Bigg Boss Telugu 6 -Faima Mother: బిగ్ బాస్ హౌస్ ఈ వారం మొత్తం ఫన్ మరియు ఎమోషన్స్ తో ఆడియన్స్ అలరిస్తూ ముందుకు దూసుకుపోతుంది..ఈ వారం కెప్టెన్సీ టాస్కులో భాగంగా ‘బిగ్ బాస్ కోచింగ్ సెంటర్’ అనే ఎంటర్టైన్మెంట్ టాస్కుని ఇచ్చాడు బిగ్ బాస్..ఈ టాస్కు చాలా సరదాగా గడిచిపోతుంది..ఈ టాస్కు నడుస్తున్న సమయంలోనే బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి సంబంధించిన కుటుంబ సభ్యులను లోపాలకి పంపిస్తున్నాడు.

నిన్న ఆది రెడ్డి భార్య కవిత తో పాటు అతని కూతురు కూడా ఎంట్రీ ఇవ్వడం..ఆమె మొట్టమొదటి పుట్టిన రోజు వేడుకలను బిగ్ బాస్ హౌస్ లోనే జరపడం ఆది రెడ్డి ని బాగా ఎమోషనల్ కి గురి చేసింది..ఆది రెడ్డి భార్య బిడ్డ హౌస్ లోకి వచ్చి వెళ్లిపోయిన తర్వాత రాజ్ అమ్మ వస్తుంది..అలా ఈ ఇద్దరి కంటెస్టెంట్స్ కి సంబంధించిన కుటుంబీకులు రావడం తో కంటెస్టెంట్స్ మొత్తం బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు.
ఇక ఈరోజు ఫైమా తల్లి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతుంది..చాలా రోజుల తర్వాత వాళ్ళ అమ్మని చూసేలోపు ఫైమా బాగా ఎమోషనల్ అయిపోతుంది..వాళ్ళ అమ్మగారితో హౌస్ మేట్స్ అందరూ కూడా బాగా కనెక్ట్ అయిపోయారు..ఎక్కడో కూలిపనులు చేసుకుంటూ జీవితం గడిపిన వాళ్ళ అమ్మగారిని..నేడు కోట్లాది మంది ప్రేక్షకులు వీక్షిస్తున్న బిగ్ బాస్ వంటి బిగ్గెస్ట్ రియాలిటీ షో లో చూపించడం ఫైమా సాధించిన అసలైన విజయం..ఎన్నో కష్టాలు పడి జబర్దస్త్ కమెడియన్ గా కెరీర్ ని ప్రారంభించిన ఫైమా..నేడు బిగ్ బాస్ షో ద్వారా ప్రతిఒక్కరికి దగ్గరయింది..ఈ షో నుండి బయటకి వెళ్లిన తర్వాత ఆమె కెరీర్ ఎలా ఉండబోతుందో చూడాలి.

ఇదంతా పక్కన పెడితే..కీర్తి ఫైమా అమ్మ ని చూసి కన్నీళ్లు పెట్టేసుకుంది..ఆమె కుటుంబం మొత్తం రోడ్డు ప్రమాదం లో చనిపోయిన విషయం మనకి తెలిసిందే..తనకి అలాంటి కుటుంబం లేకపోయిందే అని తన తల్లి తండ్రులతో గడిపిన మధుర క్షణాలను తలచుకొని కీర్తి వెక్కిళ్లు పెట్టి ఏడుస్తుంది..ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారిపోయింది.