Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ గేమ్ అంతా స్క్రిప్ట్ అనే వాదన ఎప్పటి నుండో ఉంది. హౌస్లోని కంటెస్టెంట్స్ ప్రవర్తన నుండి ఎలిమినేషన్స్ వరకు చాలా వరకు నిర్వాహకుల ఆదేశాల మేరకు జరుగుతాయని కొందరు నమ్ముతారు. దీన్ని హోస్ట్ నాగార్జున ఒప్పుకోరు. గత సీజన్స్ లో దీనిపై ఆయన ఓపెన్ కామెంట్ చేశారు. ప్రేక్షకుల ఓట్ల ఆధారంగానే కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ ఉంటుంది. అలాగే ఎలాంటి ప్రణాళిక ప్రకారం షో జరగదని చెప్పారు. పూర్తి స్థాయిలో బిగ్ బాస్ స్క్రిప్టెడ్ కాకపోయినా… టీఆర్పీ కోసం లేదా ముందుగా కంటెస్టెంట్స్ తో చేసుకున్న ఒప్పందం ప్రకారం షోని నడిపిస్తారనేది నిజం.

ఇక టైటిల్ విన్నర్ ని నాలుగైదు వారాల ముందే డిసైడ్ చేసేస్తారు. తాము అనుకున్న కంటెస్టెంట్ ని హోస్ట్ చేత పొగిడించి లేపుతూ ఉంటారు. ఆడియన్స్ ని కొన్ని వారాల ముందు నుండే మెంటల్ గా ప్రిపేర్ చేస్తారు. ఇక ఈ సీజన్ విన్నర్ గా రేవంత్ ని డిసైడ్ చేసేశారు. దీంతో రేవంత్ ని జాకీలతో లేపుతున్నారు. అతడి కంటే గొప్ప ప్లేయర్ లేదనే భావన కలిగించే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
టాస్క్ ఆడటంతో రేవంత్ కంటే తోపు లేదంటున్నారు. హౌస్లో టాస్క్స్ ప్రతి ఒక్కరూ ఆడుతున్నారు. బక్కపలచ ఫైమా కూడా ఏమాత్రం తగ్గకుండా తెగువ చూపిస్తుంది. కాబట్టి మాట తీరు కూడా ప్రధానం. ప్రవర్తనను కూడా పరిగణలోకి తీసుకోవాలి. మొదటి నుండి రేవంత్ హౌస్లో వరస్ట్ బిహేవియర్ కలిగి ఉన్నాడు. ఎదుటివాళ్లను చులకనగా చూసే అతిపెద్ద బ్యాడ్ క్వాలిటీ తనలో ఉంది. తాను తప్పులు చేస్తూ ఇతరుల తప్పులను మాత్రమే ఎత్తి చూపుతాడు. అగ్రెషన్ పేరుతో నోటికి ఏది వస్తే అది అనేయడం, అమ్మాయిలని కూడా చూడకుండా ఫిజికల్ అవుతాడు.
ఇంట్లో తిండి దొంగ ఎవరంటే అందరూ రేవంత్ అంటారు. కానీ ఇతరుల విషయంలో ఎక్కడలేని కండీషన్స్ పెడతాడు. ఇక రేవంత్ ని విన్నర్ ని చేసే క్రమంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని డీగ్రేడ్ చేయడం స్టార్ట్ చేశారు. దానిలో భాగంగా ఆదిరెడ్డి, ఇనయాలను నాగార్జున తీవ్ర స్థాయిలో తిడుతున్నాడు. కంటెస్టెంట్స్ ని నిలదీయాల్సిన ఎన్నో ముఖ్య విషయాలు పక్కన పెట్టి కప్పులు, ప్లేట్స్ విషయంలో టార్గెట్ చేస్తున్నాడు. విన్నర్ రేవంత్ అని నాగార్జున ఫిక్స్ చేశాడు. మిగతా వాళ్ళు ఎంత చించుకున్నా ప్రయోజనం లేదు.