World Cup 2023 India Squad: వరల్డ్ కప్ సమీపిస్తున్న సమయం లో చాలా మంది ఇండియన్ ప్లేయర్లు వాళ్ళకంటూ ప్రత్యేకతను చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.ఇక మొన్నటిదాకా ప్లేయర్లు ఎవరు వరల్డ్ కప్ టీం లో అందుబాటులో ఉంటారో తెలియక బిసిసిఐ చాలా సతమతమయింది.కానీ ఒక్కసారి గా ఇండియా టీం ప్లేయర్లు అందరు కూడా వాళ్ళ ఆట తీరుతో టోటల్ సిచువేషన్స్ అన్నింటిని చేంజ్ చేశారు. ఏషియా కప్ అనేది ఇండియన్ టీం కి చాలా వరకు కలిసి వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఆ టోర్నీ లోనే రాహుల్ ఫామ్ లోకి వచ్చాడు ఇక ఆస్ట్రేలియా మీద జరిగిన మొదటి రెండు మ్యాచుల్లో మహమ్మద్ షమీ,రవిచంద్రన్ అశ్విన్, శ్రేయాస్ అయ్యర్ లాంటి ప్లేయర్లు కూడా సూపర్ ఫామ్ లో ఉండి ఆ రెండు మ్యాచులు గెలవడం లో చాలా వరకు యూజ్ అయ్యారు…
ఇక ఏషియా కప్ లో ప్రధానంగా రాహుల్ సెంచరీ చేసి తన మార్క్ హిట్టింగ్ తో ఏషియా కప్ ఇండియా సాధించడం లో చాలా బాగా హెల్ప్ అయ్యాడు.ఇక ఫైనల్ మ్యాచ్ లో సిరాజ్ శ్రీలంక టీం మీద తన ఫామ్ ని చూపిస్తూ ఆరు వికెట్లు తీసి శ్రీలంక జట్టు ని కోలుకోకుండా చేసాడు.అలాంటి బౌలర్ల కోసమే ఇండియా ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తుంది. ముఖ్యం గా మన టీం మొన్నటి దాక ఎదురుకున్నఅసలైన ప్రాబ్లమ్ ఏంటి అంటే నెంబర్ ఫోర్ లో ఆడే ప్లేయర్ ఎవరు అనేది ఎవ్వరికి తెలియలేదు.
ఎందుకంటే నెంబర్ ఫోర్ లో అత్యుత్తమం గా ఆడే ఇద్దరు ప్లేయర్లు అయినా కె ఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ ఇద్దరు కూడా గాయాల బారిన పడి అసలు టీం కి అందుబాటు లో లేకపోయేసరికి ప్రపంచ దేశాలు అన్ని కూడా ఇండియాకి మిడిలాడర్ సరిగ్గా లేదు, వాళ్ళు ఈసారి వరల్డ్ కప్ కొట్టడం కష్టమే అని చాలా మంది విమర్శించారు. ఇక పాకిస్థాన్ మాజీ ప్లేయర్లు అండ్ ఇప్పుడు పాకిస్థాన్ టీం చీఫ్ సెలెక్టర్ అయిన ఇంజమామ్ ఉల్ హాక్ కూడా ఇండియా ఇప్పుడు అంత స్ట్రాంగ్ టీం గా కనిపించడం లేదు అంటూ కామెంట్లు చేసారు.ఇక మన ఇండియన్ మాజీ ప్లేయర్ అయిన యువరాజ్ సింగ్ కూడా ఇండియన్ టీం లో నెంబర్ ఫోర్ బలంగా లేదు ఇలా అయితే ఈసారి కూడా కప్పు కొట్టడం కష్టమే అంటూ చాలా రకాల కామెంట్లు చేసాడు…
ఇప్పుడు టీమిండియాకు ప్లేయింగ్ 11 ఎంపిక చేయడమే పెద్ద గుదిబండగా మారింది. 4వ స్థానంలో ఇన్నాళ్లు ఎవరన్నది టీమిండియాకు సమస్య. కానీ ఇప్పుడు కేఎల్ రాహుల్ తోపాటు తాజాగా సెంచరీ చేసిన శ్రేయాస్ కూడా ఆస్థానానికి పోటీపడుతున్నాడు. ఇక 6వ స్థానంలో ఇషాన్ కిషన్ తోపాటు తాజాగా రెచ్చిపోయి ఆడిన సూర్యకుమార్ పోటీనిస్తున్నాడు. ఇక ఓపెనర్లు రెచ్చిపోయి ఆడుతున్నారు. 3 వ స్థానంలో కోహ్లీని మించిన వారు లేరు. ఫినిషర్లుగా ఇషాన్, హార్ధిక్ అదరగొడుతున్నారు. బౌలింగ్ దుర్భేద్యంగా ఉంది. బుమ్రా, సిరాజ్, కుల్దీప్, జడేజాతో ప్రత్యర్థులు భయపడేలా ఉంది. ఇక తాజాగా షమీ, అశ్విన్ కూడా అదరగొట్టి ప్లేయింగ్ 11 ఎంపికను క్లిష్టం చేశారు. టీమిండియాకు ఊహించని తలనొప్పులు తెచ్చారు.
