https://oktelugu.com/

Priyanka Jain Marriage: ప్రియుడితో పెళ్ళికి సిద్ధమైన బిగ్ బాస్ ప్రియాంక…. ముహూర్తం ఎప్పుడంటే?

మౌనరాగం సీరియల్ లో కలిసి నటించిన శివ కుమార్ - ప్రియాంకలు ప్రేమలో పడ్డారు. కొన్నేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్నారు. కానీ ఎప్పుడూ బహిరంగంగా ప్రేమ .. పెళ్లి గురించి వారు వెల్లడించలేదు.

Written By:
  • NARESH
  • , Updated On : December 27, 2023 / 09:05 AM IST

    Priyanka Jain Marriage

    Follow us on

    Priyanka Jain Marriage: బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ శుభవార్త చెప్పింది. త్వరలోనే ప్రియుడు శివ కుమార్ తో పెళ్లి పీటలు ఎక్కనుందట. గత కొన్నేళ్లుగా శివ కుమార్ తో ప్రేమలో ఉంది ప్రియాంక. కానీ ఈ విషయాన్ని ఎక్కడా బహిర్గతం చేయలేదు. అసలు వాళ్ళు ప్రేమికులా లేక ఫ్రెండ్స్ మాత్రమేనా అనే సందేహాలు కలిగిస్తూ దాగుడు మూతలు ఆడేవారు. అయితే బిగ్ బాస్ షో ద్వారా వీరిద్దరి బంధం గురించి జనానికి ఫుల్ క్లారిటీ వచ్చింది.

    మౌనరాగం సీరియల్ లో కలిసి నటించిన శివ కుమార్ – ప్రియాంకలు ప్రేమలో పడ్డారు. కొన్నేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్నారు. కానీ ఎప్పుడూ బహిరంగంగా ప్రేమ .. పెళ్లి గురించి వారు వెల్లడించలేదు. కాగా ఫ్యామిలీ వీక్ లో భాగంగా ప్రియాంక కోసం వచ్చిన శివ కుమార్ ఆమెను ముద్దులతో ముంచెత్తాడు. పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అని ప్రియాంక అంటే .. నువ్వు బయటకు రాగానే చేసుకుందాం అంటూ శివ చెప్పడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయిపోయారు.

    అయితే తాజాగా ప్రియాంక పెళ్లి గురించి తన యూట్యూబ్ ఛానల్ లో అప్డేట్ ఇచ్చింది. వచ్చే ఏడాదే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. త్వరలోనే ముహూర్తం ఫిక్స్ చేసి ఆ పెళ్లి తేదీ కూడా సోషల్ మీడియాలో వెల్లడిస్తామని తెలిపింది. అలాగే తనకు పెళ్లి గురించి చాలా ఆలోచనలు ఉన్నాయని .. అవన్నీ మరో వీడియోలో చెప్తానంది.

    కాగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నపుడు ప్రియాంక పవర్ అస్త్ర కంటెండర్ టాస్క్ కోసం జుట్టు కత్తిరించుకున్న సంగతి తెలిసందే. ఈ క్రమంలో తన హెయిర్ కాస్త పొడుగ్గా అయిన తర్వాత వివాహం చేసుకుంటాను అంది. అదే విధంగా మరో ఇంట్రెస్టింగ్ విషయం షేర్ చేసుకుంది ప్రియాంక. బిగ్ బాస్ సీజన్ 7 మరో కంటెస్టెంట్ శోభా శెట్టి కూడా త్వరలోనే మూడుముళ్ల బంధంలో అడుగు పెట్టనుందట. తన బెస్ట్ ఫ్రెండ్ శోభా కు కంగ్రాట్స్ తెలిపింది. దీంతో అభిమానులు ఇద్దరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.