https://oktelugu.com/

Bigg Boss 7 Telugu: ప్రశాంత్ నీది చాలా పెద్దది… ప్రియాంక ముందే అమర్ పచ్చి డబుల్ మీనింగ్స్!

ప్రశాంత్ వెళ్లి నిజంగానే దండం పెట్టి చేతిని అమర్ కి ఇచ్చి జాతకం చెప్పించుకున్నాడు. ఇక తర్వాత యావర్ కి జాతకం చెప్పాడు అమర్. ప్రశాంత్ నీది చాలా పెద్దది అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో రచ్చ చేశాడు.

Written By:
  • NARESH
  • , Updated On : December 15, 2023 / 04:32 PM IST

    Bigg Boss 7 Telugu

    Follow us on

    Bigg Boss 7 Telugu: బాస్ సీజన్ 7 ముగింపు దశకు చేరుకుంది. కాగా ఫినాలే వీక్ లో భాగంగా ఎంటర్టైన్మెంట్ టాస్కులు నిర్వహిస్తున్నాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా నేటి ఎపిసోడ్ లో అమర్ ని బిగ్ బాస్ జ్యోతిష్యుడిగా మార్చేశాడు. ఇక అమర్ జ్యోతిష్యుడి పాత్రలో ఇమిడిపోయాడు. కాగా శివాజీ, అమర్ కి గెటప్ వేసి రెడీ చేశాడు. ఇక జాతకాలు చెప్పడం స్టార్ట్ చేశాడు అమర్ దీప్. ముందుగా ప్రశాంత్ ని పిలిచి .. ‘ రా నాయన .. వచ్చి దండం పెట్టు’ అని చెప్పాడు.

    ప్రశాంత్ వెళ్లి నిజంగానే దండం పెట్టి చేతిని అమర్ కి ఇచ్చి జాతకం చెప్పించుకున్నాడు. ఇక తర్వాత యావర్ కి జాతకం చెప్పాడు అమర్. ప్రశాంత్ నీది చాలా పెద్దది అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో రచ్చ చేశాడు. ప్రియాంక ముందే అమర్ అలా బిహేవ్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు. అమర్ కి శివాజీ వంతపాడాడు. తర్వాత యావర్ కి జాతకం చెప్పాడు. బెడ్ రూమ్ లో పడుకోవద్దు అన్న పాపానికి ఒక పెద్దావిడని బయటకు పంపేశావు అంటూ యావర్ పై అమర్ పంచులు వేశాడు. ఆయన రాస్తాడు నువ్వు పాటిస్తావ్ అంటూ శివాజీ ని ఉద్దేశించి చెప్పాడు అమర్. మనిషి మంచోడివే కానీ .. అని ఎదో చెప్పబోతుంటే .. గుణమే గుడిసేటిది అంటూ శివాజీ అందించాడు.

    ఇక చివర్లో అర్జున్, అమర్ ని ఓ రేంజ్ లో ఆడుకున్నాడు. జాతకం చెప్పమని అమర్ కి చెయ్ అందించాడు అర్జున్. ‘ జాగ్రత్తగా చూసి చెప్పండి సామీ .. నా జాతకం .. లేదంటే నీ జాతకం బయట పడిపోద్ది. అనగనగా కారు .. కారులో పార .. పార కింద చీర అంటూ హింట్ ఇచ్చాడు అర్జున్. ఆ మాట వినగానే అమర్ దండం పెట్టేడు. ఏదో చెప్పకూడని రహస్యంలా తెగ కంగారు పడిపోయాడు. అయితే జ్యోతిష్యుడిగా అమర్ దీప్ బాగా ఎంటర్టైన్ చేసాడు.

    కాగా మరో రెండు రోజుల్లో షో ముగుస్తుంది. ఫినాలే వీక్ ఎటువంటి గొడవలు లేకుండా సాగిపోతుంది. నిన్నటి టైం కార్డు టాస్క్ తో చిచ్చు పెట్టాలని బిగ్ బాస్ ప్రయత్నించాడు. కానీ కంటెస్టెంట్స్ సేఫ్ గేమ్ ఆడేసి తెలివిగా తప్పించుకున్నారు. కాగా ఇప్పటికే అర్జున్, శివాజీ, అమర్ దీప్ కోసం ఇంటి భోజనం వచ్చింది. ఇక మిగిలిన ప్రియాంక, ప్రశాంత్, యావర్ కోసం నేటి ఎపిసోడ్ లో పంపిస్తారేమో చూడాలి మరి.