ఇక కట్ చేస్తే ఇప్పుడు ఇండియన్ టీం ని ఓడించండం చాలా కష్టం అని ప్రపంచ దేశాలు అనుకుంటున్నాయి.ఇండియాని ఈజీ గా ఓడించవచ్చు అని కామెంట్ చేసిన అందరి కామెంట్లని తిప్పి కొడుతూ వరల్డ్ కప్ బరిలో ఇండియా నిలుస్తుంది.ఏది ఏమైనా టీం లోకి అందరు ప్లేయర్లు రావడం చాలా వాళ్ళు మంచి ఫామ్ లో ఉండటం చాలా మంచి విషయం అనే చెప్పాలి.ఇంతకు ముందు కె ఎల్ రాహుల్ గాని, శ్రేయాస్ అయ్యర్ గాని ఇద్దరి లో ఎవరో ఒకరు వరల్డ్ కప్ టీం లోకి వస్తే చాలు అని అనుకున్నారు.కానీ ప్రస్తుతం ఇద్దరు కూడా మంచి ఫామ్ లోకి వచ్చి వరల్డ్ కప్ కి అందుబాటు లో ఉండటం తో అప్పుడు నెగిటివ్ కామెంట్ చేసిన ఒక్కరు కూడా ఇప్పుడు అసలు ఏం కామెంట్ చేయకుండా సైలెంట్ గా ఉన్నారు.
పాకిస్థాన్ టీం ని కూడా రీసెంట్ గా ఇండియా టీం చిత్తు చేయడం తో ఆ దేశపు మాజీ ప్లేయర్లు కూడా ఏం మాట్లాడటం లేదు. ఇలా ఇండియా టీం అందరికి ఒకేసారి గట్టి స్ట్రోక్ లు ఇస్తూ ప్రపంచ టీం లు సైతం ఇండియా ని చూసి భయం తో వణికిపోయేలా చేస్తున్నారు.ఇక ఈ ఏడాది మార్చ్ లో ఆస్ట్రేలియా మీద జరిగిన మూడు వన్డేల్లో వరుసగా డక్ ఆవుట్ అయిన సూర్య కుమార్ యాదవ్ కూడా ఆస్ట్రేలియా మీద రివెంజ్ చాలా పెద్ద ఎత్తున తీర్చుకున్నాడు.రెండు మ్యాచుల్లో రెండు హాఫ్ సెంచరీ లు చేసి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.ఇక తన మీద వస్తున్న విమర్శలకి కూడా తన బ్యాట్ తోనే సమాధానం చెప్పాడు.ఇక బౌలర్ అయిన అశ్విన్ కూడా ఆస్ట్రేలియా మీద జరిగిన రెండో వన్డేలో మూడు వికెట్లు తీసి తను కూడా మంచి ఫామ్ లో ఉన్నాను అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇక అశ్విన్ బౌలింగ్ చూసిన అందరు కూడా వరల్డ్ కప్ కి అక్షర్ పటేల్ కంటే అశ్విన్ చాలా బెస్ట్ అని అంటున్నారు.ఇలా ఇండియన్ టీం లో ఉన్న ప్లేయర్లు అందరు కూడా మంచి ఫామ్ లో ఉండటం ఈసారి వరల్డ్ కప్ లో ఇండియన్ టీం కి బాగా కసిలిస్ వచ్చే అంశం అనే చెప్పాలి…
ఇక వరల్డ్ కప్ లో పెద్ద జట్లు అయిన ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్,ఆస్ట్రేలియా వంటి జట్లు కూడా ఇండియా టీం ని చూసి బయపడిపోతున్నట్టు గా తెలుస్తుంది.ఇప్పుడు ఇండియా దగ్గర చాలా మంది బ్యాట్స్ మెన్స్ బౌలర్లు ఉండటం తో టీం మొత్తం గెలుపు మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ఇంతకు ముందు ఒక మ్యాచులో ఒక ప్లేయర్ కి గాయం అయితే అయన ప్లేస్ ని రీప్లేస్ చేసేవాళ్ళు లేక ఇండియా టీం చాలా మ్యాచులు ఓడిపోయింది.అయితే మన ప్లేయర్లలో ఒక్క శార్దూల్ ఠాకూర్ ఒక్కడే చాలా వరకు ఫెయిల్ అవుతున్నాడు మరి ఆయన ప్లేస్ లో మరో ప్లేయర్ గా షమీ ని బరిలోకి దింపాలని కెప్టెన్ రోహిత్ శర్మ భావిస్తున్నట్టు గా తెలుస్తుంది…ఇక వరల్డ్ కప్ లో భాగంగా సెప్టెంబర్ 8 వ తేదీన ఆస్ట్రేలియా తో చెన్నై లోని చిదంబరం స్టేడియం లో ఇండియా తన మొదటి మ్యాచ్ ఆడనున్నట్టు గా తెలుస్తుంది…