https://oktelugu.com/

బిగ్ బాస్ లో భారీ ట్విస్ట్: ప్రియా-లహరిల్లో ఎలిమినేట్ ఎవరంటే?

బిగ్ బాస్ మూడో వారం చివరిదశకు చేరుకుంది. హౌస్ లోకి మొత్తం 19మందిని పంపిన హోస్ట్ నాగార్జున ఇప్పటికీ రెండు వారాల్లో ఇద్దరిని బయటకు పంపారు. మూడో వారం నామినేషన్ లో నిన్నటి ఎపిసోడ్ తర్వాత మానస్, లహరి,ప్రియ మాత్రమే మిగిలారు. దీంతో ఈ ముగ్గురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తి రేపుతోంది. తాజాగా బిగ్ బాస్ ప్రోమో విడుదలైంది. ఇందులో మానస్ సేఫ్ అయినట్టుగా తెలుస్తోంది. కేవలం ప్రియ-లహరి మాత్రమే నామినేషన్ లో మిగిలినట్టు ప్రోమో […]

Written By:
  • NARESH
  • , Updated On : September 26, 2021 / 06:27 PM IST
    Follow us on

    బిగ్ బాస్ మూడో వారం చివరిదశకు చేరుకుంది. హౌస్ లోకి మొత్తం 19మందిని పంపిన హోస్ట్ నాగార్జున ఇప్పటికీ రెండు వారాల్లో ఇద్దరిని బయటకు పంపారు. మూడో వారం నామినేషన్ లో నిన్నటి ఎపిసోడ్ తర్వాత మానస్, లహరి,ప్రియ మాత్రమే మిగిలారు. దీంతో ఈ ముగ్గురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తి రేపుతోంది.

    తాజాగా బిగ్ బాస్ ప్రోమో విడుదలైంది. ఇందులో మానస్ సేఫ్ అయినట్టుగా తెలుస్తోంది. కేవలం ప్రియ-లహరి మాత్రమే నామినేషన్ లో మిగిలినట్టు ప్రోమో చూస్తే అర్థమవుతోంది. ఈరోజు రాత్రి మరి ఈ ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తి రేపుతోంది.

    అయితే ట్రెండ్స్ ను బట్టి చూస్తే బిగ్ బాస్ లో ఈ వారం చిట్టచివరన అత్యల్పంగా ఓట్లు వచ్చింది ప్రియ, లహరికే.. ఈ ఇద్దరిలో నామినేషన్ల సందర్భంగా ప్రియ నోటి దురుసుతో అందరికి విలన్ అయ్యింది. ఇక లహరి కూడా ప్రియను ప్రశ్నించి నోరుపారేసుకుంది.

    ఈ క్రమంలోనే తాజాగా ఓటింగ్ ప్రకారం అందరికంటే తక్కువ ఓట్లు లహరికి వచ్చాయని ఆమె మూడో వారం ఎలిమినేట్ కాబోతోందని తెలుస్తోంది.

    ఇక సండే ఫండే అంటూ నాగార్జున చేసిన హంగామా ఈరోజు రాత్రి అందరిని ఎంటర్ టైన్ చేస్తుందని ప్రోమో చూస్తే తెలుస్తోంది. నాగార్జున ఇంటి సభ్యులతో కామెడీ పండించాడు. వారితో చేత ఆటలు ఆడించి పాటలు పాడించి హోరెత్తించారు. ఈ మేరకు బిగ్ బాస్ ప్రోమోల్లో తెలుస్తోంది.