Bigg Boss Telugu Season 7: బిగ్ బాస్ తెలుగు 7కి అంతా సిద్ధం. కింగ్ నాగార్జున హోస్ట్ గా షో మొదలుకానుంది. షో మొదలు కావడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. కంటెస్టెంట్స్ ఎంపిక ఇప్పటికే పూర్తి అయ్యింది. దీంతో లిస్ట్ లీకైంది. కొందరు పేర్లు బయటకు వచ్చాయి. బిగ్ బాస్ తెలుగు 7 కంటెస్టెంట్స్ లిస్ట్ ఆసక్తి రేపుతోంది. సోషల్ మీడియా సెలెబ్రిటీలతో పాటు బుల్లితెర, వెండితెర స్టార్స్ ఈ సీజన్లో భాగం కానున్నారు. ఈ లిస్ట్ లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ యువ సామ్రాట్ పేరు వినిపిస్తోంది. ఇతడు కామనర్ కోటాలో షోకి ఎంపికయ్యాడని అంటున్నారు.
అలాగే మొగలిరేకులు ఫేమ్ సాగర్ ఎంట్రీ ఇస్తున్నాడట. సాగర్ హీరోగా కూడా ఒకటి రెండు చిత్రాలు చేశాడు. అతనికి బుల్లితెర ప్రేక్షకుల్లో భారీ ఫేమ్ ఉంది. పాపులర్ కామెడీ షో జబర్దస్త్ నుండి గత సీజన్లో ఇద్దరు కమెడియన్స్ కంటెస్ట్ చేశారు. ఫైమా, చలాకీ చంటి పాల్గొన్నారు. సీజన్ 4లో ముక్కు అవినాష్ పాల్గొన్నాడు. ఈసారి బుల్లెట్ భాస్కర్ ఎంపికయ్యాడని అంటున్నారు.
ఇక సీరియల్ నటులు పలువురు కంటెస్ట్ చేస్తున్నారట. ఈ లిస్ట్ లో నవ్య స్వామి, ఈటీవి ప్రభాకర్, కార్తీక దీపం ఫేమ్ శోభిత శెట్టి, అమర్ దీప్ చౌదరి ఆయన భార్య తేజస్విని పేర్లు వినిపిస్తున్నాయి. సింగర్ మోహన భోగరాజు కూడా షోకి ఎంపికైందట. వీరు దాదాపు కన్ఫర్మ్ అంటున్నారు. వీరితో పాటు యాంకర్ విష్ణుప్రియ, టిక్ టాక్ దుర్గారావు దంపతులు, నటి సురేఖావాణి, ఆమె కూతురు సుప్రీత పేర్లు తెరపైకి వచ్చాయి.
మరికొన్ని రోజుల్లో మొదలు కానున్న షోతో పూర్తి క్లారిటీ రానుంది. సీజన్ 6 అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు. దారుణమైన టీఆర్పీ రాబట్టింది. అందుకే బిగ్ బాస్ 7 గట్టిగా ప్లాన్ చేస్తున్నారట. హోస్ట్ గా నాగార్జున తప్పుకున్నారనే ప్రచారం జరిగింది. కానీ వరుసగా ఐదో సీజన్ కి ఆయన హోస్ట్ బాధ్యతలు తీసుకున్నారు. ఒక బిగ్ బాస్ షో కంటెంట్ పై పరిమితులు ఉండాలని కోర్ట్ ఆదేశించడం విశేషం.