Bigg Boss 6 Telugu- Surya: స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న సూర్య ఎలిమినేట్ అవుతాడని ఎవరూ ఊహించలేదు. అనూహ్యంగా 8వ వారం సూర్య ఎలిమినేటై బయటకు వెళ్ళిపోయాడు. ఒకసారి కెప్టెన్ అయిన సూర్య స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్నాడు. గేమ్స్, టాస్క్ లలో సూర్య గట్టిపోటీ ఇచ్చేవాడు. ఇంట్లో పనుల విషయంలో కూడా సూర్య చురుగ్గా ఉండేవాడని హౌస్ మేట్స్ కితాబు ఇచ్చారు. సూర్య ఫేస్ చేసిన ఒకే ఒక్క నెగిటివిటీ… అఫైర్స్. ఈ సీజన్ కి మన్మధ రాజా అనే బ్రాండ్ పడింది. మొదట ఆరోహి రావుతో ఆమె ఎలిమినేట్ అయ్యాక ఇనయాతో నాన్ స్టాప్ రొమాన్స్ కురిపించాడు.

ఇనయా అయితే ఓపెన్ గా నా క్రష్ అని చెప్పేసింది. సూర్యపై ఎక్కడ లేని ప్రేమ కురిపించింది. వాసంతి, చివరకు ఫైమా పై కూడా సూర్య కన్నేశాడు. అంతగా వన్ బై వన్ వాడేశాడు సూర్య. తన గేమ్ ఆడుతూనే రొమాంటిక్ యాంగిల్ వదల్లేదు. ఇవన్నీ కాక బయట బుజ్జమ్మ ఉందన్నాడు. ఆమె అంటే నాకు ఎంతో ఇష్టం. మాది స్నేహానికి మించిన రిలేషన్ అనేవాడు. ఈ ఐటెం రాజాను మనం తట్టుకోలేమని ప్రేక్షకులు ఇంటికి పంపేశారు.
అయితే మనోడికి చదువుకునే రోజుల్లో సినిమాను తలపించే సీరియస్ లవ్ స్టోరీ ఉందట. ఎంబీఏ జాయిన్ కాగానే ఒక అమ్మాయి ప్రేమలో పడ్డాడట. చేసుకుంటే ఆమెనే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడట. అయితే సూర్య పేరెంట్స్ ససేమిరా అన్నారట. దాంతో ఆత్మహత్యా ప్రయత్నం చేశాడట. దీంతో చేసేది లేక సూర్య వాళ్ళ అమ్మగారు అమ్మాయి పేరెంట్స్ తో మాట్లాడారట. అయితే చదువు పూర్తి అయ్యేవరకు ఇద్దరూ కలవకూడదు, మాట్లాడుకోకూడదని కండీషన్ పెట్టారట.

అప్పటికి కూడా మీ ప్రేమ అలానే ఉంటే పెళ్లి చేస్తాం అన్నారట. ఎంబీఏ ఫస్ట్ ఇయర్ పూర్తయ్యాక హాలిడేస్ లో ఆ అమ్మాయి ఫోన్ చేసి మీ అమ్మ మాట్లాడిన తీరు ఏం బాగోలేదు. నాకు ఏదో తేడా కొడుతుంది. నేను నీకు కావాలి అనుకుంటే అమ్మానాన్నలను వదిలేసి నాతో పాటు మా ఇంట్లో ఉండిపో, అందట. దానికి సూర్య ఫోన్ పగలగొట్టి అమ్మ కాళ్లపై పడి తప్పు చేశానని ఏడ్చాడట. అలా తన లవ్ స్టోరీ ఎండ్ అయ్యిందట. అమ్మ బీడీలు చుట్టి, నాన్న తాపీ పని చేసి కుటుంబాన్ని పోషించారని సూర్య చెప్పుకొచ్చారు.