https://oktelugu.com/

Bigg Boss 7 Telugu: శివాజీలా మారిపోయిన ప్రియాంక … మైక్ తీసి విసిరి కొట్టి రచ్చ!

తాజాగా విడుదలైన శనివారం నాటి ప్రోమో అదిరిపోయింది. కాగా ఈ సీజన్ లో జరిగిన కొన్ని ఐకానిక్ సన్నివేశాలు రిక్రియేట్ చేయాలి అని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు.

Written By:
  • NARESH
  • , Updated On : December 16, 2023 / 04:51 PM IST

    Bigg Boss 7 Telugu

    Follow us on

    Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలేకి ఒక రోజు మాత్రమే మిగిలి ఉంది. శుక్రవారంతో ఓటింగ్ లైన్స్ కూడా క్లోజ్ అయిపోయాయి. అయితే విన్నింగ్ రేస్ లో శివాజీ, అమర్ దీప్, ప్రశాంత్ ల మధ్య గట్టి పోటీ నడిచింది. ఇక ముగ్గురిలో ఎవరు విన్నర్ కానున్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇది ఇలా ఉంటె .. సీజన్ ముగింపు దశకు చేరుకోవడంతో కంటెస్టెంట్స్ తో ఫన్నీ గేమ్స్ ఆడిస్తున్నారు బిగ్ బాస్.

    ఇందులో భాగంగా తాజాగా విడుదలైన శనివారం నాటి ప్రోమో అదిరిపోయింది. కాగా ఈ సీజన్ లో జరిగిన కొన్ని ఐకానిక్ సన్నివేశాలు రిక్రియేట్ చేయాలి అని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు. దీంతో కంటెస్టెంట్స్ యాక్టింగ్ ఇరగదీశారు. అయితే ముందుగా బ్రిక్స్ టాస్క్ లో అమర్ కెప్టెన్సీ కోసం ఏడుస్తూ డిఫెండ్ చేసుకున్న సీన్ చేశారు కంటెస్టెంట్స్. కాగా అర్జున్ అచ్చం అమర్ ని దింపేసాడు. అమర్ చేసిన విధంగా అరుస్తూ .. డిఫెండ్ చేసుకుంటూ జీవించాడు.

    ఇక గౌతమ్ లాగా బాల్స్ వేసాడు అమర్ దీప్. ఇక రతిక లాగా ప్రియాంక మారిపోయింది. తర్వాత శివాజీ సీజన్ స్టార్టింగ్ లో కాఫీ కోసం చేసిన రచ్చ.. ప్రియాంక రీ క్రియేట్ చేసి చూపించింది. కాగా శివాజీని భలే ఇమిటేట్ చేసింది ప్రియాంక. ఆ తర్వాత 14 వ వారంలో జరిగిన ఆఖరి నామినేషన్స్ లో అమర్ – ప్రశాంత్ మధ్య పెద్ద గొడవ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ సీన్ శివాజీ – అర్జున్ లు పండించారు.

    శివాజీ .. అమర్ దీప్ క్యారెక్టర్ ప్లే చేసాడు. ఇక అర్జున్, ప్రశాంత్ లాగా మేడలో టవల్ వేసుకుని పర్ఫామెన్స్ మొదలు పెట్టాడు. నువ్వు మాట తప్పావు రా .. పల్లవి ప్రశాంత్ అంటూ శివాజీ రెచ్చిపోయాడు. ఇక ఇద్దరు ఒకరిని మించి ఒకరు అదరగొట్టేశారు. ఇక ప్రియాంక వచ్చి ఇద్దరి మధ్యలో దూరి గొడవ విడదీసింది. ఇలా ప్రోమో ముగిసింది. కంటెస్టెంట్స్ యాక్టింగ్ మాత్రం ఇరగదీసారు.