https://oktelugu.com/

Bigg Boss Telugu 5: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతడే.. మరో వైల్డ్ కార్డ్ ఎవరంటే?

Bigg Boss Telugu 5: బిగ్ బాస్(Bigg Boss) తెలుగు షో గ్రాండ్ గా ప్రారంభమైంది. హౌస్ లోకి ఏకంగా 19మంది కంటెస్టెంట్లు మొదటి రోజే వెళ్లారు. మునుపెన్నడూ లేనంతగా ఈసారి అలకలు, ఏడుపులు, గొడవలు, పెడబొబ్బలతో రచ్చ రచ్చగా సాగుతోంది. సోమవారం ప్రారంభమైన నామినేషన్ ప్రక్రియతోనే బిగ్ బాస్ కంటెస్టెంట్ల మధ్య గొడవలు మొదలయ్యాయి. నామినేట్ చేసినప్పుడే జెస్సీ , హమీద సహా పలువురు ఏడ్చేశారు. సన్నీ-షణ్ముఖ్, జెస్సీ-విశ్వ, నటరాజ్-రవి మధ్య గొడవలు మొదలయ్యాయి. తొలి […]

Written By:
  • NARESH
  • , Updated On : September 9, 2021 / 10:52 AM IST
    Follow us on

    Bigg Boss Telugu 5: బిగ్ బాస్(Bigg Boss) తెలుగు షో గ్రాండ్ గా ప్రారంభమైంది. హౌస్ లోకి ఏకంగా 19మంది కంటెస్టెంట్లు మొదటి రోజే వెళ్లారు. మునుపెన్నడూ లేనంతగా ఈసారి అలకలు, ఏడుపులు, గొడవలు, పెడబొబ్బలతో రచ్చ రచ్చగా సాగుతోంది. సోమవారం ప్రారంభమైన నామినేషన్ ప్రక్రియతోనే బిగ్ బాస్ కంటెస్టెంట్ల మధ్య గొడవలు మొదలయ్యాయి. నామినేట్ చేసినప్పుడే జెస్సీ , హమీద సహా పలువురు ఏడ్చేశారు. సన్నీ-షణ్ముఖ్, జెస్సీ-విశ్వ, నటరాజ్-రవి మధ్య గొడవలు మొదలయ్యాయి.

    తొలి వారంలో యాంకర్ రవి(Anchor Ravi), మానస్, ఆర్జే కాజల్, సరయూ, జశ్వంత్, హమీదలు నామినేషన్స్ లో ఉన్నారు. ఈ ఆరుగురు కంటెస్టెంట్లలో ఒకరు ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లనున్నారు.మొదటి మూడు రోజులు పరిశీలిస్తే ఎలిమినేట్ అయ్యేది ఎవరో పక్కాగా తెలిసిపోతోంది. సోషల్ మీడియాలో కూడా ఇదే ప్రచారం సాగుతోంది. ఆ కంటెస్టెంట్ ఎవరో కాదు.. హౌస్ లోనే అత్యంత వివాదాస్పదంగా వ్యవహరిస్తూ అందరితో గొడవలకు దిగుతున్న జెస్సీ.

    జెస్సీ అనే జశ్వంత్ సూపర్ మోడల్. 2018లో సూపర్ మోడల్ ఇండియా టైటిల్ గెలుచుకున్నాడు. ప్రస్తుతం బిగ్ బాస్ లో సెన్సిటివ్, ఇన్నో సెంట్ గా దిగిన జెస్సీ అందరితో దురుసుగా ప్రవర్తిస్తూ యానీ మాస్టర్ సహా అందరితో పెద్ద పెద్ద గొడవలు పెట్టుకున్నాడు. చిన్నా పెద్ద తేడా లేకుండా ఎవరికి గౌరవం ఇవ్వకుండా అవమానించేలా ప్రవర్తిస్తున్నాడు. దీంతో అతడితో కంటెస్టెంట్లకు భారీగా గొడవలు అవుతున్నాయి. అనీ మాస్టర్ తో పెద్ద గొడవ పెట్టుకున్నాడు. కాళ్లు సోఫా మీదపెట్టి ఆనీ మాస్టర్ ను అవమానించాడు. ఇద్దరి మధ్య కొట్టుకునేంత గొడవ జరిగింది. సారీ చెప్పినా కూడా జెస్సీ తీరు మాత్రం కంటెస్టెంట్లకు, ప్రేక్షకులకు నచ్చలేదు.

    ఈ క్రమంలోనే ఈ వారం అతడే ఎలిమినేట్ అవుతాడని సోసల్ మీడియా చర్చ మొదలైంది. అయితే జెస్సీ బయటకు వెళ్లగానే వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ కూడా ఉంటుందని టాక్ నడుస్తోంది. జబర్ధస్త్ మానేసిన ఒక కమెడియన్ ను హౌస్ లోకి పంపుతున్నట్టుగా తెలుస్తోంది.  ఈ సారి బిగ్ బాస్ హౌస్ ను ఫుల్లీ లోడెగ్ గా ఉంచాలని బిగ్ బాస్ టీం యోచిస్తోంది. అందుకే కొద్దిరోజుల వరకు ఈ భారీ సంత నుంచి ప్రేక్షకులకు వినోదం పంచాలని చూస్తున్నారు.