Homeక్రీడలుIndia Vs Pakistan 2023: వరల్డ్ కప్ లో ఇండియా పాకిస్థాన్ ని ఎన్ని సార్లు...

India Vs Pakistan 2023: వరల్డ్ కప్ లో ఇండియా పాకిస్థాన్ ని ఎన్ని సార్లు ఎలా ఓడించిందో తెలుసా..?

India Vs Pakistan 2023: ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ప్రపంచం లోని చాలా మంది జనాలు చూసే ఒకే ఒక మ్యాచ్ ఇది. అందుకే ప్రతి సారి ఈ మ్యాచ్ మీద విపరీతమైన బెట్టింగ్ లు నడుస్తూ ఉంటాయి.ఇక ప్రపంచ కప్ లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పాకిస్థాన్ టీమ్ ఇండియన్ టీమ్ ని ఒడించలేదు.ఇప్పటి వరకు 7 సార్లు వరల్డ్ కప్ లో ఈ రెండు టీమ్ లు తలపడిన సంద‌ర్భాల్లో టీమ్ ఇండియానే ఎప్పుడు పాకిస్థాన్ మీద తన ఆధిపత్యాన్ని చూపిస్తూ వచ్చింది. నిజానికి ఇండియన్ టీమ్ ఏ జట్టు మీద అయిన ఓటమిని ఒప్పుకున్నప్పటికి పాకిస్థాన్ మీద మాత్రం ఓడిపోవడానికి ఆసలు ఇష్టపడదు అందుకే గెలవాలనే దృడ సంకల్పం తో ఆడి గెలుస్తుంది.

ఇక ఇప్పటి వరకు ఇండియా, పాకిస్థాన్ మీద వరల్డ్ కప్ లో చేసిన అత్య‌ధిక స్కోరు 336 పరుగులు కాగా…ఇప్పటి వరకు ఇండియా తో ఆడిన మ్యాచ్ ల్లో పాకిస్థాన్ చేసిన అత్య‌ధిక స్కోరు 273. అలాగే ఇండియా అత్య‌ల్ప స్కోరు 216 పరుగులు చేసింది.ఇక పాకిస్తాన్ అత్య‌ల్ప స్కోరు 173 పరుగులు కావడం విశేషం…దీన్ని బట్టి చూసిన కూడా ఇండియా పరుగుల్లో కూడా పాకిస్థాన్ ని డామినేట్ చేస్తూ వస్తుంది…

ఇక ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ లు అన్ని కూడా ఒక ఎత్తు అయితే ఇవాళ్ళ పాకిస్థాన్ మీద ఇండియా ఆడే మ్యాచ్ మరొక ఎత్తు ఎందుకంటే ఈ మ్యాచ్ లో ఇంతకు ముందు ఏషియా కప్ లో ఓడిపోయిన పాకిస్థాన్ మన మీద రివెంజ్ తీర్చుకోవడానికి ప్లాన్ చేస్తోంది. అలాగే ఇండియన్ టీమ్ కూడా ఇప్పటి వరకు వరల్డ్ కప్ లో పాకిస్థాన్ మన మీద గెలవలేదు ఇప్పుడు గెలిస్తే మన ఇండియన్ టీమ్ పరువు పోతుంది కాబట్టి ఇప్పుడు కూడా ఓడించడానికి సిద్ధమౌతోంది.

వరల్డ్ కప్ లో ఇంతకు ముందు పాకిస్థాన్ తో ఆడిన మ్యాచ్ లో ఇండియా మీద పాకిస్థాన్ ఎన్ని పరుగులతేడా తో ఓడిపోయింది అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకుంది…

ఆస్ట్రేలియా లోని సిడ్నీ లో ఆడినపుడు 43 పరుగుల తేడాతో పాకిస్థాన్ ఓడిపోయింది…

ఇండియా పాకిస్తాన్ టీమ్ లు 1992 వ సంవత్సరం లో మొదటి సారి గా సిడ్నీ వేదిక గా వరల్డ్ కప్ మ్యాచ్ లో తలపడటం జరిగింది.ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా టీమ్ నిర్ణీత 50 ఓవర్ల కి 216 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్ లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ విరుచుకు పడి ఆడటం తో ఇండియా ఆ స్కోర్ ని సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో సచిన్ హాఫ్ సెంచరీ చేసి తనదైన మార్క్ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు…ఈ మ్యాచ్ లో సచిన్ 54 పరుగులు చేశాడు ఇక చేజింగ్ కి వచ్చిన పాకిస్థాన్ బ్యాట్స్ మెన్స్ ఒకరి తర్వాత ఒకరు వరుసగా పెవిలియన్ చేరడం జరిగింది…దాంతో పాకిస్థాన్ 172 పరుగులకు ఆలౌట్ అయింది.ఇక దాంతో 43 పరుగుల తేడా తో ఈ మ్యాచ్ లో ఇండియా గెలిచింది…

ఇక 1996 లో మరోసారి ఇండియా పాకిస్తాన్ జట్లు ఇండియా లోని బెంగుళూర్ వేదిక గా తలపడగా అందులో ఇండియా నే విజయం సాధించడం జరిగింది…

ఇక బెంగ‌ళూరు లో జ‌రిగిన ఈ మ్యాచ్‌లో ఇండియా ఫేవరెట్ గా బరిలోకి దిగడం జరిగింది.ఈ మ్యాచ్ లో కూడా ఇండియా మొదట బ్యాటింగ్ కి రావడం విశేషం.ఇక ఈ మ్యాచ్ లో ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 287 ప‌రుగులు చేసింది. అప్పట్లో 287 పరుగులు అంటే ఒకరకంగా భారీ స్కోరు అనే చెప్పాలి.అప్పట్లోనే ఇండియన్ టీమ్ పాకిస్థాన్ టీమ్ కి చుక్కలు చూపించడం మనం ఈ మ్యాచ్ లో చూడవచ్చు. ఇక భార‌త బ్యాట‌ర్ల‌లో నవజ్యోత్ సింగ్ సిద్ధూ 93 పరుగులు చేశాడు.ఇక ఆఖ‌ర్లో అజ‌య్ జ‌డేజా 25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో మెరుపు ఇన్నింగ్స్ ఆడుతూ 45 పరుగులు చేయడం.విశేషం..ఇక దీంతో భార‌త్ భారీ స్కోరు సాధించింది.అయితే ఈ మ్యాచ్ లో ఎవరు ఊహించని విధంగా గా వ‌ర్షం వచ్చి మ్యాచ్ అనేది ఆగిపోవడం జరిగింది. దాంతో పాకిస్థాన్ 49 ఓవ‌ర్ల‌కు 288 పరుగులు చేయాలని బోర్డ్ మెంబర్స్ నిర్ణయించగా పాకిస్థాన్ మాత్రం 9 వికెట్ల న‌ష్టానికి 248 ప‌రుగులు మాత్రమే చేసి ఇండియా మీద గెలవలేక చేతులు ఎత్తేసింది…దీంతో వరుసగా ఇండియా పాకిస్తాన్ టీమ్ ని ఓడగొట్టడం జరిగింది…

ఇక ఆ తర్వాత మూడో సారి కూడా భార‌త్‌, పాకిస్తాన్ మ‌ధ్య ఒక భారీ మ్యాచ్ అయితే జరిగింది. 1999 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా మాంచెస్ట‌ర్ వేదిక‌గా భార‌త్‌, పాక్ మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో మన ఇండియన్ టీమ్ కెప్టెన్ అజారుద్దీన్ ఒక్కడే టీమ్ భారాన్ని మోస్తూ తనదైన ఒక క్లాస్ ఇన్నింగ్స్ ఆడి 59 పరుగులు చేసి రాణించ‌డంతో మొద‌ట బ్యాటింగ్ చేసిన ఇండియా 6 వికెట్ల న‌ష్టానికి 227 ప‌రుగులు చేసింది. ఇక ఆ తర్వాత అనంత‌రం ఇండియన్ బౌల‌ర్ అయిన వెంక‌టేష్ ప్ర‌సాద్ తన బౌలింగ్ తో పాకిస్థాన్ బ్యాట్స్ మెన్స్ కి చెమటలు పట్టించడమే కాకుండా 5 వికెట్లు తీసి విజృంభించ‌డంతో 180 ప‌రుగుల‌కే పాక్ కుప్ప‌కూలింది. దాంతో ఇండియా ఖాతాలో మరో విజయం నమోదు అయింది. ఇలా పాకిస్థాన్ పైన ఇండియా ఎప్పుడు ఆధిపత్యం చూపిస్తూనే వస్తుంది…

