https://oktelugu.com/

చాకలి ఐలమ్మ స్ఫూర్తితో నియంత పాలనను తరిమికొట్టండి.. బండి సంజయ్

నిజాం తొత్తులుగా ఉన్న భూస్వాములను తరిమి తరిమి కొట్టడంలో పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ చేసిన పోరు చిరస్మరణీయం. ఆమె చూపిన తెగువ, ధైర్య సాహసాలు నేటి మహిళలకు ఆదర్శం. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం మద్యాన్ని ఏరులై పారించి కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. లోకం చాకలి ఐలమ్మ స్పూర్తితో తెలంగాణ మహిళలంతా ఏకమై అవినీతి, నియంత, అరాచక పాలనను కొనసాగిస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలి’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. చాకలి […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : September 26, 2021 / 06:11 PM IST
    Follow us on

    నిజాం తొత్తులుగా ఉన్న భూస్వాములను తరిమి తరిమి కొట్టడంలో పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ చేసిన పోరు చిరస్మరణీయం. ఆమె చూపిన తెగువ, ధైర్య సాహసాలు నేటి మహిళలకు ఆదర్శం. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం మద్యాన్ని ఏరులై పారించి కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. లోకం చాకలి ఐలమ్మ స్పూర్తితో తెలంగాణ మహిళలంతా ఏకమై అవినీతి, నియంత, అరాచక పాలనను కొనసాగిస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలి’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని ఆదివారం బండి సంజయ్ 30వ రోజు పాదయాత్ర ప్రారంభానికి ముందు బద్దెనపల్లిలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఐలమ్మ పోరాటానికి, త్యాగాలను స్మరించుకున్న బండి సంజయ్ కేసీఆర్ పాలనలో మహిళలు పడుతున్న బాధలను ప్రస్తావించారు. ఆదాయం కోసం కేసీఆర్ ప్రభుత్వం మద్యాన్ని ఏరులై పారిస్తూ మహిళల సంసారాల్లో చిచ్చు పెడుతోందన్నారు. ఊరుకో స్కూల్ ఉండాల్సిన చోట ఊరికో బార్, వైన్ షాపులను ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాలమాడుతున్నారని మండిపడ్డారు. సొంత ఇల్లు లేక లక్షలాది కుటుంబాలు దీనావస్థలో బతుకుతున్నాయని, డ్వాక్రా రుణాలు కూడా సక్రమంగా ఇవ్వలేని దుస్థితి నెలకొందన్నారు. కేసీఆర్ నియంత పాలనలో మహిళలు తీవ్ర అన్యాయానికి గురయ్యారని, చాకలి ఐలమ్మ స్పూర్తితో మహిళలంతా ఏకమై రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

    మిడ్ మానేరు భూ నిర్వాసితులకు అండగా ఉంటాం : బండి సంజయ్
    మిడ్ మానేరు భూ నిర్వాసితులపట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. వారికి కనీసం నష్టపరిహారం చెల్లించకుండా, ఉపాధి కల్పించకుండా మీన మేషాలు లెక్కిస్తున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ ను మిడ్ మానేరు నిర్వాసితులు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ గోడు విన్పించారు. తమ భూములను త్యాగం చేస్తే కనీస పరిహారం, సాయం చేయకుండా రోడ్డున పడేశారని వాపోయారు.
    • ఈ సందర్భంగా బండి సంజయ్ స్పందిస్తూ ‘‘మిడ్ మానేరు భూ నిర్వాసితులకు బీజేపీ అండగా ఉంటుంది. వారి తరపున పోరాడతాం. వారికి సాయం అందేవరకు ఉద్యమాలు చేస్తాం. కేసీఆర్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పండి. రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. భూ నిర్వాసితులకు తగిన సాయం అందిస్తాం’’అని హామీ ఇచ్చారు.
    • భూ నిర్వాసితులకు మద్దుతుగా బండి సంజయ్ బాధితులతో కలిసి ముస్తాబాద్ మండలం బద్దెనపల్లి నుండి పాదయాత్ర చేశారు. మరోవైపు ఆదివారం నాటి పాదయాత్రకు వేలాదిగా కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. బండి సంజయ్ తో కలిసి అడుగులో అడుగు వేస్తూ ముందుకు సాగారు. ‘జై బీజేపీ…భారత్ మాతాకీ జై. బండి సంజయ్ నాయకత్వం వర్దిల్లాలి’’అని నినదిస్తూ కదం తొక్కారు.
    • మరోవైపు బద్దెన పెళ్లి గ్రామంలో మహిళలు హారతులు పడుతూ బండి సంజయ్ కి స్వాగతం పలికారు. బద్దెనపల్లి గ్రామంలోని కొయ్యాడ దేవయ్య కుటుంబాన్ని కలిసి వారి ఆరోగ్య స్థితిగతులను, సమస్యలను అడిగి తెలుసుకుని అండగా ఉంటానని భరోసా ఇచ్చారుర.
    • రామన్న పల్లి గ్రామంలో బండి సంజయ్ తో కలిసి సినీనటి కరాటే కళ్యాణి పాదయాత్ర చేశారు. బండి సంజయ్ ని కలిసిన బొంబాయి వెళ్లి వచ్చిన కుటుంబానికి చెందిన భూలక్ష్మి అనే మహిళ భూమి లేదు ఆదాయం ఉన్నవాడికే ఆదాయం కల్పిస్తుంది ప్రభుత్వం అని విమర్శిస్తూ తన బాధలు చెప్పుకోవడం జరిగింది. రామన్న పల్లి గ్రామానికి చెందిన బండి సంజయ్ పాదయాత్ర గ్రామస్తులు మంగళ హారతులతో బండి సంజయ్ కి ఘన స్వాగతం పలికారు. గోల్డ్ స్మిత్ కార్మికుల సమస్యలను బిజెపి బండి సంజయ్ పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.