Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ లో ఆరో వారం మొత్తం ఆటగాళ్లు -పోటుగాళ్ల మధ్య టాస్కులు హోరా హోరీగా సాగాయి. ఇప్పటి వరకు జరిగిన పోటీలో ఇరు టీమ్స్ మూడు మూడు రౌండ్స్ గెలిచి సమానంగా ఉన్నారు. వీరిలో ఎవరు గొప్ప అని నిరూపించుకోవడానికి బిగ్ బాస్ ఆఖరి ఛాలెంజ్ ఇచ్చారు.” ఎవరు బెస్ట్” ఈ టాస్క్ లో రెండు టీమ్స్ తెగ కష్ట పడ్డారు. మొన్నటి వరకు వట్టి మాటలతో సరిపెట్టిన అమర్ ఆటలో రెచ్చిపోయాడు.గతంతో పోల్చుకుంటే అమర్ ఆట తీరు చాలా మారింది. ఒకప్పుడు ఎలా ఆడాలో తెలియక,టాస్క్ లు అర్థం చేసుకోలేక సతమతం అయ్యేవాడు.
ఇది పక్కన పెడితే, గేమ్ మొదలయ్యే ముందు ఇరు టీమ్స్ మధ్య డిస్కషన్ జరిగింది.ఇది మనకి చాలా ముఖ్యం ఎలాగైన గెలవాలి అని అనుకున్నారు. గేమ్ మొదలవగానే గోల్ వెయ్యడానికి ఇరు జట్లు తెగ పోటీ పడ్డారు. అర్జున్ ఇంకా యావర్ ఐతే తెగ తన్నుకున్నారు. అమర్ భలే తెలివిగా గోల్ వేసాడు. అమర్ గోల్ వేయడంతో గోల గోల చేశారు ఆటగాళ్లు.’ ఛా ‘ అనుకుంటూ అర్జున్ డిస్సపాయింట్ అయ్యాడు.
ఇది ఇలా ఉండగా పోటుగాళ్ల టీమ్ లో ఉన్న అశ్విని ఇంకా పూజా మూర్తి మధ్య గొడవ జరిగింది.నేను ఫిజికల్ గా స్ట్రాంగ్ అని పూజ అంటే నేను స్ట్రాంగ్ అని అనిపించడం లేదా అంటూ మధ్యలో దూరి మరీ గొడవ పెట్టుకుంది అశ్విని. నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్ధమౌతుందా అని పూజ మూర్తి అంది. నేను గట్టిగానే మాట్లాడతా అంటూ పూజా ఫైర్ అయ్యింది.అందరికి తెలిసిపోయిందిలే నీకు నోరు బాగా ఎక్కువ అని అశ్విని అంది. నోరు అదుపులో పెట్టుకో అని పూజ అనగానే నువ్వు ఎవరు నాకు చెప్పడానికి అంటూ అశ్విని ఇచ్చిపడేసింది. ఇలా నోటికొచ్చినట్టు తిట్టుకున్నారు.
ఎవరు బెస్ట్ టాస్క్ లో ఆటగాళ్లు గెలిచిన నేపథ్యంలో టోటల్ గా వాళ్ళది పోటుగాళ్లపై పై చేయి అయ్యింది. ఈ క్రమంలో ఆటగాళ్ల టీమ్ నుండి ఒకరు కెప్టెన్ అవుతారని బిగ్ బాస్ ప్రకటించారు. ఆటగాళ్ల సభ్యుల మధ్య చివరి కెప్టెన్సీ టాస్క్ నిర్వహించారు. ఆటగాళ్లు అందరు తమ శరీరాలకు బెలూన్స్ కట్టుకున్నారు. పోటుగాళ్ల టీమ్ సభ్యులు తమ వద్ద ఉన్న సూది ఆటగాళ్లలోని ఒక సభ్యుడికి ఇవ్వాలి. ఆ సభ్యుడు తమ టీమ్ లో ఎవరికి కెప్టెన్ అయ్యే అర్హత లేదో వారి బెలూన్ ని సూదితో గుచ్చి పగలగొట్టాలి.
ఈ టాస్క్ లో చివరికి తేజా, యావర్ మిగిలారు. వీరిద్దరిలో ఎవరు కెప్టెన్ కావాలో కూడా పోటుగాళ్ళకే వదిలేశాడు బిగ్ బాస్. బజర్ మోగిన వెంటనే పోటుగాళ్ళు టీమ్ సభ్యులు పరుగున వెళ్లి సూది తీసుకోవాలి. ఎవరైతే ముందుగా సూది తీసుకుంటారో వారు కెప్టెన్ కావడానికి అర్హత లేదని భావిస్తున్న ఒకరి బెలూన్ పగలగొట్టాలి. నయని పావనికి సూది దక్కించుకుంది. ఆమె తేజా బెలూన్ పగలగొట్టడంతో యావర్ రెండో హౌస్ కెప్టెన్ గా అవతరించాడు. పల్లవి ప్రశాంత్ తన కెప్టెన్సీ బ్యాడ్జ్ యావర్ కి అందించాడు.