Homeఎంటర్టైన్మెంట్Bigg Boss OTT Telugu Bindu Madhavi: ఆమె 'టైటిల్ విన్నర్'.. బిగ్...

Bigg Boss OTT Telugu Bindu Madhavi: ఆమె ‘టైటిల్ విన్నర్’.. బిగ్ బాస్ విశ్లేషకుల రివ్యూ ఇది

Bigg Boss OTT Telugu Bindu Madhavi:  ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ షోలో రోజురోజుకు ఎమోషనల్ రివెంజ్ డ్రామాలు, కంటెస్టెంట్ల మధ్య వింత వింత టాస్కులు.. ప్రేక్షకులకు మరింత కిక్ ను ఇస్తున్నాయి. కంటెస్టెంట్లు కూడా గెలవడానికి ఎవరికి వాళ్ళు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, హౌస్‌ లో ఉన్నోళ్లకి ‘ఆవకాయ బిర్యానీ తినిపిస్తా’.. అంటూ హౌస్‌ లోకి అడుగు పెట్టింది బిందు మాధవి.

Bigg Boss OTT Telugu Bindu Madhavi:
Bigg Boss OTT Telugu Bindu Madhavi:

బిందు మాధవి కాన్ఫిడెన్స్ చూసి.. ఈ మదనపల్లి బ్యూటీ దగ్గర మ్యాటర్ ఉందనుకున్నారు. కానీ.. నలుగురు అనుకున్న దాని కంటే నాలుగు ఆకులు ఎక్కువే చదివింది బిందు. బాస్ నాన్ స్టాప్ టైటిల్ ఫేవరేట్‌గా దూసుకుపోతుంది. హౌస్‌‌ లో ఫస్ట్ డే నుంచి చాలా మెచ్యూర్డ్ గేమ్ ఆడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Also Read: AP New Districts: కొత్త జిల్లాల్లో బోలెడ‌న్ని డిమాండ్లు.. జ‌గ‌న్ ప‌ట్టించుకుంటారా.. ప‌క్క‌కు పెడ‌తారా..?

దాంతో బిందు మాధవి పై ఓట్ల వర్షం కురుస్తోంది. అసలు ఆమె మాత్రమే అందరికి ఎక్కువ ఫేవరేట్ కావడానికి కారణాలు చాలా ఉన్నాయి. పక్కవాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోదు. అలా అని చేతకాని దానిలా ఉండదు. ఎవరైనా తన జోలికి వస్తే మాత్రం.. వాళ్ళను అసలు వదిలిపెట్టదు. ఈ క్రమంలో ఎమోషనల్ అవుతూ అనవసరమైన డిస్కషన్స్ పెట్టదు.

సమస్య ఏమిటి ? ఆ సమస్య ఎవరి కారణంగా వచ్చింది ? ఇప్పుడేం చేయాలి ? ఇలా చెప్పాల్సిన విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెబుతుంది. ఆమె మాట్లాడే పాయింట్ టు పాయింట్ లో కావాల్సినంత మ్యాటర్ ఉంటుంది. ఆమె దెబ్బకు ఓ దశలో కంటెస్టెంట్లు అందరూ ఒక్కటి అయిపోయారు. మూకుమ్మడిగా ఆమె పై దాడికి దిగారు. కావాలని టార్గెట్ చేశారు.

Bigg Boss OTT Telugu Bindu Madhavi
Bigg Boss OTT Telugu Bindu Madhavi

మెయిన్ గా అఖిల్, అరియానా, తేజస్విని, అషురెడ్డి, నటరాజ్ మాస్టర్.. ఇలా ఇతర బ్యాచ్‌లు బిందు మాధవిని టార్గెట్ చేసి రౌండప్ చేసి మరీ టార్చర్ పెట్టినా.. ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా క్లారిటీతో ఒక్కొక్కరు చేసిన తప్పులను, చేస్తున్న పొరపాట్లును చెప్పి వాళ్ళ నోరూ మూయించింది. అందుకే, హౌస్‌లో ప్రస్తుతం బెటర్ కంటెస్టెంట్ గా బిందు మాధవి నిలిచింది.

మధ్యమధ్యలో టాప్ కంటెస్టెంట్ గా నిలుస్తున్న అఖిల్‌ సైతం, బిందు మాధవి గేమింగ్ విధానానికి తేలిపోతున్నాడు. అంత గొప్పగా బిందు మాధవి తన మెచ్యూర్డ్ గేమ్ తో అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇప్పుడున్న లెక్కలను బట్టి బిందు మాధవి ముందు అఖిల్ నిలబడటం ఇక కష్టమే.

దీనికితోడు బిందు మాధవికి హౌస్ లో పరిస్థితులు కూడా బాగా కలిసి వచ్చాయి. ముఖ్యంగా యాంకర్ శివతో ఫ్రెండ్ షిప్ చేయడం బిందు మాధవికి బాగా ప్లస్ అయ్యింది. అఖిల్, అజయ్, అనీల్ ఇలా ఎవరితో బిందు మాధవి క్లోజ్‌ గా మూవ్ అయినా ఆమె పై నెగిటివ్ ప్రచారానికి బాగా స్కోప్ వచ్చేది. యాంకర్ శివతో మాత్రం జస్ట్ ఫ్రెండ్ షిప్‌లాగే జనంలోకి వెళ్ళింది.

Bigg Boss OTT Telugu Bindu Madhavi
Bigg Boss OTT Telugu Bindu Madhavi

ఎలాగూ యాంకర్ శివ పులిహోర రాజాగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు. దాంతో బిందు మాధవి స్ట్రాంగ్ కావడానికి అతను ఒక సమిధిలా ఉపయోగపడుతున్నాడు. మొత్తానికి టైటిల్ కొట్టాలనే టార్గెటే కాదు, ప్లాన్ అండ్ విజన్ కూడా బిందు మాధవికి పుష్కలంగా ఉన్నాయి. అందుకే.. ఆమె టైటిల్ విన్నర్ అంటున్నారు బిగ్ బాస్ విశ్లేషకులు.

Also Read: BJP vs TRS: కేంద్రంలోని బీజేపీపై టీఆర్ఎస్ ‘తీర్మానాల’ పోరు.. ఫలిస్తుందా?

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

2 COMMENTS

  1. […] Rashmika Mandanna: క్యూట్ బ్యూటీ రష్మిక మందన్నా బాలీవుడ్ హీరోయిన్ గా బాగా పాపులర్ అవ్వాలని ఆశ పడుతుంది. దానికి తగ్గట్టుగానే బాలీవుడ్ సినిమాల కోసం అందాల ప్రదర్శనకు ఎలాంటి అడ్డు చెప్పడం లేదు. పాత్ర డిమాండ్ చేసినా చేయకపోయినా.. ఎలా కావాలి అంటే.. అలా కనిపిస్తాను అంటూ హిందీ మేకర్స్ కి ఇప్పటికే రష్మిక క్లారిటీ ఇచ్చింది. అందుకే, రష్మిక ఓ హాట్ ఫోటోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది బాగా వైరల్ అవుతుంది. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular