Israel Hamas Conflict: ఢిల్లీ నుంచి పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ ఖాతాకు నగదు బదిలీ జరిగిందా? దీనికి సంబంధించి 2022లోనే ఒకరి ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య మధ్య భీకర పోరు జరుగుతున్న తరుణంలో ఈ కేసును పోలీసులు తిరగదోడుతున్నారు. అప్పట్లో ఫిర్యాదు మేరకు కొందరు వ్యక్తులు.. హమాస్ సంస్థకు ఢిల్లీ నుంచి రూపంలో రూ.30లక్షల విలువైన బిట్‌కాయిన్స్‌ను పంపారు. కోర్టు ఆదేశం మేరకు అప్పట్లో కేసు నమోదైంది. కాగా, ఇజ్రాయెల్ ముప్పేట దాడులతో గాజా కకావికలమవుతోంది. ఇప్పటికే ఆ ప్రాంతాన్ని అష్టదిగ్బంధనం చేయడంతో.. అన్నపానీయాలకూ కొరత ప్రారంభమైంది. గాజాకు ఇజ్రాయెల్ విద్యుత్తు సరఫరాను నిలిపివేయడం.. నగరంలో ఉన్న ఒకేఒక్క విద్యుదుత్పత్తి కేంద్రంలో చమురు నిల్వలు నిండుకోవడంతో దాన్ని కూడా షట్‌డౌన్ చేసినట్లు పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్– హరాకత్ అల్-ముక్వామా అల్-ఇస్లామియా(హమాస్) వర్గాలు వెల్లడించాయి. దీనికి తోడు.. చము రు నిల్వలు అయిపోవడంతో.. గాజా వ్యాప్తంగా అంధకారమలుముకుంది. క్షతగాత్రులతో ఆస్పత్రులు నిండిపోయాయని.. ఔషధాల కొరత ప్రారంభమైందని ‘డాక్టర్స్ విత్‌ఔట్ బౌండరీస్’ పేర్కొంది. విద్యుత్తు సరఫరా లేక, అత్యవసర శస్త్రచికిత్సలు నిలిచిపోయాయని, ఆక్సిజన్ యంత్రాలు పనిచేయడం లేదని వెల్లడించింది. ఔషధాలు నిండుకున్న విషయాన్ని డబ్ల్యూహెచ్‌వో కూడా ధ్రువీకరించింది.
ఇజ్రాయెల్ వైపు నుంచి నిరంతరాయంగా రాకెట్ల దాడి జరుగుతోందని, పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశాలు లేకుండా పోయాయని గాజా వర్గాలు వాపోతున్నాయి. దాంతో.. గాజాలోని ఐరాస శిబిరం నిండిపోయిందని చెబుతున్నారు. శనివారం నుంచి గాజాపై ఐదు వేలకుపైగా రాకెట్లను ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సె స్(ఐడీఎఫ్) వెల్లడించింది. గురువారం ఒక్కరోజే 2,329 లక్ష్యాలపై దాడి చేసినట్లు తెలిపింది. దక్షిణ గాజాలోని కిజాన్-ఎ-నజార్ గ్రామంలో నివసిస్తున్న హమాస్ చీఫ్ మొహమ్మద్ డెయిఫ్ కుటుంబంపై జరిగిన రాకెట్ దాడి లో.. డెయిఫ్ తండ్రి, సోదరుడు, సోదరుడి కుమారుడు, మనవరాలు మరణించారని గాజా వర్గాలు ప్రకటించాయి. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటికే హమాస్ సెకండ్-ఇన్-చీ్‌ఫ జకారియా అబూ ముఅమ్మర్, ఆర్థిక మంత్రిగా జువాద్ షమల్లా మరణించిన విషయం తెలిసిందే. మరో వైపు ఏకకాలంలో మూడు యుద్ధాలు చేస్తున్నట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. గాజాలో హమాస్ లు, లెబనాన్‌లో ఉన్న హిజ్బుల్లా ఉగ్రవాదలుతో ఇప్పటికే భీకర పోరు సాగుతుండా.. సిరియాలోని ఉగ్రవాదులు కూడా ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులు చేస్తున్నారని, వారి యత్నాలను ధీటుగా ఎదుర్కొంటున్నామని చెప్పింది.
కాగా, ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ అజయ్’ను ప్రారంభించింది. ఇజ్రాయెల్, పాలస్తీనాలో ఉన్న భారతీయుల కోసం విదేశీ వ్యవహారాల శాఖ ప్రత్యేక హెల్ప్‌లై న్‌లను ఏర్పాటు చేసింది. టెల్వీవ్, రమల్హాలతోపాటు న్యూఢిల్లీ లోనూ హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. 1800 118797 (టోల్ ఫ్రీ) , 91-11230 12113, 91 11230 14104, 9199682 91988 నంబర్లలో న్యూఢిల్లీలోని హెల్ప్‌లైన్‌లను సంప్రదించవచ్చు.