభ్యుడిగా శివాజీ అర్హత పొందడంతో ప్రస్తుతానికి నామినేషన్స్ నుంచి తప్పించుకున్నారు. ఈవారం ఉండేది 12 మంది అయితే నామినేట్ అయ్యింది.

    నామినేషన్స్ పూర్తయ్యాక బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ తో టేస్టీ తేజ బయటపడగా అసలు నామినేటే కానీ అమరదీప్ నామినేషన్ ఊబిలో పడిపోయాడు. అయితే ఇలా పడడం ప్రస్తుతం అతనికి జనంలో సింపతిని గైన్ చేసింది. సోమవారం నుంచి మొదలైన ఓట్లలో అమరదీప్ అందరికంటే ముందంజలో ఉన్నాడు. 19.82% ఓట్లతో మొదటి స్థానంలో అమరదీప్ ఉండగా ఇక రెండవ స్థానంలో 18.99% ఓట్లతో ప్రిన్స్ యావర్, 18.34 % ఓట్లతో ప్రియాంక జైన్ ఉన్నారు. ఇక ముగ్గురితో పోల్చుకుంటే మిగిలిన వారికి కాస్త తక్కువ ఓట్లే అని చెప్పవచ్చు. అయితే బిగ్ బాస్ హౌస్ వంటలక్క సింగర్ దామిని మాత్రం అందరికంటే తక్కువ శాతం ఓట్లతో ఉంది.

    మొదటి వారం ఎవరు నామినేట్ కూడా చేయని దానిని ఇప్పుడు నామినేట్ అవ్వడమే కాకుండా ఓటింగ్‍లో మిడిల్ రేంజ్ నుంచి లాస్ట్ కి పడిపోయింది. ఇక ఆమె తర్వాతే శుభశ్రీ ఉంది. మొత్తానికి ఇద్దరు బ్యూటీస్ ఈసారి ఎలిమినేషన్ కు దగ్గరలో ఉన్నారు. అయితే ఇంకా ఓటింగ్ కు చాలా సమయం ఉంది. ఈలోపు ఈ లెక్కలు తారు మారయ్యే అవకాశం కూడా ఉంది. పైగా మొన్న నామినేషన్స్ అయ్యాక ట్విస్ట్ ఇచ్చినట్లే ఈసారి ఎలిమినేషన్స్ కి ముందు కూడా బిగ్ బాస్ మరొక ట్విస్ట్ ఇస్తాడేమో…చూడాలి. ఈసారి హౌస్ నుంచి ఏ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతాడో చూడాలి.