https://oktelugu.com/

Best Car: వ్యాగన్ ఆర్ కు మించిన ఈ కారు.. ధర, ఫీచర్స్ లో తగ్గేదేలే..

మారుతి సుజుకీ నుంచి ఇప్పటి వరకు వివిధ మోడళ్లు అందుబాటులోకి వచ్చి వినియోగదారులను ఆకర్షించాయి. వీటిలో వ్యాగన్ ఆర్ ప్రముఖంగా నిలిచింది. 1999లో భారత్ లో ప్రవేశపెట్టిన వ్యాగన్ ఆర్ అప్డేట్ చేసుకుంటూ వస్తోంది.

Written By:
  • Srinivas
  • , Updated On : December 17, 2023 / 10:30 AM IST

    Best Car

    Follow us on

    Best Car: దేశీయంగా కార్ల వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ క్రమంలో చాల కంపెనీలు కొత్త కొత్త మోడళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఆటోమోబైల్ రంగంలో పోటీ కారణంగా వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఆకట్టుకునే ఫీచర్లను అందుబాటులో ఉంచుతున్నారు. మొన్నటి వరకు దేశీయంగా బెస్ట్ కార్లు అంటే మారుతి నుంచి వ్యాగన్ ఆర్ అని చెప్పుకునేవారు. తక్కువ బడ్జెట్ లో మంచి మైలేజ్ ఇచ్చే కారుగా గుర్తింపు పొందింది. అయితే ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా.. వ్యాగన్ ఆర్ కంటే బెటర్ కారు మార్కెట్లో సందడి చేస్తోంది. మరి ఆ కారు గురించి తెలుసుకోవాలని ఉందా?

    మారుతి సుజుకీ నుంచి ఇప్పటి వరకు వివిధ మోడళ్లు అందుబాటులోకి వచ్చి వినియోగదారులను ఆకర్షించాయి. వీటిలో వ్యాగన్ ఆర్ ప్రముఖంగా నిలిచింది. 1999లో భారత్ లో ప్రవేశపెట్టిన వ్యాగన్ ఆర్ అప్డేట్ చేసుకుంటూ వస్తోంది. 2022లో 2,17, 317 యూనిట్లను విక్రయించి అగ్రగామిగా నిలిచింది. 5 డోర్ తో పాటు హ్యాచ్ బ్యాక్ లో ఉండి తక్కువ బడ్జెట్ అంటే రూ.5 నుంచి 7 లక్షల లోపు సొంతం చేసుకోవచ్చు. సామాన్యుల నుంచి ధనిక వర్గాల వరకు ఈ మోడల్ ను ఆదరించారు.

    అయితే ఇప్పుడు ఈ కారుకు పోటీగా టాటా కంపెనీ ఓ మోడల్ ను ప్రవేశపెట్టింది. అదే టియాగో. టాటా టియాగో అమ్మకాల్లో 4 స్టార్ రేటింగ్ ను పొందింది. ప్రీమియం ఇంటీరియర్ క్వాలిటీని కలిగి ఉన్న ఈ కారు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో పనిచేస్తుంది. అలాగే 86 బీహెచ్ పీ పవర్, 113 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సీఎన్ జీ వేరియంట్ లో కూడా అందుబాటులో ఉంది. అలాగే 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఏఎంటీ గేర్ బాక్స్ అప్షన్ అందుబాటులో ఉంది.

    టాటా టియాగో కారు మైలేజ్ లోను ది బెస్ట్ గా నిలుస్తోంది. ఈ కారు లీటర్ కు 19.01 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అయితే సీఎన్ జీ వెర్షన్ లో 26. 49 కిలోమీటర్ల వరకు దూసుకెళ్తుంది. ఫీచర్స్ విషయానికొస్తే 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఎల్ ఈడీ డీఆర్ఎల్, ప్రాజెక్టర్ హెడ్ లైట్లు, బ్యాక్ వైపర్, సౌండ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, పార్కింగ్ సెన్సార్, ఈబీడీ తో కూడిన ఏబీఎస్ వంటివి ఆకర్షిస్తున్నాయి. ఇక ధర విషయానికొస్తే ఈ కారును రూ.5.60 లక్షల తో విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాటా టియాగో వ్యాగన్ ఆర్ కంటే ఎక్కువగా విక్రయాలు జరుపుకుంటోంది.