Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సెకండ్ కెప్టెన్సీ కోసం టాస్క్స్ నిర్వహిస్తున్నాడు. దీనిలో భాగంగా ఇంటి సభ్యులను రెండు టీమ్స్ గా విభజించాడు. వైల్డ్ కార్డు ఎంట్రీతో హౌస్లో అడుగుపెట్టిన ఐదుగురితో పాటు సీక్రెట్ రూమ్ కి వెళ్లిన గౌతమ్ ని పోటుగాళ్ళుగా, పాత కంటెస్టెంట్స్ ని ఆటగాళ్లుగా ఏర్పాటు చేశారు. మొదటి నాలుగు టాస్కుల్లో పోటుగాళ్ళు పై చేయి సాధించారు. మూడింట్లో గెలిచి లీడ్ లోకి వెళ్లారు. ఆటగాళ్లు కేవలం ఒక టాస్క్ లో గెలిచారు.
గురువారం ఎపిసోడ్లో ఎవరు స్మార్ట్ అనే టాస్క్ నిర్వహించాడు. ఈ టాస్క్ లో ఇరు జట్ల సినిమా నాలెడ్జ్ ని పరీక్షించాడు బిగ్ బాస్. పాటలు, డైలాగ్స్ ప్లే చేస్తూ దానికి సంబంధించిన ప్రశ్నలు అడిగారు. కరెక్ట్ సమాధానం నేల మీద ఉన్న ప్లేట్ లో వెతికి బోర్డు మీద పెట్టాలి. ఈ టాస్క్ లో ఆటగాళ్లు సత్తా చాటారు. దాంతో రెండు టాస్క్స్ లలో గెలిచి పోటుగాళ్ళు టీమ్ కి గట్టి పోటీ ఇచ్చారు.
ఇక ఆరో టాస్క్ గా ఎవరు ఫోకస్డ్ నిర్వహించాడు. ఇరు జట్లలోని ఒక్కో టీం సభ్యుడు వచ్చి బెలూన్ గాల్లో నుండి క్రింద పడకుండా చూసుకుంటూనే నేలపై ఉన్న బాల్స్ సేకరించి బుట్టలో వేయాలి. రెండు టీమ్స్ గట్టిగా పోటీపడ్డాయి. టాస్క్ అనంతరం ఎవరు ఎక్కువ బాల్స్ సేకరించారని లెక్కించగా ఆటగాళ్లు టీమ్ ఎక్కువ బాల్స్ రాబట్టారు. దీంతో వరుసగా రెండు టాస్క్స్ ఆటగాళ్లు గెలిచినట్లు అయ్యింది. దాంతో చెరో మూడు పాయింట్స్ తో సమానంగా నిలిచారు.
దీంతో నెక్స్ట్ ఎవరు కెప్టెన్ అవుతారనే ఉత్కంఠ నెలకొంది. ఇక హౌస్ కి మొదటి కెప్టెన్ గా పల్లవి ప్రశాంత్ అవతరించాడు. అయితే బిగ్ బాస్ అతడి కెప్టెన్సీ టాస్క్ రద్దు చేసిన విషయం తెలిసిందే. అతడు కెప్టెన్ గా సరిగా బాధ్యతలు నెరవేర్చడం లేదని బిగ్ బాస్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే మరలా అతని కెప్టెన్సీ తిరిగి ఇచ్చేశాడు. తన బాధ్యతలు తెలుసుకోవాలనే ఇలా చేసినట్లు బిగ్ బాస్ వివరణ ఇచ్చాడు. దాంతో పల్లవి ప్రశాంత్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు.