
గురుకుల పీఈటీ మహిళా అభ్యర్థులు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ ముట్టడించారు.. సోమవారం పెద్ద ఎత్తున మహిళలు విజిల్ సౌండ్‌లతో సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. వరంగల్, నాగర్ కర్నూల్, మహాబూబ్‌నగర్, ఖమ్మం, కరీంనగర్ నుంచి ఈ ముట్టడికి భారీగా అభ్యర్థులు తరలివచ్చారు. 2018 నుంచి గురుకుల పీఈటీ ఫలితాలు విడుదల చేయడంలేదని ఆందోళన చేస్తున్నామన్నారు.