Bigg Boss Telugu Season 7: బిగ్ బాస్ తెలుగు 7 మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. కంటెస్టెంట్స్ ఎంపిక కూడా కంప్లీట్ చేశారు. అయితే ఇది చాలా రహస్యం. లాంచింగ్ ఎపిసోడ్ రోజు గ్రాండ్ ఒక్కొక్కరినీ పరిచయం చేయాలని నిర్వాహకులు భావిస్తారు. అందుకు గానూ కంటెస్టెంట్స్ లిస్ట్ చాలా గోప్యంగా ఉంచుతారు. అయితే ఏదో ఒక విధంగా ఈ లిస్ట్ లీక్ అవుతుంది. ఈ క్రమంలో బిగ్ బాస్ తెలుగు 7 లో పాల్గొనే కంటెస్టెంట్స్ లిస్ట్ బయట చక్కర్లు కొడుతుంది. కొందరి పేర్లు బహిర్గతం అయ్యాయి.
సింగర్ మోహన భోగరాజు, ఈటీవి ప్రభాకర్, మొగలిరేకులు ఫేమ్ సాగర్, దీపికా పిల్లి, సురేఖావాణితో పాటు పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ఈసారి జబర్దస్త్ నుండి రెండు పేర్లు తెరపైకి వచ్చాయి. బుల్లెట్ భాస్కర్ షోకి ఎంపికయ్యాడు అంటున్నారు. అలాగే కెవ్వు కార్తీక్ పేరు కూడా తెరపైకి వచ్చింది. అతడు ఈ మధ్య జబర్దస్త్ లో కనిపించడం లేదు. బిగ్ బాస్ షో కోసమే జబర్దస్త్ మానేశాడని అంటున్నారు.
అనూహ్యంగా మరో జబర్దస్త్ కమెడియన్ పేరు వినిపిస్తోంది. అది నాటీ నరేష్. జబర్దస్త్ సీనియర్ కమెడియన్స్ లో నాటీ నరేష్ కూడా ఒకడు. చాలా కాలంగా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో చేస్తున్నాడు. ఇతడిని ఎంపిక చేశారనే మాట వినిపిస్తోంది. బుల్లెట్ భాస్కర్, కెవ్వు కార్తీక్, నాటీ నరేష్ లలో ఒకరు హౌస్లోకి ఎంట్రీ కావడం ఖాయం అంటున్నారు.
ఇక గతంలో జబర్దస్త్ కమెడియన్స్ అయిన ముక్కు అవినాష్, ఫైమా, చలాకీ చంటి బిగ్ బాస్ షోకి రావడం జరిగింది. ముక్కు అవినాష్ సీజన్ 4 లో పాల్గొన్నాడు. బాగానే రాణించాడు. చాలా వారాలు ఉన్నాడు. అలాగే ఫైమా కూడా సక్సెస్ అయ్యింది. సీజన్ 6లో పాల్గొన్న ఫైమా దాదాపు ఫైనల్ వరకూ వెళ్ళింది. చంటీ మాత్రం విఫలమయ్యాడు. మూడు నాలుగు వారాలకే వచ్చేశాడు.