ఇక నాలుగో సారి 2003 ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా సెంచూరియ‌న్ వేదిక‌గా భార‌త్‌, పాకిస్థాన్‌లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్ లో మన సచిన్ కి రావల్పిండి ఎక్స్ ప్రెస్ అయిన షోయబ్ అక్తర్ కి మధ్య గట్టి పోటి నడిచింది.షోయ‌బ్ బౌన్స‌ర్ల‌తో స‌చిన్‌ను ఇబ్బందుల‌కు గురి చేయాల‌ని ప్ర‌య‌త్నించ‌గా ఆయన ప్లాన్స్ ని తిప్పికొడుతు సచిన్ వాటిని సమర్థవంతంగా ఎదురుకున్నాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసింది. పాకిస్థాన్ దిగ్గజం బ్యాట్స్ మెన్ అయిన స‌య్యిద్ అన్వ‌ర్ సెంచరీ తో చెల‌రేగ‌డంతో పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 273 ప‌రుగులు చేసింది. ఇక చేజింగ్ కి దిగిన ఇండియా 45.4 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయి ఈ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఇక ఈ మ్యాచ్ లో స‌చిన్ 98 ప‌రుగులు చేశాడు, అలాగే యువ‌రాజ్ సింగ్ 50 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో వరుసగా నలుగోవసారి కూడా ఇండియా పాకిస్థాన్ మీద విజయ ఢంకా మోగించింది…ఈ సీజన్ లో ఇండియా ఫైనల్ కి వెళ్లి ఆస్ట్రేలియా మీద ఓడిపోవడం జరిగింది ఒక్క అడుగు దూరం లో వరల్డ్ కప్ మిస్ అయింది…

మరోసారి 2011 లో తలపడడం జరిగింది. ఈ మ్యాచ్ లో సచిన్ ఒక వీరోచిత పోరాటం చేయడం ఎప్పటికీ గుర్తుండి పోతుంది…దాంతో సచిన్
85 ప‌రుగులు చేశాడు. దీంతో మొద‌ట బ్యాటింగ్ చేసిన భార‌త్ 9 వికెట్ల న‌ష్టానికి 260 ప‌రుగులు చేసింది. అనంత‌రం మిస్బా ఉల్ హక్ 56 పరుగులతో రాణించిన‌ప్ప‌టికీ పాకిస్తాన్ 49.5 ఓవ‌ర్ల‌లో 231 ప‌రుగుల‌కే ఆలౌటైంది.ఇక ఈ సీజన్ లో ఇండియా రెండోవ సారి ప్రపంచకప్ గెలుచుకుంది.ధోనీ నేతృత్వం లో ఇండియా ఈ ఘనత సాధించింది…

2015 లో మరోసారి ఈ రెండు టీములు మధ్య భీకరమైన పోటి నెలకొంది. ఈసారి ఇండియాని గెలిపించడం కోహ్లీ వంతు అయింది.ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచరీ చేసి చెల‌రేగ‌డంతో అడిలైడ్ వేదిక‌గా జ‌రిగిన ఈ మ్యాచ్‌లో భార‌త్ 7 వికెట్ల న‌ష్టానికి 300 ప‌రుగులు చేసింది. మ‌హ్మ‌ద్ ష‌మీ నాలుగు వికెట్లతో చెల‌రేగ‌డంతో 47 ఓవ‌ర్ల‌లో పాక్ 224 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది.దాంతో ఇండియా మరోసారి విజయ ఢంకా మోగించింది…

ఇక 2019 ప్ర‌పంచ‌క‌ప్‌లో మరోసారి తల పడగా ఈ మ్యాచ్ లో ఇండియా ని గెలిపించడం రోహిత్ శ‌ర్మ వంతు అయింది. ఒక అద్భుతమైన సెంచరీ చేసి 140 పరుగులు సాధించడం తో ఇండియా 5 వికెట్ల న‌ష్టానికి 336 ప‌రుగులు చేసింది. ఇక్క పాకిస్థాన్ బ్యాటింగ్ కి వచ్చినప్పుడు వర్షం రావడం తో కొద్దిసేపు మ్యాచ్ కి అంతరాయం కలిగింది దాని తర్వాత మ్యాచ్ ని డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిలో మ్యాచ్ ని 40 ఓవర్లు కుదించి పాకిస్థాన్ చేదించాల్సిన లక్ష్యాన్ని 302 గా నిర్థారించారు.ఈ మ్యాచ్ లో 6 వికెట్లు కోల్పోయి పాకిస్థాన్ 212 పరుగులు మాత్రమే చేసింది…దాంతో ఇండియా మరోసారి పాకిస్థాన్ పై తన ఆధిపత్యాన్ని చూపించింది…

ఇక ఇవాళ్ళ జరిగే మ్యాచ్ లో కూడా పాకిస్థాన్ మీద ఇండియా ఘన విజయం సాధించి మరోసారి విజయఢంకా మోగించడానికి రెఢీ అయింది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
RELATED ARTICLES

Most Popular