Bigg Boss OTT Telugu Nominations: బిగ్ బాస్ ఓటీటీ అనుకున్నట్టుగానే రంజుగా సాగుతోంది. బూతులు, డబుల్ మీనింగ్ డైలాగులు, గొడవలతో రచ్చ రచ్చ చేస్తున్నారు కంటెస్టెంట్లు. ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి చేసుకున్న ఈ షోకు.. విపరీతమైన క్రేజ్ వస్తోంది. నాలుగు వారాల్లో వరుసగా ముమైత్ ఖాన్, శ్రీ రాపాక, ఆర్జే చైతు, సరయులు ఎలిమినేట్ అయిపోయారు.
బిగ్ బాస్ టాస్క్ లన్నింటిలో కెల్లా నామినేషన్స్ ప్రక్రియనే ఎక్కువ గొడవలకు కారణం అవుతుంది. అప్పటి వరకు ఫ్రెండ్స్ అన్న వారు కూడా.. ఈ టాస్క్ లో ఒక్క సారిగా శత్రువులు అయిపోతుంటారు. అయితే ఐదో వారం కూడా ఏడుగురు నామినేట్ అయ్యారు. 17 మంది ఎంట్రీ ఇవ్వగా.. నలుగురు వెళ్లిపోయారు. అంటే ఉన్న 13మందిలో ఏడుగురు నామినేట్ అయ్యారన్న మాట.
Also Read: Best Dialogues From KGF Series: `కేజీఎఫ్` సిరీస్ నుంచి వచ్చిన బెస్ట్ డైలాగ్స్
సోమవారం నామినేషన్స్ ప్రక్రియ ఎన్నో గొడవల మధ్య జరిగింది. చివరకు ఈ టాస్క్ లో ఐదో వారం బిందు మాధవి, మిత్రా శర్మతో పాటుగా యాంకర్ శివ, మహేశ్ విట్టా అలాగే ఆరియానా గ్లోరి, హాట్ బ్యూటీ అషు రెడ్డి, అనిల్ రాథోడ్ లు నామినేట్ అయ్యారు. అయితే ఈసారి ఎవరూ ఊహించని విధంగా నామినేట్ అయిన వారికి బంపర్ ఆఫర్ ఇచ్చాడు బిగ్ బాస్.
ఒకరకంగా ఇది నామినేట్ అయిన వారికి గొప్ప అవకాశమనే చెప్పొచ్చు. అదే సమయంలో గొడవలను మరింత పెంచేదిగా ఉంది. అదేంటంటే.. నామినేట్ అయిన ఏడుగురిలో ఒకరిని స్వైప్ చేసుకనే అవకాశం ఇచ్చారు బిగ్ బాస్. అంటే నామినేట్ కాని వారిలో ఒకరిని రీ ప్లేస్ చేసుకుని ఒకరు సేఫ్ అవ్వొచ్చన్న మాట. నామినేట్ అయిన వారికి తల ఒక బెలూన్ ను ఇచ్చాడు బిగ్ బాస్.
చివరి దాకా ఎవరైతే ఈ బెలూన్ ను కాపాడుకుంటారో.. వారు ఒకరిని స్వైప్ చేసుకోవచ్చు. ఇంకేముంది ఒకరి బెలూన్ ను మరొకరు పగలగొట్టేందుకు ఎగబడ్డారు. ఆరియానా, మిత్రా శర్మల బెలూన్లను యాంకర్ శివ వెంటపడి మరీ పగలగొట్టేశాడు. దీంతో వారు అతని బెలూన్ ను కూడా పగలగొట్టేశారు. అనిల్, బిందు మాధవి బెలూన్లను ఆరియానా పగలగొట్టేసింది. చివరగా అషు రెడ్డి బెలూన్‌ను కాపాడుకునే ప్రయత్నం చేయగా.. మహేశ్ విట్టా పగలగొట్టాడు.
ఇలా చివరి వరకు బెలూన్లను కాపాడుకున్న ఒకరు నామినేట్ కాని యాంకర్ స్రవంతిని బలి చేశారని ప్రోమోలో తెలుస్తోంది. అంటే బిగ్ బాస్ రూల్ ప్రకారం నామినేట్ కాకపోయినా.. చివరకు దురదృష్టం అలా వెంటాడిందన్నమాట. ఏదేమైనా దీన్ని ప్రేక్షకులు కూడా విభేదిస్తున్నారు. కానీ బిగ్ బాస్ ఎప్పుడు ఎలాంటి టాస్క్ లు ఇస్తారో చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు కదా. అందులో ఇదొకటి.
Also Read: Interesting Facts About Oscar Awards: ‘ఆస్కార్ అవార్డ్’ దేనితో తయారు చేస్తారు ? దాని విలువ ఎంత ?