Bigg Boss Subhasree: అనూహ్యంగా వరుసగా ఐదుగురు లేడీ కంటెస్టెంట్స్ హౌస్ వీడారు. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు. బిగ్ బాస్ సీజన్ 7 కేవలం 14 మంది కంటెస్టెంట్స్ తో మొదలైంది. వీరిలో ఏడుగురు అమ్మాయిలు ఏడుగురు అబ్బాయిలు. అబ్బాయిల్లో ఒక్కరు కూడా ఇంత వరకు ఎలిమినేట్ కాలేదు. ఫస్ట్ వీక్ కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ కాగా… షకీలా, దామిని, రతికా రోజ్ వరుసగా తర్వాత వారాల్లో గుడ్ బై చెప్పారు. ఇక ఐదవ వారం కూడా లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ కావడం కొసమెరుపు.
శుభశ్రీ రాయగురు ఎలిమినేట్ అయినట్లు ఆదివారం ఎపిసోడ్లో నాగార్జున ప్రకటించారు. ఎపిసోడ్ ఎలిమినేషన్ తో మొదలుపెట్టిన నాగార్జున నామినేషన్స్ లో ఉన్న శివాజీ, అమర్ దీప్, యావర్, తేజా, ప్రియాంక, గౌతమ్, శుభశ్రీలను డార్క్ రూమ్ కి పంపాడు. అక్కడ ఘోస్ట్ గెటప్ లో ఉన్న వ్యక్తి శుభశ్రీని ఎలిమినేట్ చేసి బయటకు తీసుకొచ్చాడు. దాంతో నాగార్జున ఆమె ఎలిమినేట్ అయినట్లు వెల్లడించాడు.
నిజానికి ప్రియాంక ఎలిమినేట్ కానుందని ప్రచారం జరిగింది. తర్వాత శుభశ్రీ పేరు తెరపైకి వచ్చింది. శుభశ్రీ హౌస్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకుంది. గౌతమ్ తో ఆమె లవ్ ట్రాక్ నడిపింది. అయితే హద్దుల్లో ఉన్నారు. గౌతమ్ తనను కోరుకుంటున్నాడని తెలిసినా శుభశ్రీ ఓపెన్ కాలేదు. అలా అని పూర్తిగా దూరం పెట్టలేదు. మిగతా వాళ్ళ కంటే కొంచెం ఎక్కువ అతనితో సన్నిహితంగా ఉండేది. ఇక ఎలిమినేట్ అయ్యాక వేదికపై కూడా ఈ విషయాన్ని ఆమె ప్రస్తావించింది. గౌతమ్ తనను ఫ్లర్ట్ చేసే ప్రయత్నం చేశాడని చెప్పింది.
ఏదేమైనా శుభశ్రీ బిగ్ బాస్ ఇంటి నుండి సొంత ఇంటికి వెళ్ళింది. మరి ఐదు వారాలు ఉన్న శుభశ్రీ రెమ్యూనరేషన్ ఎంతనే చర్చ మొదలైంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం శుభశ్రీ వారానికి రూ. 2 లక్షల ఒప్పందంపై హౌస్లో అడుగుపెట్టిందట. కాబట్టి శుభశ్రీకి రెమ్యూనరేషన్ గా రూ. 10 లక్షలు దక్కాయని అంటున్నారు. వృత్తి రీత్యా లాయర్ అయిన శుభశ్రీ నటనపై మక్కువతో టాలీవుడ్ వైపు అడుగులు వేశారు. కాగా గౌతమ్ కూడా ఎలిమినేట్ అయ్యాడు. అయితే అతన్ని సీక్రెట్ రూమ్ కి పంపడం జరిగింది.