https://oktelugu.com/

Bigg Boss Sohel: నన్ను తేడా గాడు అన్నారు… స్టేజి మీదే కన్నీరు పెట్టుకున్న బిగ్ బాస్ సోహైల్!

మిస్టర్ ప్రెగ్నెంట్ అనే సినిమా తాజాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్టు 18 విడుదల కాబోతుంది.

Written By:
  • Shiva
  • , Updated On : August 1, 2023 / 12:27 PM IST

    Bigg Boss Sohel

    Follow us on

    Bigg Boss Sohel: సోహైల్ బుల్లితెర మీద సీరియల్స్ ద్వారా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు. బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా అశేష అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. బిగ్ బాస్ షో లో మెహబూబ్ తో స్నేహం చేసి, స్నేహానికి అసలైన నిర్వచనం ఏమిటో చూపించి ప్రేక్షకులకు దగ్గర అయ్యారు. తాజాగా ఆయన ఒక షో లో మాట్లాడుతూ తాను ఎదుర్కొన్న అవమానాలు గురించి చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

    బిగ్ బాస్ షో తర్వాత అతనికి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. వరసపెట్టి హీరోగా సినిమాలు స్టార్ట్ చేశారు. లక్కీ లక్ష్మణ్ అనే సినిమా తో ముందుకు వచ్చిన సోహెల్ కు పరాజయం ఎదురైంది. ఆ తర్వాత సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో మరో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తో కలిసి నటించిన ఆర్గానిక్ మామ – హైబ్రిడ్ అల్లుడు సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బకెట్ తన్నేసింది. అయితే ఈ సారి ఎలాగైనా హిట్ అందుకోవాలని ఒక డిఫరెంట్ స్టోరీ తో రాబోతున్నాడు సోహెల్.

    మిస్టర్ ప్రెగ్నెంట్ అనే సినిమా తాజాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్టు 18 విడుదల కాబోతుంది. మైక్ మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో రూప కొడువాయూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగా సుమ నిర్వహిస్తున్న ఒక షోలో దీప్తి నల్లమోతు, రూప, అలీ రెజా తో కలిసి సోహెల్ సందడి చేశారు. ఇదే షో లో కొన్ని విషయాలు మాట్లాడుతూ బాగా ఎమోషనల్ అయ్యాడు.

    “ఇక్కడ లైఫ్ లో ముందుకు వెళ్ళాలి. ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారో లేదో ? వాడు రియాలిటీ షో నుండి వచ్చాడు. చిన్న స్క్రీన్ నుండి వచ్చాడు ” అంటూ చుట్టూ పక్కల వాళ్ళు అంటుంటే అప్పుడప్పుడు చాలా భయం వేసింది. ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు చాలా మంది హేళన చేశారు. తర్వాత మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా టీజర్ వచ్చినప్పుడు ఏందిరా తేడా గాడిగా ఉన్నాడు అంటూ కామెంట్స్ చేసారంటూ తనకు జరిగిన అవమానాలు తలచుకొని స్టేజి మీద కన్నీళ్లు పెట్టుకున్నాడు సయ్యద్ సోహెల్