Aryan Khan: బాలీవుడ్ సూపర్ స్టార్ ‘షారుక్ ఖాన్’ కొడుకు ‘ఆర్యన్ ఖాన్’ రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా బుక్ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఈ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) కస్టడికీ వెళ్లడంతో బాలీవుడ్ షాక్ అయింది. ఇప్పటికే, ఆర్యన్ ఆర్థర్ రోడ్ జైలులో సుమారు 20 రోజులు గడిపాడు. ముంబై హైకోర్టు ఆర్యన్ కి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. కాకపోతే.. ఈ డ్రగ్స్ కేసును ఎన్సీబీ సిట్ దర్యాప్తు చేస్తోంది.
కాగా తాజాగా ఈ కేసులో ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసేందుకు 90 రోజుల అదనపు సమయం కావాలని ఎన్సీబీ అధికారులు కోర్టును కోరారు. ఆర్యన్ డ్రగ్స్ కేసులో ఛార్జ్‌షీట్ ఫైల్ చేసేందుకు ఏప్రిల్ 2 చివరి తేది అవుతుంది. మొత్తానికి ఎన్సీబీ అధికారులు ఆర్యన్ ఖాన్ ను వదిలేలా లేరు. ఎట్టిపరిస్థితుల్లో అతన్ని బుక్ చేయడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ తో పాటు ఎనిమిది మందిని ఎన్.సీ.బీ అధికారులు విచారించిన సంగతి కూడా తెలిసిందే.
Also Read: RR vs SRH Match Preview: నేడే సన్ రైజర్స్ తొలి మ్యాచ్.. బరిలోకి దిగే టీం ఇదే..
అయితే, ఆ విచారణలో హీరోయిన్ అనన్య పాండే పేరు కూడా బాగా వినిపించింది అని బాగా ప్రచారం జరిగింది. దాంతో ఎన్‌సీబీ అధికారులు అనన్య పాండేను పిలిపించి విచారించారు. ఈ విచారణలో ఆమె సమాధానాలు క్లారిటీగా లేవు అని తెలుస్తోంది. డ్రగ్స్ తాను ఎప్పుడూ తీసుకోలేదని చెబుతున్న ఆమె, మరి డ్రగ్ డీలర్స్ తో ఎందుకు మాట్లాడిందో మాత్రం చెప్పడం లేదు. అయినా డ్రగ్స్ తీసుకోలేదు అని చెబితే ఎలా నమ్మాలి ?
పైగా ఆమె పై ఉన్న ప్రధాన ఆరోపణ షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు డ్రగ్స్ కొనుగోలు కోసం ఆమె సహాయం చేసింది అని. అయితే అనన్య మాత్రం ఆర్యన్ ఖాన్ కు డ్రగ్స్ కొనుగోలు కోసం తాను ఎప్పుడూ సహాయం చేయలేదని చెబుతుంది. కానీ ముంబై క్రూయిజ్ లో మాదక ద్రవ్యాలు పట్టుబడిన కేసుతో ఆమెకు సంబంధం ఉంది అంటున్నారు. అందుకు సంబంధించి ఆర్యన్ ఖాన్ తో రెండేళ్ల క్రితం నుంచే వాట్సాప్ లో కమ్యూనికేట్ జరుపుతుందట.
ఆ మెసేజ్ ల తాలూకు ఆధారాలు కూడా అధికారుల వద్ద ఉన్నాయని తెలుస్తోంది. మెయిన్ గా 2018–19లో ఆర్యన్ ఖాన్ కు డ్రగ్స్ డీలర్ల నంబర్లు ఇచ్చిందని ఎన్‌సీబీ వర్గాలు తెలిపాయి. పైగా స్టార్ హీరోల పిల్లల గెట్ టుగెదర్ పార్టీలలో ఆర్యన్ ఖాన్ కి అనన్య డ్రగ్స్ కూడా సరఫరా చేసిందని ఎన్‌సీబీ అధికారులు చెబుతున్నారు.
Also Read: BJP Focus On Telangana: తెలంగాణపై ఢిల్లీ నేతల కన్ను.. ఏప్రిల్ లో మరింత హీటెక్కనున్న రాజకీయాలు
Recommended Video: