https://oktelugu.com/

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే.. యాంకర్ సుమపై నాగార్జున పంచ్, ముఖం మాడిపోయిందిగా!

సంక్రాంతి బరిలో నిలుస్తున్న నా సామిరంగా చిత్ర ప్రొమోషన్స్ జరగనున్నాయి. దీని కోసం ఓ కీలక రోల్ చేస్తున్న అల్లరి నరేష్ వేదిక మీదకు వస్తున్నారు. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న నా సామిరంగా మూవీలో నాగార్జున హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.

Written By:
  • NARESH
  • , Updated On : December 17, 2023 / 10:53 AM IST

    Bigg Boss Telugu 7

    Follow us on

    Bigg Boss Telugu 7: నేడు బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే. ఉత్కంఠ రేపే ఎలిమినేషన్స్, టైటిల్ పోరుతో పాటు అదిరిపోయే ఎంటెర్టైన్ట్ తో షో సిద్ధమైంది. నేడు బిగ్ బాస్ వేదిక మీదకు పలువురు టాలీవుడ్ స్టార్స్ రానున్నారు. అలాగే ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ కూడా పెర్ఫార్మ్ చేయనున్నారు. అశ్విని శ్రీ, శుభశ్రీ, టేస్టీ తేజ, భోలే షావలి దుమ్మురేపే డాన్స్ పెర్ఫార్మన్స్ ఇవ్వనున్నారు. అలాగే పనిలో పనిగా కొన్ని చిత్రాల ప్రొమోషన్స్ కి బిగ్ బాస్ ఫినాలే వేదిక కానుంది.

    సంక్రాంతి బరిలో నిలుస్తున్న నా సామిరంగా చిత్ర ప్రొమోషన్స్ జరగనున్నాయి. దీని కోసం ఓ కీలక రోల్ చేస్తున్న అల్లరి నరేష్ వేదిక మీదకు వస్తున్నారు. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న నా సామిరంగా మూవీలో నాగార్జున హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా డిసెంబర్ 29న సుమ కనకాల కొడుకు రోషన్ హీరోగా నటించిన బబుల్ గమ్ మూవీ విడుదలవుతుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా యాంకర్ సుమ, హీరోయిన్ మానస చౌదరి, రోషన్ వచ్చారు.

    గ్రాండ్ ఫినాలేకి యాంకర్ గా కూడా వ్యవహరించింది యాంకర్ సుమ. మా హోస్ట్ ని కలవడానికి వచ్చేశాను అని సుమ అన్నారు. ఏంటి నీ జాబ్ నేను చేస్తున్నానా అని నాగార్జున అన్నారు. మీలాగా నేను చేయలేను సర్. మీరు చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఏదైనా సూటిగా చెప్పేస్తారు ని సుమ అన్నారు. ఈ మధ్య నువ్వు కూడా అలా మాట్లాడేస్తున్నావు, త్వరగా భోజనాలు తిని వచ్చి కూర్చోండి, అని పంచ్ వేశాడు. దాంతో సుమ ముఖం మాడిపోయింది.

    ఆదిపురుష్ మూవీ ప్రమోషనల్ ఈవెంట్ కి యాంకర్ గా వ్యవహరించిన సుమ… మీడియా వాళ్ళను ఉద్దేశిస్తూ ఓ కామెంట్ చేశారు. స్నాక్స్ భోజనాల్లా తింటున్నారు. త్వరగా తిని వచ్చి వేదిక ముందు కూర్చోవాలి అని సుమ అన్నారు. మీడియా ప్రతినిధులు అందుకు హర్ట్ అయ్యారు. మీరు మా మీద ఇలాంటి జోక్స్ వేయడం సరికాదని మీడియా ప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు. అనంతరం మీడియాకు క్షమాపణలు చెబుతూ సుమ ఒక వీడియో విడుదల చేసింది. ఎక్కడకు వెళ్లినా వదలకుండా ఈ చేదు సంఘటనను సుమకు గుర్తు చేస్తున్నారు.