Bigg Boss Telugu 7 Nominations Week 4: నాలుగో వారం నామినేషన్స్ ప్రక్రియ పూర్తయింది . ఈ వీక్ నామినేషన్స్ బాగా హీటెక్కించాయి. మొదటి మూడు వారాలు చాలా బోరింగ్ గా ఉన్న నామినేషన్స్ ,ఈ వీక్ ప్రేక్షకులకు కనువిందు చేశాయి. ఫుల్ గొడవలు, వాదనలతో ఇంటిని హీటెక్కించేసారు కంటెస్టంట్స్. ఆడియన్స్ నామినేషన్స్ అంటే ఇది కదా అని అనుకునేట్టుగా చేశారు. ఈ ప్రక్రియ చాలా వెరైటీ గా సాగింది . నామినేషన్ చేసే కంటెస్టెంట్స్ జ్యూరీ సభ్యులను మెప్పించాలని ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్ .
జ్యూరీ సభ్యులుగా హౌస్ మేట్స్ శివాజీ, సందీప్ ,శోభా లను పెట్టాడు . మొత్తం ప్రక్రియ ఫైవ్ రౌండ్స్ లో పూర్తయింది . నామినేట్ చేసే కంటెస్టెంట్లను సెలెక్ట్ చేసింది జ్యూరీ . మొత్తం ఐదుగురు కంటెస్టెంట్లను నామినేషన్ లిస్ట్ లో చేర్చారు. ప్రియాంక ,రతిక ,యావర్ ,గౌతమ్,శుభశ్రీ లిస్ట్ లో ఉన్నారు.
కానీ ఊహించని విధంగా తేజ కూడా ఈ లిస్ట్ లో చేరాడు . జ్యూరీ సభ్యులు ఏకాభిప్రాయంతో సేఫ్ గా ఉన్న ఒక కంటెస్టెంట్ ని నామినేట్ చెయ్యాలంటూ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ప్రశాంత్ ,అమరదీప్ ,తేజ సేఫ్ గా ఉన్నారు. సందీప్ ,శివాజీ మాట్లాడుకొని తేజా ని నామినేట్ చేద్దాం అని శోభా తో చెప్పారు. దీనికి శోభా ఒప్పుకోదు అమర్ లేక ప్రశాంత్ ని చేద్దాం అంటూ తెగ వాదించింది,కానీ తన పప్పులు ఉడక లేదు.
అమర దీప్ ని లాస్ట్ వీక్ సేఫ్ నుండి తీసి నామినేట్ చేశాం. ఇక ప్రశాంత్ తేజా కంటే గేమ్ బాగా ఆడుతున్నాడు కాబట్టి వీళ్ళిద్దరిని నామినేట్ చేసే ప్రసక్తే లేదు అని ఖరాకండిగా చెప్పారు. ఇక చేసేది ఏమి లేక శోభా సరే అంది . తన బెస్ట్ ఫ్రెండ్ తేజా ని కాపాడాలని ఎంత ట్రై చేసిన లాభం లేకుండా పోయింది . తేజా నామినెట్ అవ్వక తప్ప లేదు . ఈ వారం హౌస్ కి ఎవరు గుడ్ బాయ్ చెప్తారు అనేది ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపుతుంది .