Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Sohel: ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్న బిగ్ బాస్ సోహైల్... ఇదేం పబ్లిసిటీ...

Bigg Boss Sohel: ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్న బిగ్ బాస్ సోహైల్… ఇదేం పబ్లిసిటీ బాబోయ్

Bigg Boss Sohel: బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బూట్ కట్ బాలరాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కానుంది. బూట్ కట్ బాలరాజు ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. సోహెల్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. తన సినిమా థియేటర్ కి వచ్చి చూడాలని మోకాళ్లపై కూర్చుని మరీ రిక్వెస్ట్ చేసాడు. సోహెల్ ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి అవ్వడం విశేషం.

బిగ్ బాస్ ద్వారా ఫేమ్ తెచ్చుకున్న సోహెల్ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని వరుస సినిమాలతో బిజీ గా ఉంటున్నాడు. ఇప్పటివరకు హీరోగా అరడజను చిత్రాలు చేసినప్పటికీ ఆశించినంత విజయం అందుకోలేక పోయాడు. రీసెంట్ గా వచ్చిన మిస్టర్ ప్రెగ్నెంట్ మంచి టాక్ సొంతం చేసుకుంది. కమర్షియల్ గా ఆడలేదు. తాజాగా బూట్ కట్ బాలరాజు సినిమా పై ఎన్నో హోప్స్ పెట్టుకున్నాడు. నిర్మాత కావడంతో మూవీ ని సక్సెస్ చేసేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు.

హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ .. ఈ సినిమాకు నేనే ప్రొడ్యూసర్ .. భారీగా పబ్లిసిటీ చేసేందుకు నా దగ్గర పైసల్లేవ్. నేను ఎన్నో కష్టాలు పడ్డాను. మా నాన్న రిటైర్మెంట్ డబ్బులు, నా దగ్గరున్న పైసలు మొత్తం ఈ సినిమాకు పెట్టాను. మిమ్మల్ని ఇంత కంటే ఎలా అడగాలో కూడా తెలియడం లేదు. అన్ని ప్రయత్నాలు చేశాను. ఫిబ్రవరి 2న నా సినిమాను చూడండి అని మోకాళ్ళ పై కూర్చుని ప్రాధేయపడ్డాడు.

ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. చూస్తుంటే సోహైల్ ప్రేక్షకులను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడనిపిస్తుంది. ఈ ఈవెంట్ కి గెస్ట్ లుగా హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, హీరో సందీప్ కిషన్ హాజరయ్యారు. ఈ సినిమాలో సోహెల్ కి జంటగా మేఘ లేఖ నటిస్తుంది. సునీల్, సిరి హన్మంత్, అవినాష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ కోనేటి నిర్మించారు. గ్లోబల్ ఫిలిమ్స్, కథ వేరుంటది బ్యానర్ పై రూపుదిద్దుకుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.

RELATED ARTICLES

Most Popular