https://oktelugu.com/

Bigg Boss Telugu 5: బిగ్ బాస్ ఆదరణ..యాంకర్ రవికి షాక్.. అతడికే ఎక్కువ మద్దతు

bigg boss telugu 5 shanmukh gets huge social media support overtaking anchor ravi: తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ సందడి మొదలైంది. నిన్న మొత్తం ఏకంగా 19 మంది కంటెస్టెంట్లను హోస్ట్ నాగార్జున గ్రాండ్ గా బిగ్ బాస్ హౌస్ లోకి పంపించాడు. టీవీ ప్రేక్షకులు అంతా ఆసక్తిగా కంటెస్టెంట్లు ఎవరా? అని ఆరాతీశారు. అందరిలోకి యాంకర్ రవి(Anchor Ravi), యూట్యూబర్ షణ్ముఖ్(Shanmukh jashwanth)లకు ఎక్కువగా క్రేజ్ వచ్చింది. షో ఆరంభంలోనే ఎవరి […]

Written By:
  • NARESH
  • , Updated On : September 6, 2021 / 01:19 PM IST
    Follow us on

    bigg boss telugu 5 shanmukh gets huge social media support overtaking anchor ravi: తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ సందడి మొదలైంది. నిన్న మొత్తం ఏకంగా 19 మంది కంటెస్టెంట్లను హోస్ట్ నాగార్జున గ్రాండ్ గా బిగ్ బాస్ హౌస్ లోకి పంపించాడు. టీవీ ప్రేక్షకులు అంతా ఆసక్తిగా కంటెస్టెంట్లు ఎవరా? అని ఆరాతీశారు. అందరిలోకి యాంకర్ రవి(Anchor Ravi), యూట్యూబర్ షణ్ముఖ్(Shanmukh jashwanth)లకు ఎక్కువగా క్రేజ్ వచ్చింది.

    షో ఆరంభంలోనే ఎవరి బలం ఎంత అన్న లెక్కలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వచ్చాయి. ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్లుగా ఎంపికైన వారిలో ఎక్కువమంది పాపులర్ అయిన వాళ్లే ఉన్నారు. సోషల్ మీడియా ద్వారానో.. బుల్లితెర వెండితెరపై సందడి చేసే వాళ్లుగానో పలువురు గుర్తింపు దక్కించుకున్న వాళ్లు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు.

    ప్రధానంగా అందరిలోకి యాంకర్ రవితోపాటు యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ మధ్య టైటిల్ పోరు జరిగే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.

    బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చిన వాళ్లందరికీ స్వాగతం పలుకుతూ స్టార్ మా టీవీ చానెల్ ట్విట్టర్ పేజీలో అందరి ఫొటోలను షేర్ చేసింది. ఇందులో నెటిజన్ల నుంచి ఎక్కువ ఆదరణ పొందారు ఈ ఇద్దరు. లైకులు, కామెంట్లు, రీట్వీట్లు బాగా వచ్చిన వారిని చూస్తే అందులో అత్యధికం షణ్ముఖ్ జస్వంత్ కే రావడం విశేషం. ఆ తర్వాత స్థానంలో యాంకర్ రవి ఉన్నాడు.

    మిగిలిన కంటెస్టెంట్లకు ఏమాత్రం దగ్గర లేనంత మంది షణ్ముఖ్ కు సపోర్టు చేయడం విశేషం. దీంతో అతడి రేంజ్ మొదటిరోజే తెలిసింది. సుధీర్ఘకాలంగా బుల్లితెరపై యాంకర్ గా కమెడియన్ గా పేరు సంపాదించుకున్న రవి లక్షలమందికి తెలుసు. టైటిల్ ఫేవరేట్ గా ఉన్నాడు. అయితే యాంకర్ రవి కూడా షణ్ముఖ్ కంటే తక్కువ మద్దతు సోషల్ మీడియాలో లభించింది. ఆదిలోనే రవికి బిగ్ షాక్ తగిలినట్టుగా చెబుతున్నారు.