బిగ్ బాస్ లీక్:ఈ వారం బిగ్ బాస్ నామినేషన్ లో ఉండేది వీరే..

ఉత్కంఠ మధ్య నిన్న బిగ్ బాస్ హౌస్ నుండి జరబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ ఎలిమినేట్ కావడం జరిగింది. నామినేషన్స్ లో ఉన్న నలుగురు సభ్యులలో మొదట అభిజిత్, తరువాత హారిక సేవ్ అయ్యారు. చివరకు మోనాల్, అవినాష్ మిగిలారు. నీటితో నింపి ఉన్న రెండు గాజు కుజాలు ఇద్దరి ముందు ఉంచిన నాగార్జున, వాళ్ళ చేతిలో ఉన్న లిక్విడ్ నీళ్లలో పోయాలి అన్నారు. లిక్విడ్ పోసినప్పుడు ఎవరి కూజాలో నీరు ఎరుపుగా మారుతాయో వారు ఎలిమినేటైనట్లు చెప్పాడు. అవినాష్ లిక్విడ్ పోసిన కూజాలోని నీరు ఎర్రగా […]

Written By: Neelambaram, Updated On : December 7, 2020 3:50 pm
Follow us on

ఉత్కంఠ మధ్య నిన్న బిగ్ బాస్ హౌస్ నుండి జరబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ ఎలిమినేట్ కావడం జరిగింది. నామినేషన్స్ లో ఉన్న నలుగురు సభ్యులలో మొదట అభిజిత్, తరువాత హారిక సేవ్ అయ్యారు. చివరకు మోనాల్, అవినాష్ మిగిలారు. నీటితో నింపి ఉన్న రెండు గాజు కుజాలు ఇద్దరి ముందు ఉంచిన నాగార్జున, వాళ్ళ చేతిలో ఉన్న లిక్విడ్ నీళ్లలో పోయాలి అన్నారు. లిక్విడ్ పోసినప్పుడు ఎవరి కూజాలో నీరు ఎరుపుగా మారుతాయో వారు ఎలిమినేటైనట్లు చెప్పాడు. అవినాష్ లిక్విడ్ పోసిన కూజాలోని నీరు ఎర్రగా మారడంతో, అవినాష్ ఎలిమినేట్ అయ్యాడు.

Also Read: మోనాల్ కోసం అవినాష్‌ బలి.. బిగ్ బాస్ పక్షపాత ధోరణి !
 
అవినాష్ ఎలిమినేషన్ తో హౌస్ లో ఆరుగురు సభ్యులు మిగిలారు. అభిజిత్, మోనాల్, అఖిల్, అరియనా, సోహైల్ మరియు హారిక హౌస్ లో ఉన్నారు. నేడు సోమవారం  కావడంతో బిగ్ బాస్ ఎలిమినేషన్స్ ప్రక్రియ మొదలుపెడతాడు. కాగా ఈ వారానికి గాను, ఎలిమినేషన్ కి నామినేటైన సభ్యుల సంఖ్య లీకైనట్లు తెలుస్తుంది. ఈ వారం ఆరుగురు సభ్యుల నుండి ఐదుగురు నామినేట్ అయ్యారట. సోహైల్, అరియనా, అభిజిత్, హారిక, మోనాల్  ఎలిమినేషన్స్ లో ఉన్నారని సమాచారం అందుతుంది.

Also Read: బిగ్ బాస్ ట్విస్ట్: షో నుంచి ఊహించని కంటెస్టెంట్ ఔట్.. ఎవరంటే?

 
టికెట్ టు ఫినాలే గెలుచుకున్న అఖిల్ ఈ వారం ఎలిమినేషన్స్ లిస్ట్ లో లేదు. ఇప్పటికే అఖిల్ నేరుగా ఫైనల్ కి బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న సంగతి తెలిసిందే. నామినేషన్స్ లో ఉన్న ఐదుగురిలో ఒకరు వచ్చే ఆదివారం ఎలిమినేట్ కానున్నారు. మిగిలిన నలుగురు అఖిల్ తో పాటు ఫైనల్ కి చేరుకుంటారు. ఫైనల్ కి చేరిన టాప్ ఫైవ్ నుండి ఇద్దరు టాప్ టూకి , వాళ్ళిద్దరిలో ఒకరు విన్నర్, మరొకరు రన్నర్ గా నిలవనున్నారు. టైటిల్ ఫేవరేట్స్ గా అఖిల్, అభిజిత్, సోహైల్ మరియు అరియనా ఉన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్