Bigg Boss Telugu 7: బిగ్ బాస్ ఆరో వారం నామినేషన్స్ ఆటగాళ్లు వర్సెస్ పోటుగాళ్ళు అంటూ వాడి వేడి గా సాగింది. ఇందులో ముందుగా కొత్తగా వచ్చిన వాళ్ళకి నామినేట్ చేసే అవకాశం ఇచ్చారు బిగ్ బాస్. ఆ తర్వాత మన పాత కంటెస్టెంట్స్ కి అవకాశం వచ్చింది. వీళ్ళకి ఆటగాళ్ళలో ఒకరిని, పోటుగాళ్ళలో ఒకరిని నామినేట్ చెయ్యాలంటూ సూచించాడు. ఈ ప్రక్రియ ముగిసింది. మొత్తానికి ఏడుగురు సభ్యులు నామినేట్ అయ్యారు.
అశ్విని శ్రీ, నయని పావని,ప్రిన్స్ యావర్, అమర్ దీప్,శోభా శెట్టి నామినేషన్ లిస్ట్ లో ఉన్నారు. అయితే శోభా శెట్టి పవర్ అస్త్రా సాధించి మూడు వారాల ఇమ్యూనిటీ పొందింది. ఈమె గత మూడు వారాల నుంచి ఎన్ని తప్పులు చేసిన ఇమ్మ్యూనిటీ ఉండడంతో సేఫ్ అయిపోయింది. టాస్క్ లు విషయంలో శోభా వాడే చెత్త స్ట్రాటజీస్ చూసి ఆడియన్స్ కూడా అవాక్కై పోయారు.కెప్టెన్సీ టాస్క్ ఎలాగైనా గెలవాలి అనే పిచ్చితో చీప్ ట్రిక్స్ ప్లే చేసింది.
ఈ వారం నామినేషన్స్ లో ఉండటంతో ఈమెకి ఎలిమినేషన్ ముప్పు పొంచి ఉందని చెప్పవచ్చు.ఒక వేళ వారం మొత్తం మంచిగా ఉండి ఆడియన్స్ మెప్పు పొందగలిగితే మాత్రం మన లేడీ విలన్ సేఫ్ అయ్యే అవకాశం లేకపోలేదు.
శోభా ఈ ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటే మాత్రం కొత్తగా వచ్చిన నాయని పావని,అశ్విని,పూజ మూర్తి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది.ఓటింగ్ వారం మొత్తం జరిగిన ఆటను బట్టి తారుమారు అయ్యే అవకాశం ఉంది కాబట్టి చివరి వరకు వేచి చూడాల్సిందే. తేజా ప్రతి వారం ఎలిమినేషన్ అంచుల వరకు నక్క తోక తొక్కినట్టు లక్ తో తిరిగి వస్తున్నాడు. ఇక అమర్ మీద ఆడియన్స్ లో విపరీతమైన నెగెటివిటీ పెరిగిపోయింది. దీని వలన వీరిలో ఒకరు ఎలిమినేట్ అయినా ఆశ్చర్యం లేదు.