Homeఎంటర్టైన్మెంట్Pallavi Prashanth: పాపం పర్సనల్ గా టార్గెట్ అయినా పల్లవి ప్రశాంత్..

Pallavi Prashanth: పాపం పర్సనల్ గా టార్గెట్ అయినా పల్లవి ప్రశాంత్..

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డను అంటూ డ్రామాలాడుతూ హౌస్ లోకి ఎంటర్ అయ్యాడు అనే అనే విషయం ఆడియన్స్ ఎప్పుడో పసిగట్టేశారు. అయితే అదే హౌస్ లో ఉంటూ అతని ద్వంద్వ వైఖరి చూసి విసుగు చెందిన అమరదీప్ నిన్న అతని అసలు స్వరూపాన్ని బయట పెట్టడానికి కాస్త ఆవేశంగా మాట్లాడాడు. అయితే ఈ నేపథ్యంలో అమరదీప్ మాట్లాడిన తీరు కొన్ని విమర్శలను అందుకుంటుంది. అతనితో పెద్ద స్టార్ హీరో అయినట్టు…నీకే అంత ఉంటే నాకెంత ఉంటుంది.. నీ కన్నా గొప్ప నటుడ్ని.. అవును నేను పుట్టుకతోనే నటుడ్ని అంటూ చెప్పిన బిల్డప్ మాటలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి.

అయితే ప్రస్తుతం హౌస్ లో ఉన్న వాళ్ళందరితో పోల్చుకుంటే…. పల్లవి ప్రశాంత్ పై కంటెస్టెంట్స్ తో బాగా కసి ఉంది అనే విషయం నామినేషన్ లోనే అర్థమైపోయింది. మరి ముఖ్యంగా అతని మాట తీరు ,ప్రవర్తన పై హౌస్ లో చాలామంది అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. నామినేట్ చేసే సమయంలో పల్లవి ప్రశాంత్ పుష్ప లో పుష్పరాజు టైప్ ఆటిట్యూడ్ చూపిస్తూ ఒక భుజం ఎత్తి నిలబడడం, మీసం తిప్పడం.. తొడ కొట్టడం.. ఇలాంటి మాస్ మేనేజర్ చేసి హైలెట్ అవ్వడానికి ప్రయత్నించాడు.

హౌస్ మేట్స్ దీనిపై కూడా తమ అభ్యంతరాన్ని ఘాటుగానే వ్యక్తం చేశారు.
అయితే ప్రస్తుతం నెట్టింట వైరల్ అయిన ఈ వీడియోస్ మిశ్రమ విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు అమరదీప్ చేసింది కరెక్టే అంటుంటే చాలామంది కావాలని పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేశారు అన్న ధోరణిలో కామెంట్స్ పెడుతున్నారు. నిజానికి పల్లవి ప్రశాంత్ ని పర్సనల్గా టార్గెట్ చేయడం అనేది అప్పటికప్పుడు జరిగిన విషయమైతే కాదు. బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఎపిసోడ్స్ అన్ని మీరు ఫాలో అవుతే ఈ విషయం మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది.

ముందు పక్కాగా ప్లాన్ చేసుకొని.. కంప్లీట్ స్కెచ్ వేసి మరి పల్లవి ప్రశాంత్ కు చెక్ పెట్టారు అన్న విషయం లైవ్ ఎపిసోడ్ లో స్పష్టంగా చూడవచ్చు. అది కూడా బిగ్ బాస్ షో స్టార్ట్ అయిన మొదటి రోజే పల్లవి ప్రశాంత్ ని చూసి అమరదీప్ ,ఆట సందీప్ ఇద్దరు భయపడ్డారు. సెప్టెంబర్ 3 రాత్రి అంటే బిగ్ బాస్ ఆట మొదలైన నాడు.. అందరికంటే పడుకున్నప్పటికీ అమర్ దీప్, ఆట సందీప్, పల్లవి ప్రశాంత్, రతికలు మాత్రం మేలుకొని ఉన్నారు. రాత్రి అంతా నైట్ అవుట్ చేసిన వీరు కలిసి ముచ్చట్లు ఆడుకుంటున్న సమయంలో పల్లవి ప్రశాంత్ ఫ్యూచర్లో బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతాడు అని సందీప్ ,అమర్ దీప్‌లు పసిగట్టారు.

ఇక రాత్రి పల్లవి ప్రశాంత కి చెక్కు పెట్టడానికి బీజం పడింది…ఇంతకీ ఆ రోజు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారంటే.. ప్రశాంతి చూస్తుంటే ప్రళయం వచ్చే ముందు ప్రశాంతత కనిపిస్తుంది…మనోడికి ఫోకస్ బాగానే ఉంది.. అని ఆట సందీప్ అన్నప్పుడు..‘అబ్బే అదేం లేదు సార్’అని ప్రశాంత్ నవ్వుతూనే సమాధానం ఇచ్చాడు. అయితే అమర్ దీప్ మాత్రం నాకు డౌటే.. నాకూ ఏదో తేడా కొడుతుంది…అని అన్నాడు. అందుకే పల్లవి ప్రశాంత్ నువ్వు సపోర్ట్ చేస్తున్న శివాజీ ని కూడా ఒక చెత్త రీజన్ తో నామినేట్ చేశారు.

బిగ్ బాస్ హౌస్లో నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత…చాలామంది అమర్ దీప్ తన సీరియల్ బ్యాచ్ ని పోగు చేసుకుని పల్లవి ప్రశాంత్ పై పర్సనల్ అటాక్ చేస్తున్నాడు అని అంటున్నారు. అయితే కిందపడ్డ మెతుకులు ఏరుకుని తిన్నా రాని సింపథీ….. నామినేషన్స్ సమయంలో అతని మీద జరిగిన పర్సనల్ అటాక్ కారణంగా ఇప్పుడు పల్లవికి దక్కుతోంది. తనని నామినేట్ చేసిన అందరూ రారా పోరా అని మాట్లాడుతుంటే …అక్కడ కూడా ఏమాత్రం తన టెంపర్ లూస్ కాకుండా అన్నా అన్నా అనే…పల్లవి ప్రశాంత్ అనడం ప్రస్తుతం అతనికి ఎక్కడలేని సానుభూతిని తెచ్చిపెట్టింది.

Bathini Surendar
Bathini Surendarhttp://oktelugu
Bathini Surendar is a Journlist and content writer with good Knowledge on News Writing. He is experience in writing stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular