Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ లో భాగంగా కంటెస్టెంట్స్ ఫుల్ ఎమోషనల్ అవుతున్నారు. ఇన్ని రోజులు కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్న హౌస్ మేట్స్ .. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ ని చూసిన సంతోషంలో కన్నీళ్లు ఆపుకోలేక పోతున్నారు. కాగా ఈ రోజు ఎపిసోడ్ లో అమర్ దీప్ భార్య తేజస్విని గౌడ ఎంట్రీ ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో చాలా ఆసక్తికరంగా ఉంది. అమర్ దీప్ ని కాసేపు ఆటపట్టించారు బిగ్ బాస్.
అయితే ముందు అమర్ దీప్ ని కన్ఫెషన్ రూమ్ కి పిలిచారు బిగ్ బాస్. బర్త్ డే సందర్భంగా తేజస్విని మీకు కేక్ పంపించింది. కొన్ని కారణాల వలన ఆమె హౌస్ లోకి రాలేకపోయింది అని బిగ్ బాస్ చెప్పారు. దీంతో అమర్ కాస్త బాధపడుతూ ‘ఓకే నువ్వు వస్తావు అనుకున్న .. అందరూ వస్తున్నారు కదా నువ్వు కూడా వస్తావు అనిపించింది అనుకుంటూ ఫీల్ అయ్యాడు. బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ గా విషెస్ చెప్పాడు.
కాగా కేక్ తో బయటకు వచ్చిన అమర్ తన భార్యను చూసి ఎమోషనల్ అయ్యాడు. గట్టిగా హత్తుకుని ఏడ్చేశాడు. తేజస్విని కూడా అమర్ ని చూసి కన్నీరు పెట్టుకుంది.మళ్ళీ పెళ్లి చేసుకుందాం అంటూ భార్యతో జోక్ చేశాడు. తర్వాత వాళ్ళు కాసేపు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. అమర్,తేజు తో మాట్లాడుతూ ‘చాలా మిస్ అయ్యాను .. కొన్ని సార్లు పడుకొని ఏడ్చాను .. కొన్ని సార్లు ఏడిస్తే కనపడుతుందని కనిపించకుండా ఏడ్చాను అంటూ ఫీలింగ్స్ భార్యతో పంచుకున్నాడు.
తర్వాత గార్డెన్ ఏరియా లో కేక్ కట్ చేసి అమర్ బర్త్ డే సెలబ్రేట్ చేశారు. తేజస్విని అమర్ కి ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగి ప్రపోజ్ చేసింది. ఇక అమర్ దీప్ కి ముద్దు పెట్టి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పి బయటకు వెళ్ళింది తేజస్విని. ఫ్యామిలీ వీక్ లో శివాజీ కొడుకు కెన్నీ, అర్జున్ భార్య సురేఖ, అశ్విని తల్లి, గౌతమ్ తల్లి, ప్రియాంక లవర్ శివ కుమార్, భోలే సతీమణి వచ్చారు.
Bigg Boss Family Day – Day 3 Birthday surprise by the love of life of a contestant! To know the surprise, tune in to #BiggBoss! Mon-Fri at 9:30 PM and Sat-Sun at 9 PM. Don’t miss the heartwarming moments and unexpected twists @iamnagarjuna https://t.co/JNLheCrntZ
— Starmaa (@StarMaa) November 9, 2023