RRR Movie Box Office Collection: ‘ఆర్ఆర్ఆర్’ దెబ్బకు ప్రస్తుతం బాక్సాఫీస్ షేక్ అయిపోతుండోయ్. నేటి వరకూ సినీ జగత్తులో ఏ చిత్రానికి రాని విధంగా ఈ చిత్రానికి కరెన్సీ వర్షం కురుస్తోంది. మొత్తమ్మీద ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. తెలుగు రాష్ట్రాల నుంచి యూఎస్ఏ వరకూ భారీ వసూళ్లను నమోదు చేస్తోంది. అద్భుతమైన సక్సెస్‌తో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రబృందం వేడుకులు చేసుకుంటుంది. మరోపక్క ఎన్టీఆర్ – చరణ్ ఇద్దరూ స్పెషల్ ట్రీట్ ఇచ్చి మరీ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.
అయితే, ‘ఆర్ఆర్ఆర్’ వర్సెస్ ‘రాధేశ్యామ్’ వర్సెస్ ‘పుష్ప’ వర్సెస్ ‘భీమ్లా నాయక్’ కలెక్షన్స్ విషయానికి వస్తే.. భీమ్లా నాయక్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము లేపే కలెక్షన్స్ తో దంచి కొట్టింది. నిజానికి ఆంధ్రలో తక్కువ టికెట్ రేట్ల కారణంగా ‘భీమ్లా నాయక్’, పుష్ప చిత్రాలకు కొంత నష్టం కలిగింది. అయితే, బాక్స్ ఆఫీస్ దగ్గర నైజాంలో రికార్డ్ కలెక్షన్స్ తో రచ్చ చేశాయి ఈ రెండు చిత్రాలు.
Also Read: RRR AP & Telangana First Day Collections: ‘ఆర్ఆర్ఆర్’ ఏపీ & తెలంగాణ ఫస్ట్ డే కలెక్షన్స్
కానీ ‘భీమ్లా నాయక్’, ‘పుష్ప’ సినిమాల కలెక్షన్స్ కంటే.. ‘రాధేశ్యామ్’కి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు పుష్ప రూ. 16.70 కోట్ల షేర్ రాబడితే, ‘భీమ్లా నాయక్’ రూ. 19.80 కోట్ల షేర్ రాబట్టింది. ‘రాధేశ్యామ్’ విషయానికి వస్తే రూ. 21.14 కోట్లు వసూలు చేసింది. కానీ, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం రూ. 26.14 కోట్లు పైనే వసూలు చేసింది.
ఓవరాల్ గా పుష్ప మొదటి రోజు సినిమా 22 కోట్ల నుండి 24 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా… ‘భీమ్లా నాయక్’ మొదటి రోజు సినిమా 26 కోట్ల నుండి 27 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ‘రాధేశ్యామ్’ మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 36 కోట్ల షేర్ ను అందుకుంది. అదే, ‘ఆర్ఆర్ఆర్’ విషయానికి వస్తే.. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 47 కోట్ల నుంచి 53 కోట్ల రేంజ్ షేర్ ను అందుకోనుంది.
మొత్తమ్మీద ‘పుష్ప’, ‘భీమ్లా నాయక్’, ‘రాధేశ్యామ్’ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సాధించిన భారీ విజయం కంటే.. ‘ఆర్ఆర్ఆర్’ రెట్టింపు విజయాన్ని సాధించింది. భారతీయ సినీ చరిత్రలోనే సరికొత్త చరిత్రను సృష్టించింది.