Realme GT 5 Ultra: 2026 కొత్త సంవత్సరంలో చాలా కంపెనీలు వినియోగదారులను ఆకర్షించేందుకు కొత్త ఫోన్లను తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఇందులో భాగంగా Realme కంపెనీ సైతం వినియోగదారుల అవసరాలను తీర్చడానికి కొత్త డివైస్లను మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ఈ కంపెనీ మిడ్ రేంజ్ పీపుల్స్కు ఎన్నో రకాల అనుగుణంగా ఉండే ఫోన్లను అందించింది. అయితే ఇప్పుడు ప్రీమియం ఫోన్లపై దృష్టి పెట్టింది. ఈ ఏడాదిలో ఓ ప్రీమియం ఫోన్ ను పరిచయం చేయడానికి సిద్ధమైంది. ఇందులో స్మార్ట్ ఫ్యూచర్లతో పాటు బ్యాటరీ, డిస్ప్లే అద్భుతంగా ఉండే అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు. అయితే ఈ ఫోన్ పై అంచనాలు ఎలా ఉన్నాయో ఎప్పుడూ చూద్దాం..
కొత్తగా మార్కెట్లోకి Realme కంపెనీ నుంచి GT 5 Ultra అని మొబైల్ రాబోతుంది. ఇది ఇది ఏడాది మార్చిలో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇంతకుముందే దీనికి సంబంధించిన వివరాలను ఆన్లైన్లో సమాచారం ఉంచారు. దీనిని చూసిన వినియోగదారులు ఈ ఫోన్ ఎప్పుడు వస్తుందా..? అని ఎదురుచూస్తున్నారు. అయితే ఇందులో ఉండే ఫీచర్లు, బ్యాటరీ ఆకట్టుకోవడమే అందుకు కారణం. ముఖ్యంగా ఇందులోని కెమెరా పనితీరు అద్భుతంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది.
మార్కెట్లోకి రాబోతున్న Realme GT5 Ultra మొబైల్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 4 అనే ప్రాసెసర్ ఉండనుంది. దీంతో రోజువారి వినియోగదారులతోపాటు ఫాస్టెస్ట్ గా ఫోన్ మూవ్ కావడానికి ఇది ఉపయోగపడుతుంది. గేమింగ్ కోరుకునే వారికి ఈ మొబైల్ అనుగుణంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ మొబైల్లో డిస్ప్లే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో 6.8 అంగుళాల AMOLED డిస్ప్లేను అమర్చారు. ఇది 144 Hz రిఫ్రెష్ రేట్ తో పని చేయనుంది. నాణ్యమైన మూవీస్ లేదా నెట్ఫ్లిక్స్ వంటి సినిమాలు చూడడానికి ఈ డిస్ప్లే అద్భుతంగా పనిచేస్తుంది. కంటికి నింపుగా ఉండే రంగులను డిస్ప్లే చేస్తూ వినియోగదారులకు ఎలాంటి అలజడి లేకుండా చూస్తుంది.
రియల్ మీ ఈ కొత్త మొబైల్ లో కెమెరా ప్రత్యేకంగా ఉండనుంది. ఎందుకంటే ఇందులో ఉండే కెమెరా 50 MP మెయిన్ కెమెరా ఉండనుంది. అలాగే అల్ట్రా వైడ్ కెమెరా 50 MP తో పని చేయనుంది. మరోవైపు 32 MP సెల్ఫీ కెమెరా వాడుకోవచ్చు. ఈ మూడు కెమెరాలు కలిపి ఆకట్టుకునే ఫోటోలను తీసుకోవచ్చు. సెల్ఫీ ఫోటోలతోపాటు వీడియో రికార్డింగ్, వీడియో కాలింగ్ కోసం ఈ కెమెరా ప్రత్యేకంగా నిలిచే అవకాశం ఉంది. అలాగే AI తరహాలో ఫోటోలు కావాలని అనుకునే వారికి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మొబైల్లో బ్యాటరీ మెరుగ్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో 5500 mAh బ్యాటరీని చేర్చారు. ఇది 150 W ఫాస్టెస్ట్ చార్జింగ్తో పనిచేస్తుంది. ఇక ఈ మొబైల్ మార్కెట్లోకి వస్తే రూ.44,999 ప్రారంభ ధర నుంచి రూ.49,999 ధర వరకు విక్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది.